For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు

|

సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి. మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో అనుకూలంగా ఉండదు. మీరు కార్యాలయంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. అనవసరమైన విషయాలను పట్టించుకోంకండి. ముఖ్యంగా మీ సహోద్యోగులతో గొడవలకు దిగకండి. లేకపోతే మీరు వివాదాల్లో మునిగిపోతారు.

మిమ్మల్ని అర్థం చేసుకునే వారితో మీ భావాలను వ్యక్తపరచవచ్చు. ఇందుకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ఆలోచనలను మీ జీవిత భాగస్వామితో పంచుకోవచ్చు. మీరు మీ భాగస్వామితో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ వారం ఆర్థిక పరంగా ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయి. అందువల్ల ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. ఈ వారం ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 6

లక్కీ డే : శనివారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ వారం ఈ రాశి వారు ప్రారంభ రోజులలో కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడతారు. కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చి మిమ్మల్ని కలవరపెట్టడానికి ప్రయత్నిస్తారు. మీరు అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. పని విషయంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు ఒత్తిడికి గురవుతున్నట్లయితే, మీరు మీ ఉన్నతాధికారులతో మాట్లాడాలి.

ఈ వారం, మీరు కొన్ని ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టాలి. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా విజయం దక్కుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. కష్ట సమయాల్లో కూడా మీరు ధైర్యంతో పని చేస్తారు. ఆర్థిక పరంగా ఈ వారం అంతా అనుకూలంగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 19

లక్కీ డే : బుధవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం మంచిగా ఉంటుంది. పనిలో మీ బాధ్యతలు కూడా కొద్దిగా పెరుగుతాయి. దీంతో మీకు పని భారం కొంచెం పెరగొచ్చు. అయినా కూడా మీరు మెరుగైన పనితీరు కనబరుస్తారు. మంచి ప్రణాళిక మరియు అవగాహనతో, మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయడంలో విజయవంతమవుతారు. మీ ఉన్నతాధికారులు కూడా మీకు పూర్తి మద్దతు ఇస్తారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు.

మీ జీవిత భాగస్వామికి భావోద్వేగ అనుబంధం చూపించడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఎంత మంచివారో వారికి అర్థమవుతుంది. వీలైతే ఈ వారం వారితో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.. ఈ వారం ఆరోగ్యం బాగుంటుంది. అయితే డయాబెటిస్ రోగులు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : ఆదివారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారు కొంత కాలంగా అలసట వల్ల ఉత్సాహాన్ని తగ్గించుకుంటారు. అయితే పనికి సంబంధించి ప్రతి ఒక్కరిలోని ప్రతిభ బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి. ప్రజలు కూడా మీ సామర్థ్యాన్ని తెలుసుకోవడాన్ని ప్రారంభిస్తారు. మీరు ఏదైనా మానసిక ఉద్రిక్తతను అనుభవిస్తుంటే, మీరు ధ్యానం చేయాలి.

కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి బయటి వ్యక్తులను అనుమతించవద్దు. ఆర్థిక పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడులు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. మీరు ఒంటరిగా ఉండి భాగస్వామి ఎదురుచూస్తుంటే కొంచెం వేచి ఉండాలి. తొందరపడకూడదు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 17

లక్కీ డే : మంగళవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారిలో ఈ వారం వివాహం అయిన జంటలకు ప్రత్యేకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ నుండి ఏదైనా ప్రత్యేక బహుమతిని ఆశించవచ్చు. మీరు మీ ప్రియురాలితో మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే మీ జ్ఞాపకాలను తిరిగి పొందుతారు. మీ పట్టుదల మరియు సామర్థ్యాలను ప్రజలు అభినందిస్తారు. ఈ వారం ఆర్థిక పరంగా మంచి ఫలితాలు ఉంటాయి.

ఈ వారం మీ ఆనందం రెట్టింపు అవుతుంది. అయితే మీరు ఇతరులతో ఆలోచనాత్మకంగా వ్యవహరించకపోతే, మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ వారం పని విషయంలో సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : శనివారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా కాలం తర్వాత సుఖంగా మరియు సంతోషంగా అనిపిస్తుంది. మీపై మీకు విశ్వాసం కూడా పెరుగుతుంది. దీనివల్ల మీ పనితీరు కూడా మెరుగుపడుతుంది. సీనియర్లు మీ సామర్థ్యాన్ని అభినందిస్తారు. మీ తెలివితేటలు మరియు అవగాహనతో మీరు క్లిష్ట పరిస్థితులను చాలా సులభంగా ఎదుర్కొంటారు. ఈ వారంలో వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకోవచ్చు.

మీరు మీ కుటుంబంపై కూడా శ్రద్ధ చూపాలి. వారికి మీ ప్రేమ మరియు సహకారం కూడా అవసరం. మీరు ఖర్చు చేసే దాని కంటే ఎక్కువ ఆదా చేస్తారని మీరు ఎల్లప్పుడూ నమ్ముతారు. మీరు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు పొందవచ్చు. ఈ వారం వ్యక్తిగత జీవితానికి చాలా ముఖ్యమైనది. మీరు శ్రద్ధ వహించాల్సిన కొన్ని ముఖ్యమైన సమస్యలు కూడా ఉన్నాయి. ఈ వారం విద్యార్థులకు చాలా మంచిది.

లక్కీ కలర్ : డీప్ బ్లూ

లక్కీ నంబర్ : 3

లక్కీ డే : మంగళవారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇటీవల ఏదైనా కొత్త పనిని ప్రారంభించి ఉంటే, మీరు ఈ వారంలో రెట్టింపు ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే, మీరు దాన్ని కూడా సులభంగా తిరిగి పొందుతారు. మీరు మీ యొక్క అన్ని ప్రయత్నాలలో విజయవంతమవుతారు. మీరు ఊహించిన విధంగానే ఫలితాలు ఉంటాయి.

సీనియర్లు మిమ్మల్ని మరింత మెరుగ్గా చేయమని ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఈ సమయంలో మీ పని కూడా ఎంతో ప్రశంసించబడుతుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న ప్రజలకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పు ఉండవచ్చు. ఈ కాలంలో వివాహిత జంటలకు కొన్ని శుభవార్తలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 7

లక్కీ డే : సోమవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ వారం ఈ రాశి వారు చాలా బిజీగా ఉంటారు. కానీ మీ ప్రియమైన వారితో ఆనందించడానికి మాత్రం మీకు తగినంత సమయం లభిస్తుంది. మీరు కొన్ని మంచి పనులు కూడా చేయవచ్చు. మీ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు తెలివిగా వ్యవహరిస్తే మీరు పెద్ద ఆర్డర్ పొందే అవకాశం ఉంది. పెండింగ్ పనుల కారణంగా మీ ఉన్నతాధికారులు మీపై కలత చెందుతారు. మీరు మీ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.

మీకు మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు సహకారం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. దీని వల్ల మీ సంబంధం చాలా బలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది. ఈ వారం మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. భయాందోళనలకు దూరంగా ఉండాలి. ప్రేమ విషయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 3

లక్కీ డే : శుక్రవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక పరంగా ఆందోళన చెందుతారు. డబ్బు కోసం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కకపోవడంతో నిరాశ చెందే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవలసి ఉంటుంది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనుకుంటే మీరు మంచి ఆర్థిక ప్రణాళికను రూపొందించాలి. ఇది కచ్చితంగా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఈ వారం మీకు చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భంలోనే మీరు ధైర్యం చూపించాలి. అలాంటి సవాళ్లను ఎదుర్కోవాలి. మీరు ఉద్యోగం చేస్తే, మీరు ఈ వారం అన్ని పనులను పూర్తి చేస్తారు. మీకు అలసట, నిరాశ అనిపిస్తే, మీ జీవిత భాగస్వామితో కొన్ని రోజులు బయటకు వెళ్లండి. ఇది ఒకరితో ఒకరు సమయం గడపడానికి కూడా అవకాశం ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం మీకు మంచిగా ఉండదు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ డే : గురువారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, మొదట అందుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందండి. మీ జీవిత భాగస్వామి యొక్క మారుతున్న మానసిక స్థితిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. మీరు అతనితో / ఆమెతో హాయిగా కూర్చుని మాట్లాడటం చాలా ముఖ్యం. మీరు మీ సమస్యలను ఇంటి పెద్దలతో లేదా మీకు దగ్గరగా ఉన్న వారితో పంచుకోవాలి. దీని వల్ల మీరు మీ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. ఈ వారం మీరు కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇల్లు లేదా కార్యాలయం విషయంలో మీరు ఆచితూచి అడుగేయాలి. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో కూడా నిజాయితీగా ఉండాలి. మీరు వారం చివరిలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు అలసిపోయే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 6

లక్కీ డే : సోమవారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ వారం ఈ రాశి వారిలో వివాహం చేసుకున్న జంటలకు ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీ పిల్లల పనితీరు బాగా ఉంటుంది. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. పనికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు వ్యాపార సమస్యలతో చాలా బిజీగా ఉండబోతున్నారు. మీరు కొత్త ఆర్థిక ప్రణాళికను ఖరారు చేయవచ్చు. వ్యాపారం కాకుండా, మీరు శ్రద్ధ వహించే అనేక సమస్యలు ఉన్నాయి. మీరు మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వారు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు.

అలాగే వారం ప్రారంభంలో మీ ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. వారం రెండో భాగంలో కొంత మెరుగుదల కనిపించే అవకాశం ఉంది. మీరు ఎప్పటిలాగే అదే ఉత్సాహంతో పని చేస్తారు. మీ ఆర్థిక ప్రయత్నాలు ఈ వారం విజయవంతమవుతాయి. మీరు ఈ వారం ప్రయాణానికి దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ డే : ఆదివారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం వ్యక్తిగతంగా మరియు పని విషయంలో చాలా సానుకూల మార్పులు ఉంటాయి. మీ ఇంట్లో మతపరమైన కార్యక్రమం ఏదైనా నిర్వహించబడవచ్చు. ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యులలో ప్రేమ మరియు స్నేహం పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో గొడవలు కూడా అంతమవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే మీరు ఈ వారం బాగా డబ్బు సంపాదించవచ్చు. మీరు కూడా ఆదా చేయవచ్చు.

పని విషయంలో ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు తమ డబ్బును ఈ వారంలో కొత్త వెంచర్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. పెళ్లి అయిన జంటలకు మంచి సమయం ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో ప్రేమలో మునిగిపోతారు. మీ సంబంధం యొక్క మాధుర్యం అలాగే ఉంటుంది. పిల్లల వైపు నుండి ఒక శుభవార్త మీ ఆనందాన్ని పెంచుతుంది. అవివాహితుల కోసం కొన్ని మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 18

లక్కీ డే : గురువారం

English summary

Weekly Rashi Phalalu for December 1 to December 7

Read your weekly horoscope for all important information regarding the coming seven days.
Story first published: Sunday, December 1, 2019, 7:00 [IST]