For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిలుక పలుకులను ఎవరైనా నమ్ముతారా? ఓ కేసులో చిలుక సాక్ష్యం చెప్పబోతుందట...!

ఆ చిలుక చెప్పే మాటలే కోర్టులో కీలక సాక్ష్యంగా మారనుందట. రండి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

|

ఈ ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఏదైనా హత్య వంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు రావడం అత్యంత సాధారణం. వారు ప్రాథమిక వివరాలు సేకరించి, దాని ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తారని విషయం అందరికీ తెలిసిందే. అయితే వివిధ కోణాల్లో దర్యాప్తు చేసే పోలీసులకు అనేక కేసుల్లో చాలా ఆధారాలు లభిస్తాయి. దాని ప్రకారమే ప్రజలంతా కోర్టులో సాక్ష్యం చెప్పాలని కోరుకుంటారు.

Parrot, who will testify in court for his master

అయితే ఓ హత్య కేసులో మాత్రం పోలీసులకు విచిత్రమైన ఆధారాలు లభించాయి. ఆ ఆధారమేంటంటే పచ్చని చిలుక. అంతేకాదండోయ్ ఆ చిలుక పలుకులే వారి కేసులో కీలకం. ఎందుకంటే హత్యకు ముందు తన యజమానురాలి మాటలనే చిలుక యధావిధిగా పలకడం గమనార్హం. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇదే పచ్చి నిజం. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది... ఎప్పుడు జరిగింది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అద్దెకు దిగిన దుండగులు

అద్దెకు దిగిన దుండగులు

అర్జెంటీనా దేశంలో సుమారు మూడేళ్ల క్రితం ఓ రోజు సాన్ ఫెర్నాడోకు చెందిన ఎలిజిబెత్ టోలెడో అనే మహిళ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు అద్దెకు దిగారు. వారు ఆమె ఉంటున్న పై పోర్షన్ లో అద్దెకు దిగిన వెంటనే యజమానురాలిపై కన్ను వేశారు.

అత్యాచారం, హత్య...!

అత్యాచారం, హత్య...!

అందుకోసం ఓ ప్లాన్ వేసుకున్న ఆ ముగ్గురు దుండగులు సమయం కోసం వేచి చూశారు. అదను చూసుకుని ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, అనంతరం ఆమెను హత్య చేశారు. అదే సమయంలో అక్కడికి చిలుక వెళ్లింది. తన యజమానురాలి చివరి మాటలను తన నోటి వెంట పలికింది.

చిలుక పలుకల ఆధారంగా..

చిలుక పలుకల ఆధారంగా..

ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నాక.. వారికి కొన్ని విచిత్రమైన మాటలు వినిపించాయి. ‘ప్లీజ్ నన్ను వదిలేయండి‘ అంటూ బతిమిలాడుతున్న విధంగా వినిపించాయి. ఆ సౌండ్ ఆధారంగా ఇంట్లో వెళ్లి చూడగా.. అక్కడ నగ్నంగా ఓ విగతజీవి పడి ఉన్న మహిళ శవం ఉంది. అక్కడే బోను దగ్గర చిలక పలుకులు వినిపించాయి.

ఆమె ఆర్తనాదాలను..

ఆమె ఆర్తనాదాలను..

మహిళను హింసిస్తూ అత్యాచారం చేసే సమయంలో ఆమె వేడుకున్న ఆర్తనాదాలను గ్రహించి వాటినే పలికినట్లు పోలీసులు భావించారు. దీనికన్నా ముందు దుండగులు బలవంతంగా ఆమె గదిలోకి చొరబొడ్డ వెంటనే.. ఇరుగు పొరుగు వారు చిలక మాటలను చెవులారా విన్నామంటూ చెప్పారట. దీంతో ఈ కేసులో చిలుక పలుకులను సాక్ష్యంగా చేర్చారు పోలీసులు.

పోస్టుమార్టంలో కూడా..

పోస్టుమార్టంలో కూడా..

మరోవైపు ఆ మహిళ పోస్టుమార్టం రిపోర్టులోనూ అత్యాచారం చేసి గొంతుకోసి చంపినట్టుగా వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు మరొకరు దొరికిన వెంటనే, కేసు విచారణలో భాగంగా చిలక అక్కడకు వెళ్లి సాక్ష్యం చెబుతుందట.

English summary

Parrot, who will testify in court for his master

Here we talking parrot, who will testify in court for his master. Read on.
Story first published:Wednesday, May 27, 2020, 17:06 [IST]
Desktop Bottom Promotion