For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ వీడియో : ఆ కుక్క కారులో ఒంటరిగా ఉన్న సమయంలో ఏమి చేసిందో మీరే చూడండి...

తన కారు చెరువులోకి దిగడం మరియు అతని కుక్క ఓపెన్ టాప్ ద్వారా కారు నుండి బయటకు రావడానికి ప్రయత్నించడాన్ని చూసిన అతను భయపడ్డాడు.

|

మీరు కారులో వెళ్లేటప్పుడు మీ పెంపుడు కుక్కను రైడింగుకు తీసుకు వెళుతున్నారా? మీరు పార్కింగ్ చేసిన కారును కుక్క నడపడం ఎప్పుడైనా చూశారా? కుక్క ఏంటి? డ్రైవింగ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఓ కుక్క పార్కింగ్ చేసి ఉన్న కారును నడపడమే కాదు ఏకంగా చిన్న చెరువులోకి దింపేసింది.

Dog In China Accidentally Drives

ఈ సంఘటన అంతా సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. దీన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో ఇది బాగా వైరల్ అయిపోయింది. ఇది చూస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు. మీకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేకపోతే ఈ వీడియో చూడండి...

నవ్వుకుంటున్న నెటిజన్లు..

చైనాలోని ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను కారులో ఒంటరిగా ఉంచి, దాన్ని పార్కింగ్ చేసి, ఏదో పని నిమిత్తం బయటకు వచ్చాడు. అంతే ఆ కారు అకస్మాత్తుగా అక్కడి నుండి ఎదురుగా ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అదంతా సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోయారు. దీనిపై విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

వాలెట్ కోసం బయటకు..

వాలెట్ కోసం బయటకు..

జియా అనే దుకాణదారుడు తన కారును చిన్న చెరువు దగ్గర పార్క్ చేశాడు. అయితే అందులో తన పెంపుడు కుక్క పూచ్ ను లోపలే పెట్టాడు. అదే సమయంలో అతను వాలెట్ కోసం బయటకు దిగాడు. అంతే ఆ కారు ఒక్కసారిగా చెరువులోకి కదిలిపోయింది. అయితే ఆ యజమాని కారును ఆన్ లోనే ఉంచాడు.

PC : Youtube

అదే అతను చేసిన తప్పు..

అదే అతను చేసిన తప్పు..

ఆ సమయంలో అతను కారును ఆన్ చేయడమే పెద్ద తప్పు. సరిగ్గా అదే సమయంలో కుక్క ఉత్సాహంగా ఉండి అనుకోకుండా కారులోని గేర్ ను డ్రైవ్ మోడ్ లోకి మార్చింది. దీంతో కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత వచ్చిన అతను అది చూసి షాకయ్యాడు.

సహాయం కోసం స్థానికులను..

సహాయం కోసం స్థానికులను..

తన కారు చెరువులోకి దిగడం మరియు అతని కుక్క ఓపెన్ టాప్ ద్వారా కారు నుండి బయటకు రావడానికి ప్రయత్నించడాన్ని చూసిన అతను భయపడ్డాడు. వెంటనే తనకు సహాయం చేయాలని స్థానికులను కోరాడు. చివరికి తన కుక్కను స్థానిక ప్రజల సహాయంతో ఒక చెక్క పలక మరియు కర్రతో రక్షించాడు. అయితే కారుకు ఏమి జరిగిందో అనే వివరాలు తెలియరాలేదు. కానీ కుక్కను మాత్రం సురక్షితంగా రక్షించారు.

జాగ్రత్తగా ఉండండి..

జాగ్రత్తగా ఉండండి..

అదృష్టవశాత్తు ఆ కుక్కకు ఏమి జరగలేదు. అయితే జియా తన కారును, కుక్కను చెరువు నుండి బయటకు తీసుకురావడానికి పడ్డ బాధను మనం ఊహించగలం. అందుకే మీ పెంపుడు జంతువులను కారు లోపల వదిలివేసినప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే కుక్కలకు మంచి లేదా చెడు అర్థం చేసుకునే తెలివి అనేది అంతగా ఉండదు.

English summary

Viral : Dog In China Accidentally Drives His Owner's SUV Into Pond After Being Left Alone

In a bizarre and hilarious incident, a dog drove his owners car into the pond. The man actually left his dog inside the car while he himself went out to fetch a box. Since the ignition was on, the dog changed the gear and drove it into a pond.
Story first published:Friday, December 20, 2019, 16:47 [IST]
Desktop Bottom Promotion