For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Population Day 2021:ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే...!

ప్రపంచ జనాభా దినోత్సవం 2021 యొక్క చరిత్ర, థీమ్ మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రతి సంవత్సరం జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు, స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం, మానవ హక్కులు, బాల్య వివాహాలు, కుటుంబ నియంత్రణ వంటి విషయాలపై అవగాహన కల్పిచేందుకు ఈరోజున ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తారు.

World Population Day 2021: History, Theme And Significance in Telugu

ప్రపంచ జనాభా దినోత్సవ చరిత్ర..
యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించింది. ఏ రోజున ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తారో, ఆ రోజున(1975 జులై 11న) దీనిని జరపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 1987 సంవత్సరంలో జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. దీనిని ప్రతి ఏటా ఆనవాయితీగా కొనసాగించాలని 1990లో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ తీర్మానం చేసింది. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరగడం వల్ల ఏర్పడే ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు, ఈ సమయంలో నిర్వహించే కార్యక్రమాలు దోహద పడతాయని తెలిపింది.

World Population Day 2021: History, Theme And Significance in Telugu

మానవ వనరులు అత్యవసరం..
ఈ ప్రపంచానికి మానవ వనరులు అత్యవసరం. ప్రపంచంలోని ఏ దేశమైన తిరోగమనం చెందేందుకు కూడా మానవ వనరులు కారణం అవుతున్నాయి. అందువల్ల జనాభా అనే వనరును సక్రమంగా ఉపయోగించుకోకపోతే, ప్రపంచ గమనానికే ముప్పు తప్పదన్నమాట.

World Population Day 2021: History, Theme And Significance in Telugu

ఏ దేశమైనా సరే పెరిగిన జనాభాకు తగిన ఉద్యోగాలు, ఆహారం, ఆవాసం, సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. వీటిలో ఏవి తగ్గినా.. పరిస్థితి అల్లకల్లోలంగా తయారవుతుంది. జపాన్ వంటి ఎక్కువ భూమి లేని దేశాల్లో జనాభా అనేది ఎప్పుడూ భారంగా ఉంటోంది. ఇక చైనాలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికీ.. అందుకు తగినంత భూమి, వనరులు ఉండటం.. మానవ వనరుల్ని ఆ దేశం సక్రమంగా వినియోగిస్తుండటంతో.. చైనాకు జనాభా అంశం కలిసి వస్తోంది. మన దేశం కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ.. మానవ వనరుల్ని సక్రమంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

 World Population Day 2021: జనాభా పెరుగుదలకు కారణం తెలిస్తే షాకవుతారు...! World Population Day 2021: జనాభా పెరుగుదలకు కారణం తెలిస్తే షాకవుతారు...!

700 కోట్లు దాటిన జనాభా..
2010 సంవత్సరంలో 700 కోట్లు ప్రపంచ జనాభా దాటినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ప్రస్తుతం భూమిపై 800 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఒక్క చైనా, భారత్ నుండి 250 కోట్ల మందికి పైగా ఉన్నారు. అయితే 2050 నుండి ప్రపంచ జనాభా సంఖ్య తగ్గొచ్చనే అంచనాలున్నాయి.

కరోనా మహమ్మారి..
2019లో కొత్తగా మన మధ్య వచ్చి చేరిన కరోనా ప్రతి ఒక్కరినీ కలవరపెట్టింది. ఈ సమస్య ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు, బాలికల ఆరోగ్యం, వారి హక్కుల రక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ కరోనా మహమ్మారి ఇలాగే కొనసాగితే.. ప్రపంచ గమనం ముందుకు సాగే పరిస్థితులు కనబడటం లేదు. అయితే సంతోషించదగ్గ విషయం ఏమిటంటే.. కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అవి అందరికీ అందితే ప్రయోజనం ఉండొచ్చు. అంతవరకూ ఆటంకాలు తప్పేలా కనబడటం లేదు.

English summary

World Population Day 2021: History, Theme And Significance in Telugu

Here we are talking about the World Population Day 2021: History, theme and significance in Telugu. Read on
Story first published:Sunday, July 11, 2021, 10:21 [IST]
Desktop Bottom Promotion