For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శాస్త్రాల ప్రకారం ఈ 22 మంది మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం క్షమించరాని పాపం

|

శాస్త్రాలలో పేర్కొన్న కొన్ని వర్గాల మహిళలకు సంబంధించిన తీవ్రమైన పాపాలు .. పురాతన హిందూ శాస్త్రాలు కలియుగం ద్వారా మానవాళికి మార్గనిర్దేశం చేయడానికి దేవఋషులు నిర్దేశించిన కొన్ని మార్గదర్శకాల గురించి తెలుసుకోవడం ద్వారా, ప్రజలు వారి మరణానంతర ప్రయాణాన్ని ఎటువంటి పాపభీతి లేకుండా సజావుగా జరిగేలా చూసుకొనవచ్చునని చెప్పబడుతుంది.

శాస్త్రాలు, వేదాలు మరియు పురాణాలు :

శాస్త్రాలు, వేదాలు మరియు పురాణాలు :

హిందూ మతంలో ఉన్న పవిత్రమైన పురాణాలు, వేదాలు మరియు శాస్త్రాలు మానవులను జ్ఞానోదయాన్ని కలిగించే క్రమంలో భాగంగా, దైవిక సంఘటనల గురించి వివరించడమే కాకుండా, చేయకూడని పాపాలు మరియు మంచి పనుల గురించి వారికి అవగాహన కల్పించటానికి కూడా రచించబడిందని ప్రజల నమ్మకం.

దేవ ఋషులు :

దేవ ఋషులు :

వివరించిన అనేక రకాల మార్గదర్శకాలలో, ఇతర వ్యక్తులతో లైంగిక సంబంధాలను ఏర్పరచుకోవడం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. శాస్త్రంలో చెప్పినట్లుగా, ఈ క్రింది 22 మంది మహిళలలో ఎవరితోనైనా శారీరక సాన్నిహిత్యం కలిగి ఉండడం సరికాదని హెచ్చరికలు ఉన్నాయి. ఇవి మరణానంతర జీవితంలో తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చునని చెప్పబడుతుంది.

మానవులకు మార్గదర్శకాలు :

మానవులకు మార్గదర్శకాలు :

ఏ పరిస్థితులలోకూడా, పురుషుడు కింద చెప్పబడిన స్త్రీలతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోరాదని శాస్త్రాలు వివరించాయి…

పెళ్లి కాని కన్య :

పెళ్లి కాని కన్య :

ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోకుండా, ఒక కన్యతో ఏకాభిప్రాయంతో, లేదా బలవంతపు శారీరక సంబంధం కలిగి ఉండడం సరికాదని హెచ్చరించబడింది. వాస్తవానికి, అటువంటి సంబంధం కలిగి ఉంటే అతను ఆమెను ఖచ్చితంగా వివాహం చేసుకోవలసి ఉంటుందని సూచించబడింది.

ఒక వితంతువు :

ఒక వితంతువు :

ఎటువంటి పరిస్థితులలోనైనా, ఒక పురుషుడు భర్త మరణించిన స్త్రీతో శారీరక సంబందాన్ని పెట్టుకోరాదు. పునర్వివాహం విషయంలో మాత్రమే, అటువంటి సంబంధం ధర్మబద్ధమైనదిగా ఉంటుంది.

బ్రహ్మచర్యం యొక్క ప్రతిజ్ఞ :

బ్రహ్మచర్యం యొక్క ప్రతిజ్ఞ :

ఒక స్త్రీ లేదా కన్య, బ్రహ్మచర్యంపూనిన ప్రతిజ్ఞ చేసిన తర్వాత, లేదా ఆమె జీవితమంతా కన్యగా ఉండేలా జీవించడాన్ని ఎంచుకున్న పక్షంలో ఆమె సూత్రాన్ని మార్చటానికి, లేదా తన సంతోషంకోసంగా ఆమెను వినియోగించాలన్న ఆలోచన చేయడం అత్యంత పాపకార్యంగా చేపబడుతుంది. ఆమె ఇష్టపూర్వకంగా వివాహానికి అంగీకరిస్తే తప్ప, ఆమె గురుంచి ఆలోచించడం కూడా పాపంగా చెప్పబడుతుంది.

స్నేహితుడి భార్య :

స్నేహితుడి భార్య :

ఒకరు తన స్నేహితుడి భార్యతో శారీరక సంబంధాన్ని కోరుకుంటే, మరణానంతర జీవితంలో తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అతడు ఏకాభిప్రాయంతో కాని, ఆమెను బలవంతం చేయడం ద్వారా కాని, ఏవిధమైన కారణం చేతనైనా కానీ ఆమెతో సంబంధం కలిగి ఉండరాదు.

శత్రువు భార్య :

శత్రువు భార్య :

ఎట్టి పరిస్థితుల్లోనూ తన శత్రువు భార్యతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంటే, ఎంత ధైర్యవంతుడైనా, ఎటువంటి పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా ఆ వ్యక్తి క్షమింపజాలడు. శాస్త్రాల దృష్టిలో ఇది అరుదైన మరియు అత్యంత హేయమైన పాపంగా పరిగణించబడుతుంది.

తన విద్యార్థి భార్య :

తన విద్యార్థి భార్య :

ఒక వ్యక్తి, తన అనుసరగణంలోని వ్యక్తి (అతని జూనియర్, విద్యార్థి లేదా శిష్యుడు) భార్య లేదా భాగస్వామితో సంబంధాన్ని కలిగి ఉండకూడదు. ఇటువంటివి చర్యలు శాస్త్రంప్రకారం అత్యంత హీనమైన చర్యగా చెప్పబడుతుంది.

సొంత కుటుంబానికి చెందిన మహిళ :

సొంత కుటుంబానికి చెందిన మహిళ :

ఒకరి స్వంత కుటుంబంలో జన్మించిన ఏ స్త్రీతోనైనా లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనేది, హిందూ మతంలో నిషేదంగా చెప్పబడుతుంది; ముఖ్యంగా నేరుగా రక్త సంబంధం కలిగిన వ్యక్తులతో. వావివరుసలు లేకుండా ప్రవర్తించరాదు అని పెద్దలు ఊరికే చెప్పలేదు.

వేశ్యలు :

వేశ్యలు :

భౌతిక ప్రయోజనాల కోసం ఇతర మహిళలతో సంబంధాలు ఏర్పరచుకోవడాన్ని తప్పని శాస్త్రం హెచ్చరిస్తుంది, ఉదాహరణకు డబ్బు ప్రలోభాలకు గురిచేసి, మహిళలతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవడం. ఈ ప్రపంచంలోని ఏ స్త్రీ అయినా గౌరవించబడాలి, మరియు రక్షించబడాలి. అంతేకాని వారిని అవసరాలకోసంగా అని ఆలోచించడం సరికాదు.

అపస్మారకస్థితిలో ఉన్న, లేదా మతిస్థిమితం కోల్పోయిన, లేదా అమాయకమైన స్త్రీ..

అపస్మారకస్థితిలో ఉన్న, లేదా మతిస్థిమితం కోల్పోయిన, లేదా అమాయకమైన స్త్రీ..

అపస్మారకస్థితిలో ఉన్న, లేదా మతిస్థిమితం కోల్పోయిన ఒక స్త్రీ లేదా బాలికతో సంబంధాలు కలిగి ఉండటం, తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని మహిళలు లేదా బాలికలతో సంబంధాలను కలిగి ఉండడం దైవం కూడా క్షమించలేని నీచమైన పాపకార్యంగా చెప్పబడుతుంది.

వృద్ధ మహిళ :

వృద్ధ మహిళ :

లైంగిక సంబంధం కోసంగా, ఒక పురుషుడు తనకన్నా పెద్ద స్త్రీని ప్రలోభపెట్టరాదు, వారి ఆలోచనలను మార్చడానికి ప్రయత్నించరాదు.

గురువు భార్య :

గురువు భార్య :

గురువు భార్య లేదా మీ సీనియర్ పరిచయస్తులతో శారీరక సంబంధాలు ఏర్పరచుకోవడం శాస్త్రం మరియు దేవుని దృష్టిలో తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది. గురువు(గురువు, ఆధ్యాత్మిక బోధకుడు, ప్రవచనకర్తలు మొదలైనవి) భార్య తల్లితో సమానమని చెప్పబడుతుంది. వారిని ప్రలోభపెట్టడం, వారిని సంబంధాలను పెట్టుకోవడం క్షమించరాని పాపం.

అత్తయ్య :

అత్తయ్య :

ఎట్టి పరిస్థితుల్లోనూ, ఒకరు తమ అత్తగారితో సంబంధాలు పెట్టుకోవడం, వారిని ఆ ఉద్దేశం చూడడం వంటివి చేయరాదు. అత్తయ్య స్వంత తల్లికి సమానమని నమ్ముతారు. ఇది క్షమించరాని హేయమైన పాపం.

మేనత్త :

మేనత్త :

పినతల్లి, మేనత్త వంటి వారితో శారీరక సాన్నిహిత్యం లేదా సంబంధాలను ఏర్పరచుకోవడం, అటువంటి ఆలోచనలు కలిగి ఉండడం కూడా తీవ్రమైన పాపంగా శాస్త్రం హెచ్చరిస్తుంది; ఇది క్షమించరాని పాపం.

మామగారి భార్య (మామి) :

మామగారి భార్య (మామి) :

మామగారి భార్యతో అక్రమ సంబంధాలను ఏర్పరచుకోవడాన్ని శాస్త్రం నిషేధించింది; అటువంటి ఆలోచనలు కూడా క్షమించరాని పాపంగా పరిగణించబడుతాయి.

మేనమామ భార్య (చాచి) :

మేనమామ భార్య (చాచి) :

మేనమామ భార్యతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశ్యం కూడా పాపకార్యంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా దేవుడు కూడా క్షమించని పాపంగా పరిగణించబడుతుంది.

సోదరి (కజిన్‌తో సహా) :

సోదరి (కజిన్‌తో సహా) :

ఒకరు ఎప్పుడుకూడా తన సొంత సోదరితో (కజిన్‌తో సహా) శారీరక సంబంధాలను ఏర్పరచుకునే ప్రయత్నం కూడా చేయరాదు. మొదటి రక్త సంబంధీక బంధువు అయిన వారిపరంగా అక్రమ సంబంధాల ఆలోచన చేయడం శాస్త్రాల దృష్టిలో అత్యంత హేయమైన మరియు క్షమించరాని పాపంగా ఉంటుంది.

గర్భిణీ స్త్రీ :

గర్భిణీ స్త్రీ :

గర్భిణీ స్త్రీతో శారీరక సంబంధాలను ఏర్పరచుకోకూడదని పురుషునికి సలహా ఇవ్వబడుతుంది. గర్భం దాల్చిన స్త్రీతో శారీరక సాన్నిహిత్యాన్ని, బలవంతంగా ఏర్పరచుకోవడమనేది మరణానంతర ప్రయాణాన్ని క్లిష్టతరం చేస్తుంది.

అపరిచిత వ్యక్తులు :

అపరిచిత వ్యక్తులు :

మనిషికి పరిచయం లేని, లేదా అతనికి పూర్తిగా అపరిచితులైన వ్యక్తులతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం శాస్త్ర సమ్మతం కాదు మరియు నిషేధించబడింది.

క్రిమినల్ :

క్రిమినల్ :

ఒక అపరాధి లేదా దోషిగా ఉన్న (చట్టపరమైన తప్పులు చేసిన వ్యక్తులు) మహిళతో సంబంధాలు కలిగి ఉండటం కూడా శాస్త్ర సమ్మతం కాదు.

కొన్నిమంచి విషయాలు పెద్దలు తమ చర్యల ద్వారా,

కొన్నిమంచి విషయాలు పెద్దలు తమ చర్యల ద్వారా,

కొన్నిమంచి విషయాలు పెద్దలు తమ చర్యల ద్వారా, తమ విధానాల ద్వారా తమ తర్వాతి తరం వారికి మార్గనిర్దేశం చేయవలసిన అవసరం ఉంది. లేనిచో అత్యంత హేయమైన సంఘటనలకు వారి కుటుంబాలే ఏదో ఒకరోజు వార్తలలోకి ఎక్కే ప్రమాదం ఉంది. విలువలు నేర్పాల్సిన వారు, తప్పులకు అండగా నిలబడడం కూడా మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కొన్ని సంఘటనలు మరలా పునరావృతం కాకూడదు అంటే, మొక్కగా ఉన్నప్పుడే తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుందని మరువకండి. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పైన చెప్పిన అంశాలు, స్వతహాగా అందరికీ తెలియాల్సిన విషయాలుగా ఉన్నప్పటికీ., నేటికాలంలో అదిపనిగా చెప్పాల్సి వస్తున్నందుకు చింతించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Sin in the eyes of Shastras: Never make relations with these 22 women!

In Hinduism, it is believed that sacred Puranas, Vedas and Shastras were not only authored to enlighten mortals and speak of divine events, but also to educate them of sins and good deeds.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more