Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మనిషి శరీరంలో అవయవాలను తినేస్తోన్న బ్యాక్టిరియా.. జపాన్‌లో విజృంభిస్తోన్న స్ట్రెప్టోకొక్కస్ వ్యాధి..!
జపాన్ లో ఒక కొత్త వైరస్ విజరుంభిస్తోంది ఈ వైరస్ కరోనాకన్నా చాలా ప్రమాధాకరంగా పరిగనిస్తున్నారు. ఈ వైరస్ పేరే స్ట్రెప్టోకొక్కల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. మనిషిలో వుండే మాంసాన్ని ఈ వైరస్కు చెందిన బాక్టీరియా క్రమ క్రమంగా తినేస్తుంది. జపాన్ లో ఇప్పటికే ఇలాంటి కేసులు వందకు పైగా నమోదయ్యాయి.
ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ ను ఎస్టీఎస్ఎస్ అని అంటారు. ఈ బాక్టీరియా శరీరంలోకి చేరగానే వెంటనే రక్తనాలాల్లోకి, అవయవాల్లోకి ప్రవేశించి క్రమ క్రమంగా తినేస్తుంది.

ఎస్టీఎస్ఎస్ సోకగానే ముందుగా జ్వరం తీవ్రంగా వస్తుంది, కాండరాళ్లు నొప్పులు వస్తాయి. వాంతులు కూడా విపరీతంగా అవుతాయ్. శరీరంపై వాపులు రావడం, అవయవాలు ఫెయిల్ అవడం జరుగుతాయ్.
ఎస్టీఎస్ఎస్ సోకిన వారికి చికిత్స చేద్దామని అనుకున్న కోలుకునే రేటు చాలా తక్కువగా ఉంటుంది. పదిమందిలో ముగ్గురు మరణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జపాన్ లో 1000 కేసులు నమోదు అయితే అందులో 30% మంది మరణించారు.
అయితే జపాన్ లో ఈ వ్యాధి ఎప్పటినుంచో ఉంది. ఎప్పుడూ లేనంతగా ఈ వ్యాధి ఈమధ్య చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. వ్యాధి లక్షణాలు సోకిన 48 గంటల్లో రోగి మృతి చెందుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రోగనిరోధక శక్తి తగ్గడమేనని జపాన్, పరిశోధకులు వైద్యులు అంటున్నారు.

ఈ ఎస్టీఎస్ఎస్ వ్యాధి ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. కరోనాకి పాటించిన నిబంధనలను పాటిస్తే ఈ వ్యాధి నుంచి కూడా తప్పించుకోవచ్చు. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. ఎవరైనా దగ్గితే తమ్మితే మీద పడకుండా జాగ్రత్త పడాలి.
ఈ వ్యాధిని అరికట్టడానికి జపాన్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. జపాన్లోని అన్ని ఆసుపత్రులు అలర్ట్ అయ్యాయి. 55 ఏళ్లకు పైబడిన వాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తున్నట్లు కానుగ్గోన్నారు. అసలు ఈ ఎస్టీఎస్ఎస్ వ్యాధి ఎలా ఎక్కడి నుంచి సంక్రామిస్తోందో చెప్పలేకపోతున్నారు.
ఒతర కొన్ని దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2022లో యూరోపియన్ దేశాల్లో ఈ వ్యాధి వ్యాపించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయ్. మార్చ్ 2024లో ఈ స్ట్రెప్‌టోకొక్కస్ కేసులు అమాంతంగా పెరిగినట్లు పరిశోధకులు చెబుతున్నారు.
గాయపడి శస్త్రచికిత్స చేయించుకుంటున్న 50 ఏళ్లు పైబడిన వాళ్లల్లో ఈ వ్యాధి వ్యాపించినట్లు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి గురించి తెలుసుకున్న చాలా మంది నెటిజెన్లు ఆందోళనకు గురౌతున్నారు. మనిశిలోని అవయవాలను, మాంసాన్ని తినే బ్యాక్టీరియా ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే కావాలనే ఇలాంటి బ్యాక్టీరియాను వ్యాపించేలా చేస్తున్నారని, అలాంటి వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
సాంకేతికంగా జపాన్ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇలాంటి వ్యాధిని తట్టుకోలేక వుండడం ప్రపంచ దేశాలను భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయ్. జపాన్ చాలా చిన్న దేశం, అక్కడ జనాభా కూడా చాలా తక్కువ, ఆధునిక పరిఘ్నానం ఎంత వున్నా కూడా స్ట్రెప్‌టోకొక్కస్ వ్యాధి విజృంభిస్తోంది. అదే వ్యాధి భారత్‌లో గనక వ్యాపిస్తే ఇక్కడ పరిస్థితి మరింత ఘోరంగా వుంటుంది. ప్రస్తుతం మనది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం కావడం ఆందోళనకు గురిచేస్తోంది.



Click it and Unblock the Notifications