For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింహ రాశిలోకి శుక్రుడి సంచారం... ఏ రాశుల వారికి అనుకూలమంటే...!

శుక్రుడు సింహరాశిలోకి సంచరించే సమయంలో ఏయే రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రవాణా లేదా ప్రయాణం వల్ల మన జీవితాలపై చాలా ప్రభావం చూపుతుంది. అయితే గ్రహాలలో అతి పెద్ద గ్రహం సూర్యుడు అని చాలా మందికి తెలిసిందే. అయితే దాని తర్వాతే అతి పెద్ద గ్రహం శుక్ర గ్రహమే. ఈ గ్రహ ప్రభావం వల్ల చాలా మంది జీవితాల్లో వైవాహిక ఆనందం, గౌరవం వంటివి లభిస్తాయి.

Venus Transit in Leo: 28 September 2020 : Effects on Your Zodiac Signs in Telugu

ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 28వ తేదీ నుండి శుక్రుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలోనే సుమారు నెలరోజుల పాటు సంచరించనున్నాడు.

Venus Transit in Leo: 28 September 2020 : Effects on Your Zodiac Signs in Telugu

ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఇంతకీ ఏయే రాశుల వారిపై అనుకూల ప్రభావం ఉంటుంది.. ఏయే రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.. శుక్రుడి అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలను పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశుల వారు వారి తప్పులను అంగీకరించరు లేదా ఎప్పటికీ సరిదిద్దుకోరు ...!ఈ రాశుల వారు వారి తప్పులను అంగీకరించరు లేదా ఎప్పటికీ సరిదిద్దుకోరు ...!

మేష రాశి..

మేష రాశి..

శుక్రుడు సింహరాశిలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలుంటాయి. మీ ప్రేమ, వైవాహిక జీవితంలో మీ నిర్ణయాలకు మీ ప్రియమైన వారి నుండి మీరు కోరుకున్న మద్దతు లభిస్తుంది. మీ ఇద్దరి మధ్య పరస్పరం అవగాహన పెరుగుతుంది. దీని వల్ల మీరిద్దరూ మరింత దగ్గరవుతారు. అంతేకాదు మీరు ఎంచుకున్న రంగంలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీ పార్ట్ నర్ బాగా పురోగతి చెందుతారు. ఇది మీ మనసును ఆనందపరుస్తుంది.

పరిహారం : పరమేశ్వరునికి తెల్లని పూలతో పూజించాలి.

వృషభరాశి..

వృషభరాశి..

శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు కొత్త ఇల్లు కొనాలని లేదా ఇంటీరియర్ డెకరేషన్ పూర్తి చేయాలని ఆలోచిస్తుంటే, మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అదే సమయంలో కొత్త వాహనాన్ని సైతం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే మీరు ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఆఫీసులో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మరోవైపు ఒక పనిని పూర్తి చేయగల పూర్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, మీరు దాని గురించి ఆందోళన చెందుతారు మరియు అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతారు.

పరిహారం : పవిత్రమైన శుక్రవారం నాడు అన్నదానం చేయండి. మీకు మంచి జరుగుతుంది.

మిధున రాశి..

మిధున రాశి..

శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి సంతోషకరంగా ఉంటుంది. ప్రతి చోటా మీరు మంచి గౌరవాన్ని పొందుతారు. మీ కుటుంబంలో, వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది. మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలలో మీకు విజయం లభిస్తుంది. మీరు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తారు.

పరిహారం : వీనస్ బీజ మంత్రాలను జపించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

శుక్రుడు ఈ రాశి చక్రం నుండే సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో వ్యాపారులకు మంచి ఫలితాలుంటాయి. మీ కుటుంబంలో ఆనందం, ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం ఎక్కువగా ఉంది. దీని వల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందుతారు. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మీకు దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది.

పరిహారం : శుక్రవారం రోజున ఏదో ఒక దేవత గుడికి వెళ్లండి. ఎర్రని రంగులో ఉండే పూలతో పూజ చేయండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల సింహ రాశి వారికి అనుకూల ఫలితాలుంటాయి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు మానసిక ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. మీరు కష్టపడి పని చేసే వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.

పరిహారం : శుక్రవారం రోజున మీ ఇంట్లో లేదా ఆఫీసు శుక్ర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి.

కన్య రాశి..

కన్య రాశి..

శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో కన్య రాశి వారికి ప్రతికూల ఫలితాలుంటాయి. మీకు ఇల్లు, ఖర్చుల విషయంలో కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు మీరు ఆరోగ్య పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే, రెగ్యులర్ గా డాక్టర్ ను సంప్రదించాలి. ఈ సమయంలో చిన్న సమస్యలను కూడా విస్మరించవద్దు. అంతేకాక, మీరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని ట్రాఫిక్ నియమాలను పాటించాలి. ఆర్థిక పరంగా కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

పరిహారం : ఆవుకు ఏదైనా తెల్లగా ఉండే ఆహారాన్ని వండి పెట్టండి.

తుల రాశి..

తుల రాశి..

శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఆఫీసులో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు శత్రువులతో తెలివిగా మాట్లాడి.. మీ స్నేహితులుగా మార్చుకుంటారు. దీని వల్ల మీకు భవిష్యత్తులో మంచి ప్రయోజనం ఉంటుంది. మీకు సమజాంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.

పరిహారం : గోమాతకు బెల్లం లేదా పిండితో తయారు చేసిన ఆహారాన్ని పెట్టాలి.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఆఫీసులో సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటారు. మీరు సహోద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం : శుక్రవారం రోజున మీ రింగ్ ఫింగర్ కు ఓపాల్ రత్నాన్ని ధరిస్తే.. మీకు శుభప్రదంగా ఉంటుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, మీ మాటలపై శ్రద్ధ వహించాలి. మీ ఇంట్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

పరిహారం: మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించండి.

మకర రాశి

మకర రాశి

శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అడ్డంకులను ఎదుర్కొంటారు. మరోవైపు పిల్లల గురించి మీరు ఆందోళన చెందుతారు. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు.

పరిహారం : శుక్రవారం రోజున శుభప్రదమైన ఫలితాల కోసం తెల్లని వస్త్రాలను ధరించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించిన సమయంలో కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఆఫీసులో సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలోనే వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం బాగానే ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. అంతేకాదు మీ జీవిత భాగస్వామితో మీరు మంచి సమయాన్ని గడుపుతారు.

పరిహారం : ఏదో ఒక దేవత ఉండే దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

సింహరాశిలోకి శుక్రుడు ప్రవేశించే సమయంలో మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీకు ఈ సమయంలో శత్రువుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు జంక్ ఫుడ్ కు కూడా దూరంగా ఉండాలి. మీరు ఈ సమయంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి.

పరిహారం : శుక్రవారం రోజున శుక్ర గ్రహ అనుగ్రహం కోసం బీజ మంత్రాన్ని జపించాలి.

గమనిక : పైన చెప్పిన పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్ర పండితులు చెప్పినవే. మీరు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను పొందాలనుకుంటే, వ్యక్తిగతంగా జ్యోతిష్యశాస్త్ర పండితులను మిగిలిన పరిహారాలను తెలుసుకోవాలి. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోగలరు..

English summary

Venus Transit in Leo: 28 September 2020 : Effects on Your Zodiac Signs in Telugu

The Venus transit in Leo will take place on 28 September 2020 at 00:50 hours. Check out the effects on zodiac signs in Telugu.
Desktop Bottom Promotion