`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కన్యరాశిలోకి శుక్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

|

జ్యోతిష్యపండితుల అంచనాల ప్రకారం శుక్రుడు 2020, అక్టోబర్ 23వ తేదీన ఉదయం 10:34 గంటలకు సింహ రాశి నుండి కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈరోజు నుండి నవంబర్ 17 వరకు అంటే సుమారు 25 రోజుల వరకు అక్కడే ఉండనున్నాడు.

అయితే ఈ సమయంలో శుక్రుడు బలహీనమైన స్థితిలో ఉంటాడని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది.

నవగ్రహాలలో ఎంతో విశిష్టత కలిగిన ఈ శుక్రుడు తన స్థానాన్ని మారే సమయంలో ఏయే రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.. అన్ని రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి..

ఏయే రాశుల వారికి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి... ఏయే రాశుల వారికి ఆనందం వస్తుంది.. ఏ రాశుల వారికి ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కుక్కల గురించి ఇలాంటి కలలొస్తే.. ఎలాంటి ఫలితాలొస్తాయో తెలుసా...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి ఆరో స్థానంలో శుక్రుడు ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు శత్రువులు, చట్టపరమైన సమస్యలు ఎదురుకావొచ్చు. అంతేకాదు మీరు ఎంచుకున్నఫీల్డ్ లో మీకు ప్రత్యర్థులు పెరుగుతారు. మీ పనితీరుపై మీరు శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తుంటే ఇది సమయం కాదు. అంతే కాకుండా ఈ సమయంలో మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. దీని ఫలితంగా మీకు నిధులు పెరిగే అవకాశముంది. మీ కుటుంబ జీవితంలో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది.

పరిహారం : ‘లలిత సహస్రనామం' పాటించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి..

వృషభరాశి..

వృషభరాశి..

శుక్రుడు ఈ రాశి నుండి ఐదో స్థానంలోకి మారనున్నాడు. ఈ సమయంలో విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. దీని వల్ల మీకు నూతన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. మీరు ఎంచుకున్న ఫీల్డ్ లో కొత్త అవకాశాలను పొందుతారు. అంతేకాకుండా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు.

పరిహారం : మీ కుడి చేతి ఉంగరపు వేలికి వెండి రంగులో ఉండే వైట్ ఒపాల్ (6-7సెకన్లు) ధరించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి నాలుగో స్థానంలో శుక్రుడు ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీ తల్లి సంతోషంగా ఉంటారు. మీ సంపద కూడా పెరుగుతుంది. సామాజిక పనులు చేయడం వల్ల మీకు ఆదరణ పెరుగుతుంది. మీ యజమానులు మీ పనిని మెచ్చుకోవడం వల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీలో పెరుగుతుంది. మీరు వందశాతం కష్టపడి పని చేస్తారు.

పరిహారం : పవిత్రమైన శుక్రవారం రోజున తెల్లని వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి...

చాణక్య నీతి: మగవారి మనశ్శాంతిని నాశనం చేసే 6 విషయాలు...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి మూడో స్థానంలో శుక్రుడు రవాణ చేయనున్నాడు. ఈ సమయంలో మీరు వ్యాపారంలో తోబుట్టువుల మద్దతు పొందుతారు. అంతేకాకుండా మీ శక్తి పెరుగుతుంది. మీరు వ్రుత్తి పరమైన, సామాజిక జీవితంలో మీరు ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. భవిష్యత్తు పురోగతి కోసం చేసే ప్రయత్నాల్లో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. మీ కుటుంబంలో ఆనందంగా ఉంటారు. తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

పరిహారం : మీ కుడి చేతి ఉంగరపు వేలికి మూన్ స్టోన్ ను ధరించండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు రెండో స్థానం గుడా ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ వ్యాపారం పెరుగుతుంది. యజమానులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు మీరు కొత్త ఆదాయ వనరుల గురించి తెలుసుకుంటారు. మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. మీరు మీ లైఫ్ పార్ట్ నర్ తో మంచిగా గడుపుతారు.

పరిహారం : శుక్రవారం ఆవులకు గోధుమపిండిని దానం చేయాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు తొలి స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఫలితంగా కన్య రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ పనిని అందరూ ప్రశంసిస్తారు. మీ ప్రేమ జీవితానికి ఇది శుభపరిణామం. మీ బంధం ఇంకా బలపడుతుంది. అయితే ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. లేదంటే మీ లక్ష్యం నుండి తప్పుకునే అవకాశముంటుంది. మీ పేరేంట్స్ నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.

పరిహారం : లక్ష్మీదేవిని స్తుత్తిస్తూ ‘‘శ్రీ సూక్తం'' స్తోత్రాన్ని పఠించండి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 12వ స్థానం గుండా ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీకు విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. మీ వ్యాపారం గురించి మీరు నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేదంటే మీరు మంచి అవకాశాలను కోల్పోవచ్చు. మీకు భౌతిక ఆనందాలు పెరుగుతాయి. మీకు అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఉండొచ్చు.

పరిహారం : శుక్రవారం రోజున ‘అష్ట లక్ష్మి'స్తోత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 11వ స్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా మీకు ఆదాయ సంబంధిత సమస్యలు ముగుస్తాయి. మీరు ఎంచుకున్న రంగంలో అనుకూల ఫలితాలను పొందుతారు. మీరు మీ స్నేహితులతో కూడా సరదాగా గడుపుతారు. ఉద్యోగులకు అనేక ప్రాజెక్టులు పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా మీ గౌరవం కూడా పెరుగుతుంది. విద్యార్థులు కొత్త ఆలోచనలతో పని చేయాలి.

పరిహారం : పరశురాముని అవతారం యొక్క కథను చదవడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి పదో స్థానంలోకి శుక్రుడు రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీ స్థాయి పెరుగుతుంది. మీకు పొలిటికల్ లీడర్స్ తో పరిచయాలు పెరుగుతాయి. మీరు ఎంచుకున్న ఫీల్డ్ లో ప్రతి పనిలోనూ వందశాతం శ్రమించండి. లేకపోతే మీ ప్రత్యర్థులు ఈ సమయంలో పైచేయి సాధిస్తతారు. అంతేకాదు మీ పనులకు ఆటంకం కలిగిస్తారు. ఉద్యోగులు ఈ సమయంలో ఉద్యోగ మార్పునకు చేసే ఆలోచన సరైనది కాదు.

పరిహారం : శుక్రవారం రోజున తెలుపు రంగు దుస్తులు ధరిస్తే, మీరు అనుకూలమైన ఫలితాలను పొందొచ్చు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు తొమ్మిదో స్థానంలో రవాణా చేయనున్నాడు. వ్యాపారులు తమ పర్యటన యొక్క ప్రయోజనాలను పొందుతారు. మీ కుటుంబంతో సంబంధం మంచిగా ఉంటుంది. మీరు ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయొచ్చు. అది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీ ప్రేమ జీవితానికి ఇది ఉత్తమ సమయం. మీ మనసు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటుంది.

పరిహారం : శుభప్రదమైన ఫలితాల కోసం శుక్రవారం రోజున శుక్ర యంత్రాన్ని వ్యవస్థాపించండి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఎనిమిదో స్థానంలోకి సంచరించనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారికి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు కుటుంబ సభ్యులపై హెల్త్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీరు ఎంచుకున్న ఫీల్డ్ లో మీరు మంచి అనుభూతి చెందుతారు. సహచరుల నుండి మీరు మద్దతు, ప్రశంసలు అందుకుంటారు. మీ కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. మీరు కోపం నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

పరిహారం : మీ నుదుటిపై తరచుగా తెల్ల చందనం రాయాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఏడో స్థానంలో సంచరించనున్నాడు. ఈ సమయంలో మీన రాశి వారికి కొన్నిసమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులకు కొంత వివాదం ఉండొచ్చు. ఆరోగ్య పరంగా, వైవాహిక జీవిత పరంగా ఇది సరైన సమయం కాదు. ఇప్పుడు మీ జీవిత భాగస్వామితో మీ భావాలను బహిర్గతం చేయకండి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.

పరిహారం : ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలను నమలడం వల్ల శుభఫలితాలొస్తాయి.

English summary

Venus Transits In Virgo On 23 October 2020 Know the Effects on All Zodiac Signs in telugu

Venus Transits In Virgo On 23 October 2020. Check out the effects on all zodiac signs, and learn about remedies to perform in telugu.