For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వామి వివేకానంద చికాగోలో చారిత్రక ప్రసంగం చేసింది ఈరోజే...

1893 సంవత్సరంలో స్వామి వివేకానంద సరిగ్గా ఈరోజున చికాగో పార్లమెంటులో ఆధ్యాత్మికంగా ఎలాంటి స్పీచ్ ఇచ్చారో ఓసారి గుర్తు చేసుకుందాం.

|

1893 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ స్వామి వివేకానంద యునైటెడ్ స్టేట్స్ అమెరికాలోని చికాగోలో ప్రపంచ ఆధ్యాత్మిక సభనుద్దేశించి చారిత్రక ప్రసంగం చేశారు.

On this Day in 1893, Swami Vivekananda gave iconic Speech at the World Parliament of Religions, Chicago, Read Text in Telugu

వేదంలోని తత్వాన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకెళ్లి హిందూ మతాన్ని తీవ్రంగా సంస్కరించిన వ్యక్తి స్వామి వివేకానంద. అలాంటి గొప్ప వ్యక్తి మన దేశంలో జన్మించడం గర్వకారణం. ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తాలో 1863 సంవత్సరంలో జనవరి 12వ తేదీన జన్మించారు. తన పుట్టిన రోజున నాడే ప్రపంచ వ్యాప్తంగా యువజన దినోత్సవంగా వేడుకలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంటులో హాజరయ్యేందుకు వెళ్లిన స్వామి వివేకానంద అక్కడ ఎలాంటి ప్రసంగం చేశారు. అది ఎందుకని చాలా మందిపై ప్రభావం చూపిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

On this Day in 1893, Swami Vivekananda gave iconic Speech at the World Parliament of Religions, Chicago, Read Text in Telugu

స్వామి వివేకానంద పేద కుటుంబంలో పుట్టినప్పటికీ.. తత్వశాస్త్రంలో మంచి పట్టు సాధించాడు. ఈ లోకంలో హిందూ తత్త్వ శాస్త్రం ఇతరులకన్నా ఉన్నతమైనదని విదేశీయులను సైతం ఒప్పించగలిగిన ధీరుడు. ఈయన ప్రాచత్య తత్త్వ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు.

స్వామి వివేకానంద చాలా చిన్న వయసులోనే భారతదేశం మొత్తం పర్యటించారు. ఆయన పేదలు మరియు నిరుపేదల అభ్యున్నతికి ఎంతో క్రుషి చేశారు. అతను కలకత్తాలోని ప్రసిద్ధ రామక్రిష్ణ మిషన్ మరియు బేలూరు మఠాన్ని స్థాపించాడు. ఇది ఇప్పటికీ హిందూ మతాన్ని ప్రాచుర్యం పొందడానికి మరియు పేదలకు సహాయం చేసేందుకు అంకితభావంతో పని చేస్తుంది.

1893లో చికాగాలోని పార్లమెంటులో స్వామి వివేకానంద ప్రసంగం ఇలా..
'మీరు మాకు అందించిన ఆప్యాయత మరియు మనస్ఫూరక స్వాగతానికి ప్రతి స్పందనగా చెప్పలేనంత ఆనందంతో నా మనసు పులకరించిపోయింది. ప్రపంచంలోని అతి పురాతన సన్యాసుల పేరిట నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మతాల తల్లి పేరిట నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా అన్ని తరగతులు మరియు అన్ని వర్గాలు, మిలియన్ల మంది హిందూ ప్రజలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను.

ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రస్తావిస్తూ.. సుదూర దేశాల నుండి ఈ మనుషులు వివిధ దేశాలకు సహనం యొక్క ఆలోచనను అందించే గౌరవాన్ని పొందొచ్చు. ప్రపంచానికి సహనం మరియు విశ్వవ్యాప్త ఆమోదం రెండింటినీ నేర్పించిన మతానికి చెందిన వ్యక్తిగా నేను గర్వపడుతున్నాను. మేము విశ్వవ్యాప్త సహనాన్ని నమ్ముతాను. అలాగే అన్ని మతాలను నిజమైనవిగా అంగీకరిస్తాం. ఈ భూలోకంలో అన్ని దేశాల శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వాడిగా నేను గర్వ పడుతున్నాను. రోమన్ నిరంకుశత్వంతో వారి పవిత్ర దేవాలయం ముక్కలైపోయిన ఏడాదిలోనే దక్షిణ భారతదేశానికి వచ్చి, మనతో ఆశ్రయం పొందిన ఇజ్రాయెల్ ప్రజల స్వచ్ఛమైన అవశేషాలను మేము మా ఒడిలో సేకరించామని గర్వపడుతున్నాను.

భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుంది. చిన్న చిన్న నదులు ప్రవహించి చివరికి ఎలా సాగరంలో కలుస్తాయో.. అదే విధంగా అన్ని మతాల గమ్యం భగవంతుని సన్నిధిలోని చేరుకోవడమే. దీని కోసం ఎవరూ మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని, తమ మతం మాత్రమే గొప్పదని భావించే వారు బావిలో కప్పలు లాంటి వారు' అని వివరించారు. ఆ అద్భుత ప్రసంగం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో మన వివేకానందుడు తన గొప్పదనమే కాదు.. మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేశారు. ఈ ప్రసంగం తర్వాత ఆయన ఫొటోతో పాటు 'స్వామి వివేకానంద -ది సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా' అని పోస్టర్స్ ముద్రించి చికాగో నగరంలో వేలాడదీశారు.

ఇదంతా జరిగి నేటికీ సరిగ్గా 128 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల హక్కుల పరిరక్షణకు ఓ శాశ్వత వేదికను ఏర్పాటు చేయడానికి ప్రపంచ హిందూ కాంగ్రెస్ ముందుకొచ్చింది. ఈ వేదిక అమెరికా లేదా బ్రిటన్ దేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు వార్షిక సమావేశాల్లో దాదాపు 60 దేశాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.

English summary

On this Day in 1893, Swami Vivekananda gave iconic Speech at the World Parliament of Religions, Chicago, Read Text in Telugu

Here we are talking about the, on this day in 1893, swami vivekananda gave iconic speech at the world parliament of religions, chicago, read text in Telugu.
Story first published:Saturday, September 11, 2021, 12:54 [IST]
Desktop Bottom Promotion