For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Solar Eclipse 2020 : 12 రాశులపై సూర్యగ్రహణం ప్రభావం ఎలా ఉంటుందో చూడండి...

|

2020 సంవత్సరంలో జూన్ 21వ తేదీన తొలి సూర్య గ్రహణం ఏర్పడబోతోంది. ఈ సూర్య గ్రహణానికి చూడామణి అని నామకరణం చేశారు. ఈ గ్రహణం మృగశిర, ఆరుద్ర నక్షత్రాలలో ఏర్పడబోతోంది. ఇది 21వ తేదీ ఉదయం 10:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:44 గంటలకు ముగియబోతోంది. ఈ సమయం హైదరాబాదును ఆధారంగా చేసుకుని చెబుతున్నారు పండితులు. అయితే ఇతర ప్రాంతాల్లో సమయంలో స్వల్ప మార్పులు ఉండే అవకాశముందని కూడా చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఆ రెండు నక్షత్రాలలో ఈ గ్రహణాన్ని చూస్తే మంచి జరుగుతుందా? లేదా చెడు జరుగుతుందా? వీరితో పాటు సామాన్యులు కూడా ఈ గ్రహణాన్ని చూడకుడదా? చూస్తే ఏమవుతుంది?

ఈ సూర్యగ్రహణాన్ని చూస్తే అధమ ఫలితాలు ఏర్పడతాయంట. అధమ ఫలితాలంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అందుకే మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

మరో ముఖ్యమైన మిధున రాశి వారు కూడా ఈ గ్రహణాన్ని అస్సలు వీక్షించకూడదని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ గ్రహణం మిధున రాశిలో ఏర్పడనుందట. అయితే ఈ రాశి వారితో పాటు మరో మూడు రాశులు కూడా ఈ గ్రహణాన్ని వీక్షించకూడదట. అయితే ఆ రాశుల వారు ఎవరో ఎందుకు చూడకూడదు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఈ సూర్య గ్రహణం వల్ల నాలుగు రాశుల వారికి అధమ, మధ్యమ, శుభ ఫలితాలు కూడా ఏర్పడనున్నాయంట. ఆ వివరాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందా.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే కోరుకున్న కొలువులు గ్యారంటీ...!

మేష రాశి..

మేష రాశి..

ఈ సూర్యగ్రహణం మేషరాశి మూడో ఇంట్లో జరుగుతుంది. ఇది మీకు ధైర్యం, కమ్యూనికేషన్ మరియు తోబుట్టువులతో మంచి సంబంధాలను సూచిస్తుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీకు ముఖ్యమైన ప్రభావవంతమైన వ్యక్తులతో కమ్యూనికేషన్ సజీవంగా ఉంచాలి. మీ తోబుట్టువుల పట్ల కొంత శ్రద్ధ వహించాలి. ఈ సూర్యగ్రహణం వల్ల మీపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ గ్రహణం ఈ రాశి వారి రెండో ఇంట్లో జరుగుతుంది. ఇది మీకు ఫైనాన్స్ మరియు కుటుంబాన్ని సూచిస్తుంది. అయితే ఈ గ్రహణం తర్వాత మీరు ఫైనాన్స్ పరంగా ఆందోళన చెందుతారు. మీ కుటుంబంలో ఖర్చులు పెంచాలి. మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు మీ కంటికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సమస్య ఎక్కువైతే, కంటి నిపుణుడిని సందర్శించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశిలోనే సూర్య గ్రహణం జరుగుతుంది. దీని తర్వాత ఈ రాశి వారిపై ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఇబ్బంది పెడితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డాక్టర్ సూచించ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

అష్ట కష్టాలు నుండి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే ‘‘అష్టలక్ష్మీ స్తోత్రం''!!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారి 12వ ఇంట్లో సూర్యగ్రహణం జరుగుతుంది. దీని వల్ల మీరు డబ్బును కోల్పోవచ్చు. ఆకస్మకంగా ఖర్చులు పెరుగుతాయి. మీ ప్రయత్నాలు విఫలమవ్వచ్చు. ఈ సమయంలో మీరు ఆర్థిక పరమైన విషయాలలో రిస్క్ తీసుకోకూడదు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి 11వ ఇంట్లో సూర్య గ్రహణం జరుగుతుంది. దీన్ని చూడటం ద్వారా మీకు కొన్ని ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మీకు కొంత లాభం వచ్చే అవకాశముంటుంది. మీ దీర్ఘకాలిక కోరిక నిర్ణీత సమయంలో నెరవేరుతుంది. మీరు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ సూర్య గ్రహణం ఈ రాశి లోని 10వ ఇంట్లో జరుగుతుంది. ఇది మీకు ఇల్లు మరియు కీర్తి గురించి సూచిస్తుంది. అయితే మీరు పని విషయంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలి. మీకు ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే, మీరు జ్యోతిష్యుడిని కలవాలి.

దక్షిణభారతంలోని ఆ దేవుడిని దర్శస్తే.. కంటిచూపు కచ్చితంగా తిరిగొస్తుందట...

తుల రాశి..

తుల రాశి..

ఈ సూర్య గ్రహణం ఈ రాశిలోని తొమ్మిదో ఇంట్లో జరుగుతుంది. దీని వల్ల కొన్ని మంచి అవకాశాలే వస్తాయి. అయితే మీరు మాత్రం అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈ సమయంలో మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ సూర్య గ్రహణం ఈ రాశిలోని ఎనిమిదవ ఇంట్లో జరుగుతుంది. దీని వల్ల మీకు వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి సమస్య రాకుండా మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీరు ఫైనాన్స్ మరియు కుటుంబానికి సంబంధించిన విషయాలలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సమస్య మరీ ఎక్కువైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ధనస్సు రాశి...

ధనస్సు రాశి...

ఈ సూర్య గ్రహణం ఈ రాశిలోని ఏడో ఇంట్లో జరుగుతుంది. దీని వల్ల మీకు సమస్యలు తగ్గిపోవచ్చు. మీరు ఇంతకుముందు అనుభవించిన సమస్యలు కూడా తొలగిపోవచ్చు. మీరు పనికి సంబంధించి ఏవైనా ప్రయత్నాలు చేస్తే మీరు అందులో విజయం సాధించమే కాదు. ప్రశంసలు కూడా పొందుతారు. మీకు కొత్త బాధ్యత రావచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ సూర్యగ్రహణం ఈ రాశిలోని ఆరో ఇంట్లో జరుగుతుంది. దీని వల్ల మీకు మంచి జరుగుతుంది. మీకు మంచి పురోగతి లభిస్తుంది. ఈ నిర్ణీత సమయంలో విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. అయితే మీరు ఓపికగా ఉండాలి. మీరు గ్రౌండ్ రియాలిటీని కూడా చూడాలి. దానికి అనుగుణంగా ప్రవర్తించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ సూర్య గ్రహణం ఈ రాశి లోని ఐదో ఇంట్లో జరుగుతుంది. దీని వల్ల మీరు ప్రేమ సంబంధంలో ఉన్న ఒకరు ఒక సమస్య గురించి ఆందోళనతో ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ప్రేమ విషయంలో సామరస్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఉండాలి. అలాగే ఆర్థికపరంగా పెద్ద లాభాలేవీ ఉండవు. మీరు సాధారణ ఖర్చులను హాయిగా చేస్తారు. మొత్తానికి ఆర్థికపరంగా ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ సూర్య గ్రహణం ఈ రాశి వారి నాలుగో ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో మీరు చాలా శ్రద్ధగా పని చేయాలి. ఎందుకంటే మీ పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఎలాంటి పెద్ధ ఆర్థిక లాభాలను పొందలేరు. మరోవైపు కొన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలు మీపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. దీని వల్ల మీరు కొంత ఆందోళన చెందొచ్చు. ఇలాంటి సమయంలో మీకు సమస్య ఎక్కువైతే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

పరిహారం : రాగి పాత్ర లేదా కంచు పాత్ర తీసుకుని అందులో స్వచ్ఛమైన నెయ్యి పోసి నిండుగా పోసి, బంగారంతో చేసిన నాగపడగను లేదా బంగారంతో చేసిన సూర్యబింబాన్ని అందులో ఉంచాలి. ఇవి మునిగేంత నెయ్యిని అందులో వేయాలి. బంగారాన్ని కొనే స్తోమత లేని వారు స్వర్ణకారుల షాపుల్లో ఉండే ఆ ప్రతిమ రేకులతో కూడా పూజ చేయొచ్చు.

తెల్లటి వస్త్రం (పంచ)లో నల్లటి నువ్వులను కలిపి వీటిని ఎవరైనా పేదలకు దానంగా ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇవ్వాలంటే, గ్రహణం విడిచే సమయంలో లేదా గ్రహణం విడిచిన తర్వాత ఇవ్వాలి. ఒకవేళ ఈ సమయంలో మీకు దానం చేసేందుకు వీలు కుదరకపోతే మీరు మరుసటి రోజు కూడా చేయవచ్చు. ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, రాహువును తలచుకుంటూ ధ్యానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

English summary

Solar Eclipse 21 June 2020 Effect on All Zodiac Signs

Here we talking about solar eclipse june 2020 effect on zodiac signs remedies. Read on
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more