For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ 'కరోనా' పేరేత్తితే అంతే సంగతులట... పొరపాటున పలికితే క్రిష్ణుడి జన్మస్థలానికేనట...

ఈ కరోనా వైరస్ కు బలయ్యారు. వేలాది మంది ఈ వైరస్ తో ఆస్పత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతన్నరు.

|

కరోనా వైరస్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారే ఉండరు. ఎందుకంటే కరోనా విలయతాండవం విశ్వవ్యాప్తంగా అంతలా విస్తరించింది. కరోనా మహమ్మారి దెబ్బకు 204 దేశాలు అష్టకష్టాలు పడుతున్నాయి.

Banned Use Of The Word Coronavirus

ఈ వైరస్ బారిన ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా పడ్డారు. దాదాపు లక్ష మంది వరకు మరణించారు. ముఖ్యంగా ప్రపంచంలోనే వైద్య రంగంలో రెండో స్థానంలో ఉన్న ఇటలీలోనే ప్రతిరోజూ కొన్ని వేల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు.

Banned Use Of The Word Coronavirus

కేవలం ఆరు కోట్ల జనాభా ఉండే ఆ దేశంలోనే లక్షలాది మంది ఊపిరాడక మరణిస్తూ ఉంటే, స్పెయిన్, అమెరికాతో పాటు చాలా దేశాల్లో ఈ కరోనా వైరస్ బారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతలా ఈ వైరస్ అందరినీ ఇబ్బంది పెట్టిందంటే..

Banned Use Of The Word Coronavirus

దీని రేంజ్ ఏంటో ఇప్పటికీ అందరికీ అర్థమయ్యుంటుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఇప్పటివరకు ఒక్క దేశంలో మాత్రం కరోనా వైరస్ కు సంబంధించి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదట.

Banned Use Of The Word Coronavirus

ఆ దేశం కరోనా అంటే డోంట్ కేర్ అనేస్తోంది. అంతేకాదండోయ్ తమ దేశంలో 'కరోనా వైరస్' అన్న పదం వినిపించకుండా చేసేసింది. ఆ పదాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదంతా ఎందుకు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం...

కరోనా సోకకూడదంటే...మీరు మీ ముఖాన్ని(కళ్లు, ముక్కు,నోరు) తాకకుండా ఉండటానికి వీటిని ప్రాక్టీస్ చేయండి...కరోనా సోకకూడదంటే...మీరు మీ ముఖాన్ని(కళ్లు, ముక్కు,నోరు) తాకకుండా ఉండటానికి వీటిని ప్రాక్టీస్ చేయండి...

కరోనా పేరేత్తితే కటకటాలే..

కరోనా పేరేత్తితే కటకటాలే..

తుర్కెమెనిస్థాన్ అనే దేశంలోని ప్రజలు ఎవ్వరైనా సరే కరోనా వైరస్ గురించి మాట్లాడితే పోలీసులు క్రిష్ణుడి జన్మస్థలానికి తీసుకెళ్తున్నారంట. దీని కోసం పోలీసులు ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేశారంట.

మఫ్టీ దుస్తుల్లో...

మఫ్టీ దుస్తుల్లో...

ప్రజలలో ఎవరెవరు ఈ కరోనా వైరస్ గురించి మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారట. అంతేకాదు. ప్రభుత్వ ఏజెంట్లు కూడా ప్రజల మధ్య తిరుగుతున్నారట.

అక్కడి ప్రజలకు..

అక్కడి ప్రజలకు..

అయితే అక్కడి ప్రజలకు కూడా ఈ కరోనా వైరస్ గురించి పెద్దగా తెలియకపోవడం విశేషం. కేవలం కొంతమందికి మాత్రమే ఆ వైరస్ గురించి సమాచారం ఉన్నట్లు వారి సర్వేలో తేలిందట.

కరోనా లాక్ డౌన్ : కలయికలో అలాంటి విషయాలను అస్సలు మరచిపోకండి...!కరోనా లాక్ డౌన్ : కలయికలో అలాంటి విషయాలను అస్సలు మరచిపోకండి...!

సోషల్ మీడియాలో కూడా..

సోషల్ మీడియాలో కూడా..

అంతటితో ఆగకుండా ఆ ప్రభుత్వం ఆ కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో మాట్లాడటానికి కూడా పూర్తిగి నిషేధించిందట. సమాచార ప్రతాలు, వీడియోలు, ప్రజల నోటి వెంట ఈ పదం వినిపించకూడదని ఆదేశాలు జారీ చేసిందట.

కరోనా పాజిటివే లేదు..

కరోనా పాజిటివే లేదు..

ఆ దేశంలో కరోనా వైరస్ గురించి ఇంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్లే అక్కడ ఇంతవరకూ ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదట.

ముందు జాగ్రత్తగా..

ముందు జాగ్రత్తగా..

అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుందట అక్కడి ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పటికే అక్కడికి పౌర ఉద్యమాలను కూడా నిషేధించిందట. జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పలు రసాయనాలతో శుభ్రం చేస్తున్నారట.

English summary

Turkmenistan Has Banned Use Of The Word 'Coronavirus'

Here we talking about turkemnistan has banned use of the word 'coronavirus'. Read on
Desktop Bottom Promotion