Just In
- 12 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- 14 hrs ago
ఆదివారం దినఫలాలు : ఓ రాశి వారికి ఆన్ లైన్ బిజినెస్ లో కలిసొస్తుంది...!
- 23 hrs ago
లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఈ ఘోరమైన క్యాన్సర్ గురించి మీకు తెలుసా?
- 24 hrs ago
మార్చి మాసంలో మహా శివరాత్రి, హోలీతో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, శుభముహుర్తాలివే...
Don't Miss
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- News
రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
- Movies
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశుల వారు త్వరలో గగన విహారం చేసేస్తారు...!
కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం నుండి చాలా మంది విమాన ప్రయాణికులు ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాదు తమ రవాణా పద్ధతిని కూడా పూర్తిగా మార్చుకునేందుకు సిద్ధపడ్డారు.
కేవలం రోడ్డు, రైలు మార్గాలను అనుసరించడం ప్రారంభించారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండటం.. దూర ప్రయాణాలకు ఎక్కువ సమయం తీసుకోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో మెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఇప్పటికే సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ కూడా తెరచుకున్నాయి. దేశీయ విమానాల రద్దీ కూడా బాగానే పెరిగింది. ఈ నేపథ్యంలోనే విదేశాలకు విమానాలు కూడా ప్రారంభమయ్యాయి. సమ్మర్ కు ముందే ఆయా విమాన సంస్థలు ప్యాసింజర్లను ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. అయితే ఎంత ప్లాన్ చేసుకున్నా కొంతమందికి ఏవో ఒక అడ్డంకులు వస్తుంటాయి.
దీంతో తమ జర్నీ ప్లాన్ వాయిదా వేసుకుంటూ ఉంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, జ్యోతిష్యశాస్త్రం మీద నమ్మకం ఉన్నవారైతే, మీకు రాబోయే రోజుల్లో విమాన యానం రాసిపెట్టుందో లేదో తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఏ రాశుల వారు త్వరలో గగన విహారం చేయనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Mars Transit in Taurus : కుజుడు వృషభంలోకి సంచారం... ఈ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది...!

మేష రాశి..
ఈ రాశి వారు వచ్చే మూడు లేదా నాలుగు నెలల్లో ఎక్కువగా జర్నీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ జర్నీ ప్లాన్ చేస్తారు. అవన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. అంతేకాదు చివరి నిమిషంలో ఆశ్చర్యకరమైన ప్రయాణాలు కూడా ఉంటాయి. మీరు పనికి సంబంధించిన ప్రయాణాలతో పాటు విహార యాత్రలు కూడా ఎక్కువగానే చేయొచ్చు.

వృషభ రాశి..
ఈ రాశి వారు రాబోయే రెండు లేదా మూడు నెలల వరకు ప్రయాణాలను ఎక్కువగా చేయలేరు. ఎందుకంటే ఏవో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఆగస్టు నెల తర్వాత జర్నీకి అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో విమాన ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

మిధున రాశి..
ఈ రాశి వారు ఈ ఏడాది ప్రయాణాలను ఎక్కువగా చేయకపోవచ్చు. ఎందుకంటే పని ఒత్తిడి, ఆఫీసులో టార్గెట్ల వల్ల మీ షెడ్యూల్ చాలా బిజీగా ఉండొచ్చు. దీని కారణంగా మీరు జర్నీ ప్లాన్ చేస్తే.. అవన్నీ వాయిదా పడే అవకాశం ఉంటుంది.
మీ పేరులోని ఏ అక్షరాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి?

కర్కాటక రాశి..
ఈ రాశి వారు రాబోయే నాలుగు నెలల పాటు రెగ్యులర్ గా విమాన ప్రయాణాలు చేయొచ్చు. ఈ సమయంలో మీరు ఆఫీస్ వర్క్ మరియు ఫ్యామిలీతో టూర్లను ప్లాన్ చేసి, విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే జూన్ తర్వాత మీ జర్నీ షెడ్యూల్ తగ్గిపోతుంది.

సింహ రాశి..
ఈ రాశి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సంవత్సరం జర్నీపై ఎక్కువ ఆసక్తి చూపలేకపోతారు. క్షణం తీరిక లేని కారణంగా అన్ని ప్రయణాలను వాయిదా వేసుకుంటారు. అయితే సెప్టెంబర్ తర్వాత ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకు వెళ్లొచ్చు.

కన్య రాశి..
ఈ రాశి వారు జూన్ నెల వరకు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవచ్చు. కరోనా మహమ్మారి వల్ల పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేసేందుకు ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల జర్నీని వాయిదా వేస్తారు. అక్టోబర్ తర్వాత ఈ రాశి వారు లాంగ్ టూర్ ప్లాన్ చేస్తారు.
ఈ వారం మీ రాశి ఫలాలు 21 నుండి ఫిబ్రవరి 27వ తేదీ వరకు

తుల రాశి..
ఈ రాశి వారు రాబోయే రెండు నెలల వరకు జర్నీని ఎక్కువ చేయలేరు. అయితే జూన్ నుండి అక్టోబర్ నెల వరకు చిన్న చిన్న ప్రయాణాలు చేయొచ్చు. అయితే వాటిలో ఆఫీసులో ఒత్తిడి వల్ల కొన్ని జర్నీలను వాయిదా వేసుకుంటారు.

వృశ్చికరాశి..
ఈ రాశి వచ్చే ఆరు నెలల వరకు రెగ్యులర్ గా జర్నీ చేస్తారు. ముఖ్యంగా ఆగస్టు తర్వాత ఫ్యామిలీతో ఎక్కువ టూర్లు ప్లాన్ చేస్తారు. అవన్నీ షెడ్యూల్ ప్రకారం సక్సెస్ అవుతాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు వచ్చే నాలుగైదు నెలల పాటు ఎక్కువ జర్నీ చేస్తారు. దీని కోసం ఇప్పటి నుండే ప్లాన్ వేసుకుంటారు. అయితే విదేశాలకు వెళ్లాలనుకుంటే మాత్రం జులైలోపే షెడ్యూల్ పూర్తవుతుంది. ఆ తర్వాత జర్నీ కుదరకపోవచ్చు. ఎందుకంటే పనులు పెరిగిపోతాయి.

మకర రాశి..
ఈ రాశి వారు ఈ ఏడాది మొత్తం రెగ్యులర్ గా జర్నీ చేయొచ్చు. వీరు ప్రతి నెలా ఏదో ఒక టూర్ ప్లాన్ చేస్తూనే ఉంటారు. అందులోనూ జూన్ నుండి అక్టోబర్ వరకు ఫ్యామిలీతో లాంగ్ టూర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఈ సంవత్సరం జర్నీని కొద్దిగా చేస్తారు. వీరు ఏమి ప్లాన్ చేసుకున్నా.. చివరి నిమిషంలో క్యాన్సిల్ అవుతుంటాయి. అయితే మే నెల నుండి జులై మధ్య లోకల్ ట్రిప్స్ మాత్రం సక్సెస్ కావొచ్చు.

మీన రాశి..
ఈ రాశి ఈ సంవత్సరంలో సెప్టెంబర్ వరకూ రెగ్యులర్ గా జర్నీ చేస్తారు. అంతేకాదు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా ఎక్కువ జర్నీ చేస్తారు. ఈ మధ్యలో ఆఫీసు టూర్లు కూడా ఉంటాయి. ఆ తర్వాత పర్సనల్ జర్నీని కూడా బాగా ఆనందిస్తారు.