For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Duvvada Station: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు-ఫుట్‌పాత్‌ మధ్య ఇరుక్కున్న విద్యార్థిని

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతూ ఓ యువతి ప్లాట్‌ఫారం, రైలు మధ్య ఇరుక్కు పోయింది.

|

Duvvada Station: రైల్వే స్టేషన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒక ప్లాట్‌ఫారం నుండి మరో ప్లాట్‌ఫారం పైకి వెళ్లేందుకు ట్రాక్‌లపై నుండి కాకుండా ఫుట్‌ బోర్డులు వాడాలని రైల్వే అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. ట్రాకులు దాటొద్దని, రైళ్లు వస్తున్నప్పుడు ట్రాక్‌కు దూరంగా ఉండాలని మైక్‌ల నుండి చెబుతూనే ఉంటారు. ఎంత చెప్పినప్పటికీ కొందరు మాత్రం రైల్వే ట్రాకులు దాటుతూనే ఉంటారు. ఇలా ఇష్టారీతిగా దాటుతున్న క్రమంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు అధికారులు చెబుతూనే ఉంటారు. అయినా చాలా మంది తీరులో ఎలాంటి మార్పు ఉండదు.

Student stuck in train and footpath in duvvada railway station railway police rescued

ఇలా రైల్వే ట్రాక్ దాటుతున్న క్రమంలోనే ఒళ్లు గగుర్పొడిచే ఓ సంఘటన జరిగింది. విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. రైలు దిగుతూ ఓ యువతి ప్లాట్‌ఫారం, రైలు మధ్య ఇరుక్కు పోయింది. విజ్ఞాన్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్న ఓ యువతి రాయఘడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఎక్కింది. రైలు దువ్వాడ స్టేషన్‌లో ఆగడంతో దిగేందుకు ప్రయత్నించింది. ఆ హడావిడిలో ఆ యువతి కాలు జారింది. దాంతో ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కుపోయింది.

యువతి ఇరుక్కుపోవడాన్ని గమనించి రైల్వే సిబ్బంది హుటాహుటినా అక్కడికి వెళ్లి ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. రైల్వే పోలీసులు నేర్పుగా ఆమెను రైలు, ప్లాట్‌ఫారం నుండి బయటకు తీశారు. తర్వాత ఆ విద్యార్థిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

English summary

Student stuck in train and footpath in duvvada railway station railway police rescued

read on to know Student stuck in train and footpath in duvvada railway station railway police rescued
Story first published:Wednesday, December 7, 2022, 16:47 [IST]
Desktop Bottom Promotion