For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్మస్ కు ముందే ఇలా ప్లాన్ చేసుకోండి... మీరు కోరుకున్నంత ఎంజాయ్ చేయండి...

క్రిస్టమస్ పండుగను జరుపుకునేందుకు ఈ పనులను తప్పక చేయండి.

|

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. అందుకే ఇక్కడ అన్ని మతాల వారు జీవిస్తుంటారు. అంతేకాదు అందరూ కలిసి మెలసి అన్ని పండుగలనూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

How to Enjoy Christmas Day Spent All by Yourself

మనలో కూడా ఎంతోమందికి క్రిస్టియన్ సోదరులు మరియు స్నేహితులు ఉండే ఉంటారు. అలాంటి వారందరికీ క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆ పండుగ ఆనందాన్ని వారితో పంచుకోవచ్చు.

How to Enjoy Christmas Day Spent All by Yourself

సాధారణంగా క్రిస్మస్ పండుగ అంటే అనేక చోట్ల పిల్లలు, పెద్దలందరూ కలిసి చర్చిలలో పార్టీలు చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ పార్టీలను చేసుకునే సంప్రదాయం ఎన్న ఏళ్ల నుండి వస్తూనే ఉంది. ఎందుకంటే చాలా మంది అందులోనే ఆనందం.. పరమార్థం ఉందని భావిస్తారు.

How to Enjoy Christmas Day Spent All by Yourself

ఈ నేపథ్యంలో పండుగ కంటే ముందే మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు వచ్చే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాల్సిందే. ఈ క్రమంలో మీరు కూడా.. క్రిస్మస్ పండుగ సమీపిస్తున్నందున వారితో కలిసి మీ స్నేహితులలో ఆనందాన్ని నింపడానికి ఇలా ప్లాన్ చేయండి.. వారిని సర్ ప్రైజ్ చేయండి....

అలా మారిపోండి..

అలా మారిపోండి..

క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలా మంది స్రీకెట్ గిఫ్టులు ఇస్తూ తమ స్నేహితులను సర్ ప్రైజ్ చేస్తుంటారు. ఈ పండుగ సందర్భంగా తమ బహుమతుల కోసం చాలా మంది ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అందుకే ఈసారి మీరే శాంటా క్లాజ్ గా మారిపోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకే కాదు.. రాత్రిళ్లు మురికివాడలకు వెళ్లి అక్కడి పిల్లలకు కూడా బహుమతులను అందించండి. దీని వల్ల మీకు ఎంతో ఆనందం వస్తుంది.

అక్కడ గడపండి..

అక్కడ గడపండి..

సాధారణంగా క్రిస్మస్ సందర్భంగా చాలా మంది శాంటాగా మారిపోయి కుటుంబసభ్యులు, స్నేహితులను అలరిస్తుంటారు. అయితే ఇలాంటి గిఫ్టులు అవసరమున్న వారు ఎంతో మందే ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యమైన వారు అనాథశ్రమంలో ఉండే చిన్నారులు. ఎందుకంటే వారు అడిగింది కొనివ్వడానికి వారికి అమ్మనాన్న కూడా ఉండరు. కాబట్టి క్రిస్మస్ సమయంలో వారికి మంచి బహుమతులను కొనిచ్చి.. వారితో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోండి..

ప్రత్యేక వంటకాలు..

ప్రత్యేక వంటకాలు..

సాధారణంగా క్రిస్మస్ పండుగ వస్తోందంటే చాలా మంది కేకులు, కుకీస్, పెస్ట్రీలు, హాట్ చాక్లెట్ వంటివి తయారుచేస్తుంటారు. ఈ క్రమంలో మీరు, మీ స్నేహితులు మీ కుటుంబసభ్యులు మీకిష్టమైన వంటకాలను మరియు ప్రత్యేక వంటకాలను తయారు చేయండి. క్రిస్మస్ స్పెషల్ వంటకాలు చాలానే ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి.

వాటిని గుర్తుచేసుకోండి..

వాటిని గుర్తుచేసుకోండి..

క్రిస్మస్ పండుగ అనగానే చాలా మంది టక్కున గుర్తొచ్చేవి మూడు విషయాలు. ఒకటి క్రిస్మస్ కేకు, రెండు క్రిస్మస్ ట్రీ, మూడు శాంటా క్లాజ్. అందుకే మీరు కూడా ఈ క్రిస్మస్ సమయంలో మీ క్రియేటివ్ థాట్స్ తో మీ ఇంట్లోని క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించండి. దాని కింద కొన్ని గిఫ్టులను కూడా పెట్టండి. దీని వల్ల మీ క్రియెటివిటీ కూడా పెరుగుతుంది.

స్నేహితులతో పార్టీ..

స్నేహితులతో పార్టీ..

మీ స్నేహితులతో పార్టీ చేసుకోవడం అనేది ఎప్పుడైనా సరదాగా జరుగుతూ ఉంటుంది. కానీ క్రిస్మస్ టైములో ఆనందంగా గడిపేందుకు చేసుకునే పార్టీలు చాలా డిఫరెంట్ గా ఉండాలని గుర్తుంచుకోండి. అందుకే ఇలాంటి పార్టీలను హోటల్ లో లేదా ఎక్కడో బయటి ప్రదేశాలలో కాకుండా మీ ఇంట్లోనే జరుపుకోండి. వీలుంటే లైట్లతో మీ ఇంటినే డిస్కోలా మార్చేయండి.

డెకరేషన్..

డెకరేషన్..

మన దేశంలో ఏ పండుగ వచ్చినా ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రం చేసి, గదులను అందంగా అలంకరించడం అనేది ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా ఎప్పటిలా కాకుండా.. కొంచెం కొత్తగా ప్రయత్నించండి. చిన్న చిన్న స్టార్స్, గిఫ్ట్ బాక్సులు, పేపర్ ఫ్లవర్స్ తో పాటు క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయగా మిగిలిన వస్తువులతో పాటు ఇంటిని కూడా డెకరేట్ చేయొచ్చు.

మీ మనసుకు నచ్చినవారితో..

మీ మనసుకు నచ్చినవారితో..

క్రిస్మస్ సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న తర్వాత.. మీ మీనసుకు నచ్చిన వారితో చక్కని రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకోండి. అందులో క్రిస్మస్ స్పెషల్ రెసిపీస్ అన్ని ఉండేలా చూసుకోండి. మీరు చేయలేకపోతే.. హోటల్ కి వెళ్లినా పర్వాలేదు.

English summary

How to Enjoy Christmas Day Spent All by Yourself

Here we talking about the how to enjoy chirstmas day spent all by yourself. Read on.
Desktop Bottom Promotion