For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యంత ప్రతిభావంతమైన మరియు అందమైన భారత క్రికెటర్ల భార్యల గురించి మీకు తెలుసా

|

మన దేశంలో పరిచయం లేని ఆట ఏదంటే క్రికెట్ అని చాలా మంది చెబుతారు. క్రీడల యొక్క ఆదరణను పరిగణనలోకి తీసుకుంటే భారతదేశంలో క్రికెట్ కు కోట్లాది మంది వీరాభిమానులు ఉన్నారు. వీరు తమ అభిమాన క్రికెటర్లను విపరీతంగా ఆరాధిస్తారు.

అలా ప్రస్తుత క్రికెటర్లలో చాలా మంది అత్యున్నత వ్యక్తులలో ఒకరిగా ఎదిగారు. వీరికి వచ్చిన పేరు, ప్రఖ్యాతలలో సూపర్ స్టార్స్-క్రికెటర్స్ భార్యలకు కూడా సగానికి సగం వెలుగులోకి వస్తుంది. కానీ చాలా మంది క్రికెటర్ల భార్యలు అత్యంత ప్రతిభావంతులు. అంతేకాదు అందగత్తెలు కూడా. దురదృష్టవశాత్తు వారి సొంత టాలెంట్ ను ఈ ప్రపంచం గుర్తించదు. అలాంటి అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్ల భార్యలేవరో ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

1) డోనా గంగూలీ..

1) డోనా గంగూలీ..

Image curtosy

దాదాగా పేరు తెచ్చుకున్న గంగూలీ భార్య ఒడిశాకు చెందిన డ్యాన్సర్. ఆమె తన కేలుచరన్ మెహపాత్రా వద్ద డ్యాన్స్ పాఠాలు నేర్చుకుంది. ఆమె 1997లో ఇండియన్ క్రికెట్ లెజెండ్ మరియు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని 1997లో వివాహం చేసుకుంది. ఈ దంపతులిద్దరికీ 2001లో సనా అనే కుమార్తె కూడా జన్మించింది. అలాగే డోనాకు ఒక డ్యాన్స్ స్కూల్ నడుపుతోంది. ఈ స్కూల్ ను కూడా ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ ప్రారంభించారు. 2 వేల మందికి పైగా విద్యార్థుల సామర్థ్యంతో ఉండే ఈ సంస్థలో డ్యాన్స్ తో పాటు యోగా, డ్రాయింగ్, కరాటే మరియు ఈత వంటి ఇతర విభాగాలలో కూడా శిక్షణ ఇస్తుంది.

2) విరుష్క జోడి..

అనుష్క శర్మకు అదృష్టవశాత్తు సినిమాల ద్వారా గుర్తింపు లభించింది. ఆమె సినిమాల్లో నటిస్తూనే ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం కొనసాగించింది. 2017లో కింగ్ కోహ్లీతో మూడు ముళ్లు వేయించుకుంది. ఆ తర్వాత తన నటనతో పాటు మల్టీ బ్రాండ్స్ మరియు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది. ఫ్యాషన్ లోనూ అనుష్క అందరికంటే ఒక అడుగు ముందే ఉంటుంది. అలాగే లింగ సమానత్వం మరియు జంతు హక్కుల వంటి వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఆమె మద్దతు ఇస్తోంది.

3) సాక్షి ధోనీ..

3) సాక్షి ధోనీ..

భారత మాజీ కూల్ కెప్టెన్ ధోనీ భార్య గురించి అందరికీ తెలిసిందే. 2010లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న ధోనీని సాక్షి పెళ్లి చేసుకున్నాక ఆమె ఒక్కసారిగా వెలుగులోకొచ్చింది. వీరిద్దరూ రాంచీలోని ఒకే పాఠశాలలో చదువుకోవడం విశేషం. కానీ వీరు అక్కడ ఎప్పుడూ కలవలేదు. ఆమె వివాహం తర్వాత ధోనీ అదృష్టం మరింత పెరిగింది. 2011లో వరల్డ్ కప్ మరియు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాడు. 2015 ఫిబ్రవరిలో సాక్షి ధోనీకి జీవా జన్మించింది. అంతకుముందు ఆమె హోటల్ మేనేజ్ మెంట్ చేస్తుండేది.

4) రితికా రోహిత్..

4) రితికా రోహిత్..

రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మేనేజర్ గా వ్యవహరిస్తోంది. ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ లో స్పోర్ట్స్ మేనేజర్ గా పని చేశారు. ఆమె 2008లో రీబాక్ షూట్ సందర్భంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను 2008లో కలిసింది. వారు ఆరు సంవత్సరాల డేటింగ్ తర్వాత 2015 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. 2018లో ఈ జంటకు ఓ కుమార్తె జన్మించింది. రోహిత్ తన వివాహ వార్షికోత్సవం నాడు శ్రీలంకపై ఏకంగా తన మూడో 200 పరుగులను పూర్తి చేశాడు.

5) ఆయేషా గబ్బర్..

5) ఆయేషా గబ్బర్..

బ్రహ్మాచారిగా ఉన్న షోలే గబ్బర్ మాదిరిగా కాకుండా, భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం వివాహితుడు. ఈ ఆటగాడిని ఆయేషా ముఖర్జీ వివాహం చేసుకున్నారు. ఈమె ఆస్ట్రేలియాలో పెరిగిన సగం బెంగాలీ. అలాగే బ్రిటీష్ ఔత్సాహిక బాక్సర్. ఆమె ధావన్ ను రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ విచిత్రంగా ఫేస్ బుక్ లో కలిశారు. శిఖర్ ఈమెను పెళ్లి చేసుకోవడానికి కుటుంబసభ్యులను ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు. చివరికి 2009లో ఎంగేజ్ మెంట్ చేసుకుని, 2012లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఎడమ చేతివాటమే.

6) హాజెల్ కీచ్ యువీ..

6) హాజెల్ కీచ్ యువీ..

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి సిక్సర్ల సింగ్ గా మారిన భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ హాజెల్ కీచ్ ను 2016లో వివాహం చేసుకున్నారు. ఈమె బ్రిటిష్-మారిషన్ మోడల్ గా ఉండేది. అలాగే కొన్ని భారతీయ చలన చిత్రాలు మరియు బుల్లితెరలోనూ నటించింది. ఈమె 2005 నుండి ముంబైలో ఉన్నప్పటి నుండి వివిధ ప్రకటనలు, ప్రచారాలు చేసేది. యువీ భారత జట్టులో లేనప్పుడు ఆమె అతనికి చాలా మద్దతు ఇచ్చింది. వీరి వివాహ వేడుకలో సంజల్ బల్విందర్ సింగ్ ఇచ్చిన ‘‘గుర్బసంట్ కౌర్ (వివాహం సందర్భంగా పేరు)ను స్వీకరించారు.

7) గీతా టర్బోనేటర్..

7) గీతా టర్బోనేటర్..

Image curtosy

ఇండియన్ టర్బోనేటర్ గా పేరుగాంచిన హర్భజన్ సింగ్ గీతా బాస్రా అనే భారతీయ నటిని 2015 అక్టోబర్ 29వ తేదీన పంజాబ్ లోని జలంధర్ లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2016 జులై 27న ఓ కుమార్తె జన్మించింది. ఈమె హిందీ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా పని చేశారు. ఆమె 2006లో ఇమ్రాన్ హష్మీ నటించిన దిల్ దియా హై చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.

8) దీపికా కార్తీక్..

8) దీపికా కార్తీక్..

భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అందరి కంటే భిన్నంగా స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ను 2015లో పెళ్లి చేసుకున్నాడు. దీపికా పల్లికల్ అసాధారణ ప్లేయర్. ఈమె 2012లో అర్జున అవార్డు, 2014లో పద్మశ్రీ అవార్డులను సైతం కైవసం చేసుకుంది. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ టాప్ 10 లో ఇండియాను కూడా నిలబెట్టింది.

9) నికితా విజయ్..

9) నికితా విజయ్..

Image curtosy

భారత మాజీ ఓపెనర్ మురళీ విజయ్ భార్య పేరు నికితా విజయ్. ఈమె ముంబైకి చెందిన 3డి కాస్టింగ్ సంస్థ ఇంప్రెషన్స్ ఫరెవర్ లో ఆమె కాస్టింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తుండేది. ఈ 3డి టెక్ ఉన్న పిల్లలు, జంటలు మరియు కుటుంబాల యొక్క చేతి మరియు కాలి ముద్రలను సృష్టిస్తారు. ఈమె అంతకుముందు మరో భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది.

10) ప్రీతి - జహీర్

10) ప్రీతి - జహీర్

చక్ దే ఇండియా ప్రీతి సబర్వాల్ అని పిలువబడే సాగారికా ఘాట్గే ఇండియన్ మోడల్ మరియు జాతీయ స్థాయి అథ్లెట్ కూడా. ఈమె 2017 ఏప్రిల్ 24న భారత దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ ను వివాహం చేసుకుంది. 2007లో షారుఖ్ ఖాన్ నటించిన చక్ దే ఇండియాలో తొలిసారిగా, వివిధ చిత్రాలు మరియు రియాలిటీ షోలలో నటించింది. అలాగే ఇటీవల వెబ్ సీరిస్ లో ఎసిపి గా ఆమె డిజిటల్ అరంగేట్రం కూడా చేసింది.

11) సఫా ఇర్ఫాన్

11) సఫా ఇర్ఫాన్

ఇర్ఫాన్ పఠాన్ భార్యగా వెలుగులోకొచ్చిన సఫా బేగ్ జెడ్డా మోడల్ మరియు జర్నలిస్టు. ఇండియా టుడే నివేదిక ప్రకారం ఆమె పిఆర్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పని చేసింది. గల్ఫ్ లోని పలు ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ లలో నటించింది. ఇండియన్ ఆల్ రౌండర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ పఠాన్ 21 ఏళ్ల వయసులోనే అంటే 2016 ఫిబ్రవరి 4వ తేదీన సఫాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఇమ్రాన్ ఖాన్ పఠాన్ కూడా ఉన్నారు.

12) ప్రియాంక చౌదరి రైనా..

12) ప్రియాంక చౌదరి రైనా..

సురేష్ రైనా సతీమణి ప్రియాంక చౌదరి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరియు మాజీ బ్యాంకర్. ఈమె గతంలో యాక్సెంచర్, విప్రో వంటి సంస్థలలో పని చేసింది. ఈమె నెదర్లాండ్స్ లోని ఆమస్టర్ డామ్ లో తన బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డ గ్రేసియాను పెంచేందుకు తన ఉద్యోగాన్ని వదిలేసింది. ప్రస్తుతం ఆమె తన భర్తతో పాటు గ్రేసియా రైనా ఫౌండేషన్ స్థాపింంచి సహ వ్యవస్థాపకురాలిగా కొనసాగుతోంది. ఇది పిల్లలు మరియు తల్లి ఆరోగ్యాన్ని పెంపొందించే సంస్థ.

English summary

Most Beautiful and Talented Indian Cricketers Wives

Here is the list of most beautiful and talented Indian cricketers wives. Take a look.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more