For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐపీఎల్ 2020 : సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్, రియాక్షన్లు చూస్తే నవ్వు ఆపుకోలేరు...!

|

క్రికెట్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) టోర్నీ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ అంటేనే ఆకాశాన్ని అంటే సిక్సర్లు.. బౌండరీల వర్షం.. చిరుతపులి లాంటి పరుగులు.. రాకెట్ లా దూసుకొచ్చే బంతులు..

PC : Twitter

మైదానంలో ఉన్న వారితో పాటు.. మైదానం బయట మరియు టీవీలో, స్మార్ట్ ఫోన్లలో వీక్షించే వారికి ఒకటే ఉత్కంఠ. ఎవ్వరు ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు చేస్తారో ఎవ్వరికీ తెలీదు. మ్యాచ్ గెలవాలంటే ఆఖరి బంతి వరకు ఉత్కంఠ పోరు జరగాల్సిందే.

PC : Twitter

ఆహ్లాదకరమైన అరేబీయన్ దీవుల్లో ఐపిఎల్-13 సీజన్ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కరోనా సమయంలో వాయిదా పడ్డప్పటికీ, యూఏఈలో దాని ప్రభావం తక్కువగా ఉన్న కారణంగా ఇక్కడుండే మూడు మైదానాల్లో నవంబర్ 10వ తేదీ వరకు మ్యాచ్ లు జరగనున్నాయి.

PC : Twitter

ఇదిలా ఉంటే ఐపిఎల్ అంటే కేవలం సిక్సర్లు.. ఫోర్లే కాదు.. అంతకంటే ఎక్కువ ఆనందాన్ని, కిక్ ఇచ్చేవి కూడా ఉన్నాయి. అది కూడా ఐపీఎల్ కు సంబంధించిందే. ఇంతకీ ఏంటా అది ఆలోచిస్తున్నారా? అదేనండి ఐపీఎల్ టోర్నమెంటు ఫన్నీ మీమ్స్, ట్విట్టర్లో అభిమానుల ట్వీట్లు.. చూస్తేనే కడుపుబ్బా నవ్వు తెప్పించే వీడియోలు. ఐపీఎల్ ప్రారంభం కాకముందే క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తున్నారు. తమ అభిమాన టీమ్ ఈసారి కచ్చితంగా కొడుతుందని.. మిగిలిన టీములన్నీ దుకాణం సర్దేయాల్సిందే అని తెగ హల్ చల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి వాటిలో కొన్ని బాగా వైరల్ అయిపోయాయి. అలాంటి వాటిలో కొన్ని ట్రెండింగ్ వీడియోలు, మీమ్స్, ఫన్నీ ట్వీట్లను మీ కోసం తీసుకొచ్చాం... వీటిని చూస్తే మీరు కచ్చితంగా నవ్వు ఆపుకోలేరు. కావాలంటే మాది గ్యారంటీ... ఇంకెందుకు ఫన్నీ వీడియోలు, మీమ్స్, ట్వీట్లపై మీరు కూడా ఓ లుక్కేయండి...

బాహుబలి వీడియో...

ఐపీఎల్ 2020కి, బాహుబలి వార్ సీన్ కు లింక్ పెడుతూ ఎడిట్ చూస్తే మీరు కచ్చితంగా నవ్వి తీరుతారు. ఈ వీడియోలో రమ్యక్రిష్ణ, కట్టప్పను సమరశంఖం పూరించమని ఆదేశిస్తుంది. అంతే వెంటనే ఐపీఎల్ మ్యూజిక్ వస్తుంది. అంతేకాదండోయ్ ఇదే 30 సెకన్ల నిడివి ఉండే వీడియోలో రజనీకాంత్ పిల్లనగ్రోవి ఊదటం, బ్రహ్మనందం డప్పు.. బాలయ్య పైసా వసూల్ డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

మూట ఎత్తడానికి..

మరో వీడియోలో ఓ పెద్దాయన తన ముఠా ఎత్తేందుకు బస్సు ఎక్కేలా బిల్డప్ ఇచ్చి, ఆ బస్సులోని కండక్టర్ ను కిందికి పిలుస్తాడు. తీరా మూట ఎత్తి బస్సులో పెట్టేందుకు లగేజీ డోర్ తీసేలోపు, ఆ పెద్దాయన తను రివర్స్ లో వెళ్లిపోతాడు. ఈ వీడియోను కూడా ముంబై ఇండియన్స్ కు, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు లింక్ పెడుతూ ఎడిట్ చేసేశారు.

నాగిని డ్యాన్స్ వీడియో...

ఆమ్రిష్ పూరి నాగస్వరంతో ఊదుతుండగా.. శ్రీదేవి నాట్యం చేస్తున్న వీడియోను ఐపిఎల్ కు ఎలా ఎడిటింగ్ చేసుకున్నారో చూడండి... దీన్ని చూసిన మీరు కచ్చితంగా నవ్వు ఆపుకోలేరు...

ఒక్కడే రౌడీ అంటూ..

మన తెలుగు వారు కూడా ఐపీఎల్ ట్రోఫీపై తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. అందులో విక్రమార్కుడు సినిమాలోని రవితేజ డైలాగ్ ని ఈ ఐపీఎల్ కి ఎలా లింక్ చేశారో చూడండి...

పర్మినెంట్ ప్లేయర్..

ఈ ఫొటోలో నానా పటేకర్ ఫొటోను ఎడిట్ చేసి, నేను పర్మినెంటుగా ప్లే ఆఫ్ లో ఉంటాను అనే అర్థం వచ్చేలా ఉండే పోస్టు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది.

ఐపిఎల్ కోసం ఎదురుచూస్తూ..

మిస్టర్ బీన్ ను కూడా ఐపీఎల్ ట్రోలింగుకు వాడుకున్నారు. ఈ ఫొటోను చూసిన వారంతా పొట్ట చెక్కలయ్యేలా తెగ నవ్వేసుకుంటున్నారు.

ముస్తాబైన స్టేడియాలు..

మరో క్రికెట్ అభిమాని దుబాయ్ మరియు అబుదాబీలోని అందమైన స్టేడియాల ఫొటోలను, కలర్ ఫుల్ లైటింగుతో డెకరేషన్ చేసిన స్టేడియం ఫొటోలను ట్విటర్లో షేర్ చేసుకున్నారు.

English summary

IPL 2020 : CSK Vs MI Fans Share memes, twitter reactions, videos to cheer up teams

Here we talking about the IPL 2020 : CSK Vs MI fans share memes, twitter reactions, videos to cheer up teams. Take a look