For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mawsynram: అత్యధిక వానలు పడే ప్రాంతం మాసిన్రాం.. అక్కడ ప్రజలు ఎలా నివసిస్తారో తెలుసా?

మేఘాలయ రాష్ట్రంలోని ఖాసీ కొండల్లో ఉంటుంది మాసిన్రాం ప్రాంతం. చాలా ఎత్తయిన ప్రాంతంలో ఉంటుంది మాసిన్రాం. బంగాళాఖాతం నుంచి వచ్చే చల్లని గాలుల వల్ల ఇక్కడ ఎప్పుడూ తేమ ఎక్కువగా ఉంటుంది.

|

Mawsynram: కొద్దిపాటి వర్షానికే అల్లాడిపోతున్నాం. ఓ వారం రోజుల పాటు ఎడతెరిపిలేకుండా తుంపర్లు పడితే ఇదేం వాన అనుకుంటున్నాం. కానీ కొన్ని ప్రాంతాల్లో వానలు నిత్యం ఉంటాయి. వాన పడ్డ ప్రతిసారీ కుండపోతగా కురుస్తుంది. అలాంటి ప్రాంతాల్లో మేఘాలయలోని మాసిన్రాం ఒకటి. ఎక్కువగా వర్షాలు పడే ప్రాంతాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా మంది చిరపుంజీ అంటారు. మాసిన్రాం ప్రాంతానికి చిరపుంజీ కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక తేమ గల ప్రాంతంగా మాసిన్రాం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

వార్షిక సగటు వర్షపాతం ఎంత?

వార్షిక సగటు వర్షపాతం ఎంత?

నైన్ నైట్స్ నైన్ డేస్ అనే మాట ఈ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ మాటకు అర్థం. పగలు, రాత్రి ఆగకుండా, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని దాని అర్థం. మాసిన్రాం ప్రాంతంలో సంవత్సరంలో సగటున 11,872 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది.

మాసిన్రాం ఎక్కడ ఉంటుంది?

మాసిన్రాం ఎక్కడ ఉంటుంది?

మేఘాలయ రాష్ట్రంలోని ఖాసీ కొండల్లో ఉంటుంది మాసిన్రాం ప్రాంతం. చాలా ఎత్తయిన ప్రాంతంలో ఉంటుంది మాసిన్రాం. బంగాళాఖాతం నుంచి వచ్చే చల్లని గాలుల వల్ల ఇక్కడ ఎప్పుడూ తేమ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని అత్యధిక తేమ(Wettest place on the planet) ఉన్న ప్రాంతంగా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు కల్పించారు.

రికార్టుస్థాయిలో వర్షపాతం నమోదు

రికార్టుస్థాయిలో వర్షపాతం నమోదు

చిరపుంజికి మాసిన్రాం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటీవలి కాలంలో మాసిన్రాం ప్రాంతంలో వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదు అయింది. జూన్ 16న మాసిన్రాం లో 24 గంటల వ్యవధిలో ఏకంగా 1003.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఏడాదిలో కురవాల్సిన వానలో 10శాతం వాన ఒక్క రోజులోనే కురిసింది ఇక్కడ. గతంలో ఇక్కడ 945.4 మిల్లీమీటర్ల రికార్డును నెలకొల్పగా.. ఇటీవల వర్షపాతం ఆ రికార్డును సైతం బద్దలు కొట్టింది.

మాసిన్రాం ప్రజల జీవన విధానం

మాసిన్రాం ప్రజల జీవన విధానం

మాసిన్రాం ప్రాంతంలో దాదాపు 4 వేల మంది మాత్రమే ఉంటారు. ఇక్కడ ఎప్పుడూ వర్షాలు పడటంతో వాతావరణం ఎప్పుడూ తేమగానే ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది. దుస్తులు, ఆహారం, పనులు ఇలా అన్నీ మామూలు ప్రాంతాల్లోకి భిన్నంగా ఉంటాయి.

Life in Mawsynram during the monsoon- receives highest rainfall

* ఇక్కడ నివసించే వారు ఎప్పుడూ గొడుగులు ధరిస్తారు. ఇవి మన గొడుగుల్లా ఉండవు. వీటిని స్థానికంగా నప్ అని పిలుస్తారు.వీటిని వెదురుతో తయారు చేస్తారు. ఇంటి నుండి ఎప్పుడు బయటకు వెళ్లినా ఈ నప్ లను వెంటే ఉంచుకుంటారు.

Life in Mawsynram during the monsoon- receives highest rainfall

* వర్షం ఎప్పుడూ ఇక్కడ పడుతూనే ఉంటుంది. ఉతుక్కున్న బట్టలు ఆరుబయట ఆరబెట్టలేరు. కాబట్టి వాటిని మెటల్ డ్రైయర్ లలో ఉంచి ఆరబెడతారు.
* ఎడతెరిపిలేని వానలతో ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో హీటర్ తప్పనిసరి.

Life in Mawsynram during the monsoon- receives highest rainfall

* ఇక్కడి ఇళ్లు బయట, లోపలా తేమగానే ఉంటాయి. వానలతో పొగమంచు ఇళ్లళ్లోకి ప్రవేశించి ఇలా తేమగా మారుతాయి.

Life in Mawsynram during the monsoon- receives highest rainfall

* ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్యవసాయం సాధ్యం కాదు. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి లాంటి పంటలు కూడా ఇక్కడ పండలేవు. కూరగాయలు, నిత్యావసర సరుకులు వేరే ప్రాంతాల నుండి తెచ్చుకుంటారు.

Life in Mawsynram during the monsoon- receives highest rainfall

* స్థానికులు చిన్న చిన్న వ్యాపారుల చేసుకుంటారు. ఇక్కడ ఎలాగూ కూరగాయలు, నిత్యవసర సరుకులు దొరకవు కాబట్టి వాటిని విక్రయిస్తుంటారు.

Life in Mawsynram during the monsoon- receives highest rainfall

* మే నుండి అక్టోబర్ నెల వరకు ఇక్కడ భారీ వర్షాలు కురుస్తుంటాయి. కుండపోత కారణంగా ఆ సమయంలో వారాలపాటు సూర్యుడు కనిపించడు. ఈ నెలల్లో ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటకు రారు. ఆయా నెలల్లో బంగాళాదుంపలు ఎక్కువగా తింటారు.

Life in Mawsynram during the monsoon- receives highest rainfall

* ఎప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి రోడ్లు, వంతెనలు ఎప్పుడూ పాడవుతూనే ఉంటాయి. రబ్బరు, వెదురుతో చిన్నపాటి బ్రిడ్జిలు నిర్మించుకుంటారు.

Life in Mawsynram during the monsoon- receives highest rainfall

* ఇక్కడ ప్రకృతి అందాలు చూసేందుకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ జలపాతాలు, పొగమంచు, దట్టమైన మేఘాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

Life in Mawsynram during the monsoon- receives highest rainfall

* మాసిన్రాం సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన మాజింబ్యూయిన్ కేవ్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

English summary

Life in Mawsynram during the monsoon- receives highest rainfall

read on to know Life in Mawsynram during the monsoon- receives highest rainfall
Story first published:Tuesday, July 26, 2022, 12:50 [IST]
Desktop Bottom Promotion