For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పావురం ఇంట్లో గూడు పెడితే శుభమా..? అశుభమా..?

ఇంట్లోకి పావురం రావడం గురించి, ఇంట్లో పావురం గూడు పెట్టడం గురించి వేర్వేరు వ్యక్తులు వేర్వేరు నమ్మకాలను కలిగి ఉంటారు. అసలు ఇంట్లోకి పావురాలు రావడం శుభమా.. అశుభమా ఇప్పుడు తెలుసుకుందాం.

|

పావురాలు చాలా మంది ఇళ్లల్లోకి వస్తుంటాయి. పావురాలు రావడానికి చిన్న రంధ్రం ఉన్నా అందులోని వచ్చేస్తుంటాయి. అయితే ఇలా పావురాలు ఇంట్లోకి రావడాన్ని కొందరు శుభంగా, మరికొందరు అశుభంగా పరిగణిస్తారు. జ్యోతిష్య ప్రకారం పావురాలు ఇళ్లల్లోకి రాకూడదని చెబుతుంటారు. పావురాలు లక్ష్మీదేవికి భక్తులు. పావురం ఆనందం, శాంతికి చిహ్నం.

Pigeon nest in home: good or bad? in Telugu

ఇంట్లోకి పావురం రావడం గురించి, ఇంట్లో పావురం గూడు పెట్టడం గురించి వేర్వేరు వ్యక్తులు వేర్వేరు నమ్మకాలను కలిగి ఉంటారు. అసలు ఇంట్లోకి పావురాలు రావడం శుభమా.. అశుభమా ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లోకి పావురం రావడం మంచిదా? కాదా?:

ఇంట్లోకి పావురం రావడం మంచిదా? కాదా?:

జ్యోతిష్యం ప్రకారం ఇంట్లోకి పావురం రావడం సంతోషాన్ని, శాంతిని, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అయితే పావురం ఇంట్లో గూడు పెట్టుకోవడం మాత్రం జ్యోతిష్యం ప్రకారం మంచిది కాదు. ఇంట్లో పావురం గూడు పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇతర సమస్యలు చుట్టుముడతాయని శాస్త్రం చెబుతోంది. అందుకే పావురాన్ని ఇంట్లో గూడు పెట్టుకోనివ్వొద్దని అంటారు.

ఇంట్లో పావురం గూడు కట్టుకుంటే ఏం చేయాలి?

ఇంట్లో పావురం గూడు కట్టుకుంటే ఏం చేయాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పావురం గూడు కట్టుకోవడం చేటు చేస్తుంది. ఇంటి బాల్కనీ లేదా ఇంట్లో ఓ మూలలో గూడు కట్టుకోవడం అంటే సమస్యలు రాబోతున్నాయని అర్థం. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య కలహాలు జరుగుతాయి. మనశ్శాంతి దూరమవుతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

మరికొన్ని విశ్వాసాల ప్రకారం ఇంట్లో పావురాలు గూడు కట్టుకుంటే మంచిదని కొందరు నమ్ముతుంటారు. పావురం లక్ష్మీ దేవికి అత్యంత భక్తురాలని, అలాంటి పావురాలు ఇంట్లో గూడు పెట్టుకుంటే లక్ష్మీ దేవి కటాక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు.

పావురం గూడు కట్టుకుని అందులో గుడ్లు పెడితే మాత్రం దానిని ఎట్టిపరిస్థితుల్లో తొలగించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. దాని వల్ల తీవ్ర నెగెటివ్ ప్రభావం పడుతుందని చెబుతున్నారు పండితులు. పావురం గుడ్లు పెడితే అవి పిల్లలుగా మారి వాటంతట అవి అక్కడి నుండి వెళ్లిపోయే వరకు వాటిని ఏమీ అనకూడదని హెచ్చరిస్తున్నారు.

పావురం చుట్టూ నమ్మకాలు:

పావురం చుట్టూ నమ్మకాలు:

* లక్ష్మీ కటాక్షం పొందేందుకు పావురాలకు ఆహారం ఇస్తే ఫలితం ఉంటుంది.

* పావురాలకు ఆహారం వేయడం వల్ల జాతకంలో బృహస్పతి, బుధ గ్రహాల స్థానాలు బలపడుతుంది, ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు.

* పావురాలకు ఇంటిపై బాల్కనీలో కాకుండా ఇంటి ప్రాంగణంలో ఆహారం పెట్టాలి. ఇలా చేస్తే రాహు గ్రహ దోషం తొలగిపోతుంది. పావురాలకు ఆహారం ఇస్తే మంచి జరుగుతుంది. అయితే పావురాలకు ఆహారం అందించే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.

* వైవాహికి, శృంగార సమస్యలు ఉన్న వ్యక్తులు పావురాలకు ఆహారం ఇవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహంలో వచ్చే సమస్యలను ఇది తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతోంది.

* వాస్తు ప్రకారం తలపై నుండి పావురాలు ఎగిరితే సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయని అర్థం.

* ఇంట్లో నుండి బయటకు వెళ్లే సమయంలో పావురం కుడివైపు నుండి ఎగిరితే పనులు కావని అర్థం.

English summary

Pigeon nest in home: good or bad? in Telugu

read this to know Pigeon nest in home: good or bad? in Telugu
Story first published:Saturday, January 21, 2023, 10:34 [IST]
Desktop Bottom Promotion