For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google Top Searches 2020 : ఈ ఏడాది ఇండియన్స్ ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేశారో తెలుసా...

2020లో గూగుల్ ఎక్కువ మంది సెర్చ్ చేసింది వీటి గురించే...

|

హమ్మయ్యా.. 2020 సంవత్సరానికి ఎట్టకేలకు మనం మరికొన్ని రోజుల్లో ముగింపు పలకబోతున్నాం. కరోనా నామ సంవత్సరంగా ప్రతి ఒక్కరికీ ఈ ఏడాది బాగా గుర్తుండిపోతుంది. ప్రతి సంవత్సరం చాలా మందికి కొన్ని మధురమైన జ్ణాపకాలు అనేవి మిగులుతుంటాయి.

Google Year In Search 2020: Indias top searched personalities, news events, movies & more

కానీ కరోనా కారణంగా ఈ ఏడాది చాలా మందికి చేదు ఫలితాలే ఎదురయ్యాయి. అయితే కొందరు మాత్రం కరోనా కారణంగా లాభపడ్డారు. ముఖ్యంగా ఫార్మా, ఐటీ ఉద్యోగులతో పాటు మరికొందరు ఈ సంవత్సరంలో బాగా లాభపడ్డారు. మరోవైపు కరోనా కారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మార్పులొచ్చాయి. చాలా మంది ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

Google Year In Search 2020: Indias top searched personalities, news events, movies & more

మరికొంతమంది ఉద్యోగులు ఇంటి నుండే పని చేసేందుకు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో 2020లో మన భారతీయులు గూగుల్ లో ఎక్కువగా ఏమి వెతికారనే దాని గురించి ఓ జాబితాను సిద్ధం చేసింది. గూగుల్ తయారు చేసిన జాబితాలో సెలబ్రెటీలు, వెబ్ సీరిస్, సినిమాలు, స్పోర్ట్స్, పాలిటిక్స్ తదితర వాటి గురించి మన భారతీయులు ఎక్కువగా అన్వేషించారు.

Google Year In Search 2020: Indias top searched personalities, news events, movies & more

మొత్తం మీద ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) కరోనా వైరస్ మహమ్మారిని వెనక్కి నెట్టేసి తొలి స్థానంలో నిలిచింది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురించి తెలుసుకోవడానికి కూడా భారతీయులు ఎంతో ఉత్సాహాన్ని చూపినట్లు గూగుల్ తెలిపింది. ఇంకోవైపు ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇలా భారతదేశంలోని ప్రజలు గూగుల్ ఎక్కువగా వేటి గురించి శోధించారు.. ఏయే అంశాలు హైలెట్ అయ్యాయో ఒకసారి చూసేద్దాం రండి...

టాప్ లేపిన IPL

టాప్ లేపిన IPL

2020 సంవత్సరంలో ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ లో భారతీయులలో ఎక్కువ మంది Indian Premiur League(IPL) గురించి సెర్చ్ చేశారు. దీని తర్వాత కరోనా వైరస్, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల గురించి వెతికారు. వీటితో పాటు పిఎం కిసాన్ పథకం, బీహార్ ఎన్నికల ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి.

జో బైడెన్ తో పాటు..

జో బైడెన్ తో పాటు..

గూగుల్ సెర్చ్ లో 2020లో అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ టాప్ ప్లేసులో నిలిచారు. ఈ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి కూడా భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపారు. ఇతని తర్వాత జర్నలిస్టు అర్నబ్ గోస్వామి గురించి వెతికారు. వీరిద్దరి తర్వాత కరోనా వైరస్ పాజిటివ్ కారణంగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా మూడో స్థానంలో నిలిచింది. కిమ్ జోంగ్ ఉన్, అమితాబ్ బచ్చన్, ఆప్ఘనిస్థాన్ బౌలర్ రశీద్ ఖాన్ గురించి కూడా ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువగా వెతికారు. వీరందరితో పాటు రియా చక్రవర్తి, కమలా హారిస్, అంకితా లోఖండే, కంగనా రనౌత్ పేర్లు కూడా ప్రముఖంగా ఉన్నాయి.

సినిమాల విషయానికొస్తే..

సినిమాల విషయానికొస్తే..

2020 సంవత్సరంలో సినిమాల విషయానికొస్తే.. స్వర్గీయ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా'పై ఎక్కువ ప్రేమ చూపారు ప్రేక్షకులు. ఈ సినిమా గురించి గూగుల్ లో ఎక్కువగా అన్వేషించారు. దీని తర్వాత తమిళ బయోపిక్ డ్రామా స్టోరీ సినిమా ‘ఆకాశమే నీ హద్దురా' నిలిచింది. టాప్-5లో అజయ్ దేవ్ గన్ నటించిన చిత్రం తానాజీ, విద్యాబాలన్ నటించిన శకుంతల దేవి, జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా ఉన్నాయి. వీటి తర్వాతి స్థానాల్లో లక్ష్మీ, సడక్-2, గులాబో సీతాబో, ఎక్స్ ట్రాక్షన్ కూడా ఉన్నాయి.

వెబ్ సీరిస్ విషయానికొస్తే..

వెబ్ సీరిస్ విషయానికొస్తే..

2020 ఏడాదిలో నెట్ ఫ్లిక్స్ ‘మనీ హీస్ట్' అనే వెబ్ సీరిస్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది గూగుల్ లో టాప్ వెబ్ సీరిస్ గా నిలిచింది. దీని తర్వాత ‘స్కామ్ 1992 : ది హర్షద్ మెహతా స్టోరీ', ‘బిగ్ బాస్-14' వరుసగా రెండు మరియు మూడు స్థానాల్లో నిలిచాయి. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘మీర్జాపూర్'రెండో సీజన్ కోసం కూడా ప్రజలు ఎక్కువగానే అన్వేషించారు. వీటితో పాటు పాటల్ లోక్, సెక్స్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఆప్స్ వంటి సీరిస్ లను కూడా ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడ్డారు.

వార్తల విషయానికొస్తే..

వార్తల విషయానికొస్తే..

ఈ సంవత్సరం ప్రధాన వార్తల విషయానికొస్తే.. మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వార్తల గురించి ఎక్కువగా అన్వేషించారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అదనంగా కరోనా వైరస్, నిర్భయ కేసుకు సంబంధించిన వార్తలు టాప్ ప్లేసులో నిలిచాయి. బీరుట్లో పేలుళ్లు మరియు లాక్ డౌన్ కు సంబంధించిన ముఖ్యాంశాలు కూడా భారతీయులను ఎక్కువగా ఆకర్షించాయి.

English summary

Google Year In Search 2020: India's top searched personalities, news events, movies & more

Google Year In Search 2020: India's top searched personalities, news events, movies & more. Take a look.
Story first published:Thursday, December 10, 2020, 16:08 [IST]
Desktop Bottom Promotion