For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Monthly Horoscope: మే మాసంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికను బట్టి, రాశిచక్రాల ఆధారంగా 2021 సంవత్సరంలోని మే మాసంలో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోవచ్చు.

ఈ నెలలో కొన్ని రాశుల ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు తొందరపడకూడదు. మీరు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. మరోవైపు కొందరు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే మీరు మరింత కష్టపడాలి. వ్యాపారులు ఈ సమయంలో ఆర్థిక పరంగా కొంత నష్టం ఉండొచ్చు. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలా మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఏప్రిల్ మాసంలో ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో.. ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Mercury Transit in Taurus on 1st May : వృషభంలోకి బుధుడి సంచారం... ఈ రాశులకు ప్రత్యేకం...!

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

ఈ రాశి వరికి ఈ నెలలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ నెల మధ్యలో కొన్ని పెద్ద సమస్యలు ఎదురుకావొచ్చు. ఈ కాలంలో, మీ పనితీరుకు సంబంధించి చాలా ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగులకు ఆఫీసులో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ యజమాని కూడా మీ పని పట్ల అసంతృప్తిగా ఉంటారు. సోమరితనం మానేయడం ద్వారా మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నించడం మంచిది. లేకపోతే మీ ఉద్యోగం ప్రమాదంలో పడవచ్చు. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మీరు పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. వ్యాపారులు ఈ నెలలో ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు మంచిగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులలో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీరు అనవసరంగా ఇంటి నుండి బయటపడకుండా ఉండాలి. మీరు లాక్డౌన్ నియమాలను కూడా ఖచ్చితంగా పాటించాలి.

రాశిచక్ర మూలకం : అగ్ని

రాశి చక్ర గ్రహం : మార్స్

లక్కీ నంబర్లు : 2, 19, 27, 38, 42, 50

లక్కీ డేస్ : సోమవారం, ఆదివారం, బుధవారం, శనివారం

లక్కీ కలర్స్ : డార్క్ గ్రీన్, క్రీమ్, రెడ్, స్కై బ్లూ

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈ నెలలో పనికి సంబంధించి కొన్ని పెద్ద మార్పులు రావొచ్చు. ఉద్యోగులు ఈ నెలలో కావాల్సిన బదిలీ పొందే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేసే వారు సరైన ఫలితాలను పొందొచ్చు. అయితే, మీరు చాలా కష్టపడి పనిచేయాలి. ఫైనాన్స్‌కు సంబంధించిన వ్యాపారం చేసే ప్రజలకు ఈనెల చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు విపరీతమైన ప్రయోజనం పొందవచ్చు. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ సోదరులు లేదా సోదరీమణులు వివాహానికి అర్హులు అయితే, వారి కోసం మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. త్వరలో మీ ఇంట్లో వివాహ కార్యక్రమం నిర్వహించొచ్చు. మీరు వివాహం చేసుకుంటే మీ వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది. మీ పిల్లల విద్యకు సంబంధించి ఈ నెలలో మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్య పరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు పెరుగుతాయి.

రాశిచక్ర మూలకం : భూమి

రాశి చక్ర గ్రహం : శుక్రుడు

లక్కీ నంబర్లు : 1, 16, 20, 30, 41, 52

లక్కీ డేస్ : ఆదివారం, సోమవారం, బుధవారం, మంగళవారం

లక్కీ కలర్స్ : వైట్, ఎల్లో, క్రీమ్, పింక్, స్కై బ్లూ

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ప్రైవేట్ ఉద్యోగులకు ఈ నెలలో చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి మీరు చాలా అసురక్షితంగా భావిస్తారు. మరోవైపు చిన్న వ్యాపారులు ఈ కాలంలో ప్రయోజనాలను పొందొచ్చు. ఇంకోవైపు, స్టాక్ మార్కెట్లో పనిచేసే ప్రజలు తమ నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. నెల ప్రారంభంలో విద్యార్థులకు మంచిది కాదు. కానీ నెల చివరిలో, పరిస్థితిలో కొంత మెరుగుదల ఉండొచ్చు. ఈ కాలంలో, మీరు మీ అధ్యయనాలపై బాగా దృష్టి పెట్టగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో, మీ ఖర్చుల జాబితా కొద్దిగా పెరుగుతుంది. అయితే, మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. మీ తల్లిదండ్రులతో మీకు మంచి సంబంధం ఉంటుంది. ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. మరోవైపు, జీవిత భాగస్వామితో ఈసారి కష్టంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి.

రాశిచక్ర మూలకం : గాలి

రాశి చక్ర గ్రహం : మెర్క్యురీ

లక్కీ నంబర్లు : 4, 8, 23, 30, 49, 52

లక్కీ డేస్ : మంగళవారం, గురువారం, శనివారం, సోమవారం

లక్కీ కలర్స్ : డార్క్ బ్లూ, రోజ్, పర్పుల్, స్కై బ్లూ

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైనది. మీరు వ్యాపారం చేస్తే, ఈ కాలంలో మీరు మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు భాగస్వామ్యంతో కొంత పని చేయాలనుకుంటే మీకు మంచి ప్రణాళిక అవసరం. అదే సమయంలో, ఈనెల ఉపాధి ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మీ ప్రమోషన్ చాలా కాలంగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉంటే, ఈ నెలలో మీరు శుభవార్త వినొచ్చు. మీరు అద్దె ఇంట్లో నివసిస్తూ, మీ సొంత ఇంటి గురించి కలలు కంటుంటే, నెల చివరి నాటికి మీ కోరిక కూడా నెరవేరుతుంది. ఆరోగ్య పరంగా ఈ నెలలో కొంత ఒత్తిడి ఉంటుంది.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం : చంద్రుడు

లక్కీ నంబర్లు : 5, 12, 29, 38, 46, 54

లక్కీ డేస్ : ఆదివారం, శనివారం, బుధవారం, శుక్రవారం

లక్కీ కలర్స్ : రెడ్, ఆరెంజ్, మెరూన్, ఎల్లో, పర్పుల్

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టొచ్చు. ఉద్యోగులు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కాకుండా, మీరు మీ వ్యక్తిగత జీవితం గురించి ఇతరులతో ఎక్కువగా మాట్లాడకూడదు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. ముందుకు సాగడానికి ప్రయత్నించండి. వ్యాపారులు ఈ నెలలో ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నెల ప్రారంభంలో మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా శారీరకంగా బలంగా ఉండటానికి మీరు మీ మానసిక శాంతిని కాపాడుకోవాలి.

రాశిచక్ర మూలకం : అగ్ని

రాశి చక్ర గ్రహం : సూర్యుడు

లక్కీ నంబర్లు : 4, 7, 12, 29, 35, 45, 53

లక్కీ డేస్ : సోమవారం, శుక్రవారం, గురువారం, మంగళవారం

లక్కీ కలర్స్ : పింక్, మెరూన్, ఆరెంజ్, బ్లూ, ఎల్లో

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్య పరంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. ముఖ్యంగా మీరు మీ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రైవేట్ ఉద్యోగులు ఈ కాలంలో నిరాశ చెందొచ్చు. మీరు కష్టపడి పనిచేసినప్పటికీ, ఆశించిన విధంగా ఫలితాలను పొందకపోతే మీ విశ్వాసం క్షీణిస్తుంది. అయితే, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మీరు సహనంతో పనిచేయాలి. సమయం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ కృషి ఫలాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి చిన్న పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే మీరు అనేక నష్టాలు ఎదుర్కోవచ్చు. మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే, మీరు మీ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలి. మీ జీవిత భాగస్వామితో ఈ సమయం ఆనందంతో గడుపుతారు.

రాశిచక్ర మూలకం : భూమి

రాశి చక్ర గ్రహం : మెర్క్యూరీ

లక్కీ నంబర్లు : 2, 11, 20, 35, 46, 52

లక్కీ డేస్ : మంగళవారం, గురువారం, సోమవారం, బుధవారం

లక్కీ కలర్స్ : ఎల్లో, రెడ్, రోజ్, వైట్, స్కై బ్లూ

బుధుడు వృషభంలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు...!

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈ నెల ప్రారంభంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనవచ్చు. కానీ త్వరలో మీ ఇబ్బందులు అంతమవుతాయి. అయితే, ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఓపిక పట్టాలి. ఆర్థిక విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసరమైన ఖర్చులను నివారించండి. మీరు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. ఉద్యోగులకు ఈ నెలలో సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో, మీ పనులు సజావుగా పూర్తవుతాయి. ఎప్పటికప్పుడు, మీరు సీనియర్ అధికారులు మరియు బాస్ నుండి మార్గదర్శకత్వం కూడా అందుకుంటారు. మరోవైపు, మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, ఈ కాలంలో పరిస్థితులు సరిగ్గా ఉండవు. మీరు మీ వ్యాపార ప్రణాళికల్లో కొన్ని మార్పులు కూడా చేయవచ్చు. మీ కుటుంబ జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో గొడవలు పెరగొచ్చు. ఈ కాలంలో పిల్లల ఆరోగ్యం గురించి మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈ కాలంలో మీకు అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉండొచ్చు.

రాశిచక్ర మూలకం : గాలి

రాశి చక్ర గ్రహం : శుక్రుడు

లక్కీ నంబర్లు : 4, 12, 23, 37, 44, 59

లక్కీ డేస్ : బుధవారం, శనివారం, గురువారం, ఆదివారం

లక్కీ కలర్స్ : రెడ్, ఆరెంజ్, పసుపు, మెరూన్

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల కారణంగా, మీ ఇంట్లో వివాదం జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా, మీ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడానికి మీరు మీ వంతు కృషి చేస్తారు. త్వరలో మీరు ఈ ప్రయత్నంలో విజయం సాధించగలరు. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ సంబంధం మధురంగా ​​ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ నెలలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో, మీ ఆర్థిక ప్రయత్నాలు ఏవైనా విజయవంతమవుతాయి. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. ఈనెల చివరి నాటికి మీ ఆర్థిక స్థితిలో పెద్ద మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారులకు ఈ నెలలో మంచి అవకాశం దక్కొచ్చు. ఈ నెల చివర్లో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. దీంతో మీరు వైద్యులను ఎక్కువ సార్లు సంప్రదించాల్సి ఉంటుంది.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం : మార్స్ అండ్ ఫ్లూటో

లక్కీ నంబర్లు : 7, 11, 20, 33, 45, 54

లక్కీ డేస్ : మంగళవారం, సోమవారం, ఆదివారం, బుధవారం

లక్కీ కలర్స్ : వైట్, బ్రౌన్, రోజ్, బ్లూ

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఈ నెలలో ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరైనట్లయితే, ఈ నెలలో మీ కృషి విజయవంతమవుతుంది. మీరు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందొచ్చు. మీరు కష్టపడి, శ్రద్ధగా పనిచేస్తే, త్వరలో మీరు విజయానికి చేరుకుంటారు. మరోవైపు, మీరు ఒక విదేశీ కంపెనీలో పని చేయాలనుకుంటే, ఈ సమయంలో మీ మార్గంలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. మరోవైపు వ్యాపారులు లాభం పొందడానికి అనేక అవకాశాలు పొందుతారు. ఈ కాలంలో మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు ఉండొచ్చు. మీరు మీ వ్యాపారం కోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, మీరు ఈ నెలలో విజయం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ కుటుంబంలో పరస్పర సామరస్యం ఉంటుంది. నెల మధ్యలో సోదరులతో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, త్వరలో మీ మధ్య దూరం తగ్గుతుంది. ఆరోగ్య పరంగా ఈ నెలలో కాళ్లకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.

రాశిచక్ర మూలకం : అగ్ని

రాశి చక్ర గ్రహం : బృహస్పతి

లక్కీ నంబర్లు : 3, 5, 10, 27, 31, 44, 56

లక్కీ డేస్ : శుక్రవారం, శనివారం, గురువారం, బుధవారం

లక్కీ కలర్స్ : రెడ్, గ్రీన్, రోజ్, ఎల్లో

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

ఈ రాశి వారు పని విషయంలో ఈ నెలలో మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. మీ ఒత్తిడిని నివారించి, మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఈ సమయంలో మీరు తొందరపడకుండా ఉండాలి. మీరు మీ తరపున ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, చాలా తెలివిగా తీసుకోండి. ఈ కాలంలో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోవచ్చు. కాబట్టి వ్యాపార విషయాల్లో అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి. విద్యార్థులు మీ విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అధ్యయనాలలో అజాగ్రత్త మీకు ఖరీదైనదని అని రుజువు చేస్తుంది. మీ వివాహ జీవితంలో ఆనందంలో తగ్గిపోవచ్చు. ఆరోగ్య పరంగా ఈ నెలలో మీకు శ్వాస సమస్యలు ఉంటే, ఈ కాలంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.

రాశిచక్ర మూలకం : భూమి

రాశి చక్ర గ్రహం : శని

లక్కీ నంబర్లు : 5, 10, 28, 34, 47, 58

లక్కీ డేస్ : శనివారం, సోమవారం, బుధవారం, మంగళవారం

లక్కీ కలర్స్ : పర్పుల్, పసుపు, మెరూన్, వైట్, ఆరెంజ్

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈ నెలలో చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో, మీ ప్రధాన సమస్యలు ఏవైనా ముగియవచ్చు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలు తీవ్రమవుతాయి. మీరు తల్లిదండ్రుల భావోద్వేగ మద్దతును పొందుతారు. మీ ప్రతి నిర్ణయంలో వారు మీకు మద్దతు ఇస్తారు. స్నేహితులకు కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. స్నేహితుల సహాయంతో, మీరు ఈ కాలంలో కొంత గొప్ప ప్రయోజనాన్ని పొందొచ్చు. ఉద్యోగులు ఈ నెలలో మంచి పురోగతి సాధించొచ్చు. వ్యాపారులు ఈ నెలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆరోగ్య పరంగా ఈ నెలలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

రాశిచక్ర మూలకం : గాలి

రాశి చక్ర గ్రహం : యురేనస్, సాటర్న్

లక్కీ నంబర్లు : 2, 17, 20, 38, 45, 50

లక్కీ డేస్ : బుధవారం, గురువారం, సోమవారం, శనివారం

లక్కీ కలర్స్ : డార్క్ గ్రీన్, రోజ్, వైట్, ఎల్లో, రెడ్

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. మీరు పని చేస్తే, ఈనెల మీకు మంచిగా ఉంటుంది. ఈ సమయంలో, సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి. మీరు కష్టపడి పనిచేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే స్థానికులు ఈ నెలలో మంచి లాభాలను పొందొచ్చు. మీరు మీ వ్యాపార నిర్ణయాలను పూర్తి విశ్వాసంతో తీసుకుంటారు. ఇది మీకు తగిన ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ సమయంలో, మీ పెండింగ్ పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ నెల ప్రారంభంలో మీకు కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ నెలాఖరులో మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతాయి. ఈ సమయం కుటుంబంతో చాలా బాగుంటుంది. ఈ నెలలో సుదీర్ఘ ప్రయాణం చేయకుండా ఉండాలి.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం : నెప్ట్యూన్, బృహస్పతి

లక్కీ నంబర్లు : 7, 15, 26, 34, 41, 58

లక్కీ డేస్ : శనివారం, సోమవారం, మంగళవారం, ఆదివారం

లక్కీ కలర్స్ : గ్రీన్, రోజ్, స్కై బ్లూ, వైట్, ఎల్లో

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

May 2021 Monthly Horoscope in Telugu

For some zodiac signs, the month of May will be auspicious and for others it will be inauspicious. However, there is only one way to find out what the stars have in store for you, that is by reading your monthly horoscope.
Story first published: Saturday, May 1, 2021, 9:00 [IST]