Just In
- 2 hrs ago
Today Rasi Phalalu: మకర రాశి వారు ఈ రోజు కొన్ని శుభవార్తలను అందుకోవడానికి బలమైన అవకాశం ఉంది
- 13 hrs ago
Health Tips: Healthy Fatty Foods:ఈ కొవ్వు పదార్ధాలు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడి, గుండెపోటును నివారిస్తాయి..
- 14 hrs ago
Common Relationship Problems: ప్రతి రాశికి ఉండే 5 సాధారణ సమస్యలు ఏమిటో మీకు తెలుసా?
- 14 hrs ago
Amazon Sale: పిల్లలను ఆకట్టుకునే ఆటబొమ్మలు, పెద్దలను అలరించే డిస్కౌంట్లు..
Don't Miss
- News
మనీశ్ సిసోడియా ఇళ్లలో సోదాలు పూర్తి.. ఆర్టికల్‌పై కామెంట్ప్‌పై న్యూయార్క్ టైమ్స్ గుర్రు
- Movies
Thiruchitrambalam day 2 collections బాక్సాఫీస్ వద్ద ధనుష్ హంగామా
- Sports
World Test championship: ఇంగ్లాండ్‌పై గెలుపుతో అగ్రస్థానంలో సౌతాఫ్రికా.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే?
- Technology
త్వరలో భారత్‌లోకి 180W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా గల మొబైల్!
- Finance
Crorepati Tips: రూ.27 లక్షలకు 73 లక్షలు లాభం.. ఈ ఫార్ములాతో మీరే కోటీశ్వరులు.. పొదుపు పాఠాలు
- Automobiles
కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?
- Travel
బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం
అంగారకుడు మేషంలోకి రవాణా చేసే వేళ.. ఈ రాశులకు నష్టం...!
జ్యోతిష్యశాస్త్రం ప్రతి నెలలో నవ గ్రహాలలో ఏదో ఒక గ్రహం తమ స్థానాన్ని మారుతూ ఉంటాయి. ఇలా తమ రాశిని మారిన ప్రతిసారీ ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.
ప్రతి ఒక్క గ్రహం దాని స్వభావాన్ని బట్టి శుభ ఫలితాలను మరియు అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే అన్ని గ్రహాలలో అంగారకుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంగారకుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో జూన్ 27వ తేదీన అంటే సోమవారం రోజున ఉదయం 5:39 గంటలకు కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ రాశిలో రాహువు సంచారం చేస్తున్నాడు. రాహువు, కుజుడు కలయికతో అంగారక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ద్వాదశ రాశుల వారిలో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.. జాగ్రత్త పడండి...

మేష రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మేష రాశిలో రాహువు కూడా సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావం మేషరాశిపై ఎక్కువగా ఉంటుంది. దీన్నే అంగారక యోగం అని కూడా అంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడొచ్చు. ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం సమయంలో ఖర్చులు పెరగొచ్చు. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ కాలంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు మీపై కుట్ర పన్నినా మీరు విజయం సాధిస్తారు. తోబుట్టువులతో మాట్లాడుతున్నప్పుడు వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఉద్యోగులు కార్యాలయంలో గొడవలకు దూరంగా ఉండాలి. ఈ కాలంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి హనుమంతుడిని ఆరాధించాలి.

కన్య రాశి..
ఈ రాశి వారికి అంగారకుడి సంచారం సమయంలో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు పొదుపుగా మరియు తెలివిగా తినాలి. మసాలా మరియు జంక్ ఫుడ్ ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఈ సమయంలో కెరీర్ మరియు కుటుంబ జీవితం కూడా అస్థిరంగా ఉంటుంది. మీ సోదరులు మరియు సోదరీమణుల మద్దతును పొందుతారు. మీరు చాలా విషయాల్లో నిరాశను ఎదుర్కోవాల్సి వస్తుంది.

తుల రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు ఎక్కువ సమయం కోపంగా ఉంటే నిరాశకు గురి కావాల్సి వస్తుంది. అయితే మీరు శక్తివంతంగా ఉంటారు. కానీ మీ ప్రయత్నాలు ఫలించవు. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా రాకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో కలహాలు మరియు వాదనలకు కారణం కావొచ్చు. కెరీర్ పరంగా మంచి సమయం ఉంది. కానీ సంబంధాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి అంగారక సంచారం సమయంలో ప్రతికూల సమస్యలు రానున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు పెరగొచ్చు. ఈ కాలంలో మీ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఖర్చులపై శ్రద్ధ వహించాలి. మీ పనులు పెండింగులో పడొచ్చు. వ్యాపారులకు ఈ కాలంలో కొంత నష్టం రావొచ్చు. మీరు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.