For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశి ప్రకారం మీరు పెంచుకోవాల్సిన ఉత్తమ జంతువు ఏదో తెలుసా...

|

మీ ఇంటికి లేదా మీ మానసిక స్థితికి ఎలాంటి పెంపుడు జంతువు సరిపోతుందో మీకు తెలియడం లేదా? మీరు కూడా చాలా మందిలాగే జంతువులను లేదా పక్షులను పెంచుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారా? మీ రాశి చక్రం ఆధారంగా మీకు ఏది ఉత్తమమైన పెంపుడు జంతువో తెలుసుకోవాలనుకుంటున్నారా?

అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ జీవన శైలి, మానసిక స్థితి మరియు ఇంటికి ఎలాంటి పెంపుడు జంతువు సరిపోతుందో మీ రాశిచక్రమే చెబుతోంది. మీరు ఏ విధమైన జంతువుల సంరక్షణను ఉత్తమంగా చూసుకుంటారు. వాటిపై మీరు ఎంత శ్రద్ధ చూపుతారు. మీరు ఎలాంటి జంతువును దత్తత తీసుకోవాలి వంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు స్టోరీలో తీసుకొచ్చాం. అవేంటో మీరే చూసేయండి..

మేషం, మీన రాశులు : శునకం..

మేషం, మీన రాశులు : శునకం..

మేష రాశి మరియు మీన రాశి వారు పెంచుకోవాల్సిన పెంపుడు జంతువు ఏంటంటే శునకం. ఇది ఎల్లప్పుడూ మీకు శక్తిని ఇస్తుంది. దీని వల్ల మీకు ఎల్లప్పుడూ మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీ శునకం మీ భావాలను అర్థం చేసుకోవాలని మీరు కోరుకుంటారు. అందుకే బాగా శిక్షణ పొందిన శునకాన్ని ఎంచుకోండి. అప్పుడు శునకాలు కూడా మీకు మంచి స్నేహితులు అవుతాయి. కుక్కలకు ప్రత్యేక శ్రద్ధ కూడా అవసరం కాబట్టి ఈ రాశుల వారికి మాత్రమే వీటిని నిర్వహించడం సాధ్యమవుతుంది.

వృషభ రాశి : మూషికం..

వృషభ రాశి : మూషికం..

ఈ రాశి వారు పెంచుకోవాల్సిన పెంపుడు జంతువు మూషికం. ఈ రాశి వారు కొంత సోమరితనంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడతారు. అందుకే వీరికి తెల్ల చిట్టెలుక సరదాగా గడపడానికి ఉత్తమమైన జంతువు. దీంతో ఆడుకోవడానికి ఎక్కువ శక్తి కూడా అవసరం లేదు. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న పెంపుడు జంతువు కూడా. ఇది మీతో సమయం గడపడం మరియు ఆనందించడానికి కూడా ఇష్టపడుతుంది. మీలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ‘అందరివాడు‘లో హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎలుకను స్నేహం చేస్తాడు. అందులో ఎలుక సహాయంతో సునీల్ ను ఎంతా ఏడిపించాడో మీ అందరికీ తెలిసే ఉంటుంది.

మిథున రాశి : చిలుక

మిథున రాశి : చిలుక

మిథున రాశి వారు జంతువుల ప్రేమికులుగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ జంతువులతో మాట్లాడతారు. వాటి గురించి గురించి ఆలోచిస్తారు. వాటిని మరింత చురుకుగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వీరుతెలివైన పక్షి అయిన చిలుకను పెంచుకోవాలి. ఇది అందరి మానసిక స్థితి మరియు ఆసక్తిని పెంచుతుంది. మిమ్మల్ని బాగా ఆకర్షిస్తుంది. మీతో మాట్లాడే సామర్థ్యాన్ని సైతం కలిగి ఉంటుంది.

కర్కాటక రాశి : ముళ్లపంది..

కర్కాటక రాశి : ముళ్లపంది..

ఈ రాశి వారు కొద్దిగా మూడీగా మరియు ఎమోషనరల్ గా ఉంటారు. వీరికి తగినంత శక్తి లేని జంతువు అనుకూలమైనది. మీరు గట్టిగా కౌగిలించుకోవడం మంచిగా అనిపిస్తుంది. మీ ప్రేమను పంచాల్సిన మరియు శ్రద్ధ వహించాల్సిన జంతువు చిన్న ముళ్ల పంది. ఇది చాలా మందికి వింతగా అనిపించినప్పటికీ, శిశువు ముళ్లపంది మీకు బాగా నచ్చుతుంది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.

సింహ మరియు ధనస్సు రాశులు : పిల్లి..

సింహ మరియు ధనస్సు రాశులు : పిల్లి..

ఈ రెండు రాశుల వారు పిల్లిని పెంచుకోవాలి. మీ పెంపుడు జంతువు ఆకర్షణీయంగా ఉండాలి అని మీరు కోరుకుంటే అన్ని చోట్ల పర్యటించే పిల్లి కోసం వెతకండి. ఇది మీ మనసును ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీ పూర్తి శ్రద్ధను పిల్లి ఎప్పటికీ కోరుకోదు. కాకపోతే ఇది దొరకటం అనేది అంత సులభం కాదు. కానీ ఎవరితోనైనా పిల్లి మీకు సరైన పెంపుడు జంతువు అవుతుంది.

కన్య రాశి : చేప..

కన్య రాశి : చేప..

ఈ రాశి వారు చేపలను క్రమబద్ధంగా పెంచడానికి ఇష్టపడతారు. కుక్క లేదా పిల్లి వంటి వాటిని పెంచుకునేందుకు వీరికి ఓపిక ఉండదు. ఎందుకంటే ఇవి ఇంటి చుట్టూ పరుగెడుతాయి. ఇల్లు అంతా చెల్లా చెదురుగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు గందరగోళానికి కారణమవుతాయి. చేపలకు ఇలాంటి అవకాశం ఉండదు కనుక, వాటిని అక్వేరియంలో ఉంచితే వాటి పని అవి చూసుకుంటాయి. వీటి నిర్వహణకు కూడా తక్కువ సమయం పడుతుంది. చేపలు మనతో మంచి తోడుగా మారతాయి. వీటి వల్ల ఎలాంటి గందరగోళం ఉండదు.

తులా, మకర రాశులు : కుందేలు

తులా, మకర రాశులు : కుందేలు

ఈ రాశుల వారు కుందేలును పెంచుకోవాలి. ఇది మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు కూడా వీటితో రిలేషన్ షిప్ కు మంచి ప్రాధాన్యత ఇస్తారు. వీటితో ఆడుకోవాలనుకుంటారు. అందుకే కుందేలు మీకు పరిపూర్ణ జంతువు ఇది చూడటానికి చాలా అందంగా మరియు ప్రేమగల మరియు అద్భుతమైన ఆకర్షణీయంగా ఉంటుంది. వీటికి మీ నుండి ఎక్కువ సమయం లేదా శ్రద్ధ అవసరం లేదు.

వృశ్చిక రాశి : పాము

వృశ్చిక రాశి : పాము

ఈ రాశి వారు ఏదైనా పాము లాంటి సరీసృపాలను పెంచుకోవాలి. మీకు పాము లాగా మర్మమైన స్వభావాలు, కల్పనలు మరియు విభిన్న చీకటి లక్షణాలు ఉంటాయి. అందుకే మర్మమైన స్వభావాన్ని మరియు వారి అన్యదేశ సౌందర్యాన్ని ఎప్పుడూ మెచ్చుకోదు. ఇది ఎంత భిన్నంగా ఉందో అంత అభినందిస్తుంది.

కుంభ రాశి : పక్షులు

కుంభ రాశి : పక్షులు

ఈ రాశి వారికి పక్షులు అనేవి ఎల్లప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలాగే ఇవి పెంపుడు జంతువులుగా కూడా ప్రత్యేకమైనవి. మీరు ఏదైనా పెంపుడు జంతువుల కోసం చూస్తున్నట్లయితే మీరు ఒక పక్షిని పెంచుకోవచ్చు. ఉదాహరణకు పావురం లేదా పిచ్చుక వంటి వాటిని పెంచుకోవచ్చు. ఇవి చాలా చురుకైనవి. ఇవి చాలా ప్రత్యేక లక్షణాలతో ఉండటమే కాకుండా ఆసక్తికరంగా కూడా ఉంటాయి.

English summary

Zodiac Sign Best Pet For You

Your zodiac sign can reveal so much about yourself and what you're looking for in other people, so of course it can also show what kind of animals you would best interact with. Your pet says a lot about who you are, so you want to pick one that goes with your personality, wants, and needs. If you're looking for a pet mainly for cuddles, then you want one that loves a lot of attention. in this article we are discussing about which pet suits you based on your zodiac sign. Read on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more