Latest Updates
-
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా?
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.!
నేపాల్ వరదల బీభత్సం ఘటనలు ఆ దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్నాయి. నేపాల్‌లో ఎక్కడ చూసినా వరద విధ్వంసక దృశ్యాలు, భవనాలు పేకమేడల్లా కూలిపోవడం, వందల కొద్దీ చావులు, ప్రాణభయంతో పరిగెడుతున్న ప్రజలు.. ఇలా ఒక్కటేమిటీ క్షణాల్లో జీవితాలు తలకిందులుగా మారాయి. ఇదిలా ఉండగా.. శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా ఆ దేశంలో ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.

నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన వరదల వల్ల వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధితులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి విలవిల్లాడుతున్నారు. ఇళ్లు, ఆస్తులు కొట్టుకుపోయినా ప్రాణం ఉంటే చాలనుకుని ఆరాటపడుతున్న జనాల మధ్య.. ఒక సంఘటన కలవరానికి గురిచేస్తోంది. వినాశకరమైన వరదల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
మృతదేహం నుంచి బంగారం దొంగిలింత
చిత్వాన్‌లో బలమైన నీటి ప్రవాహ నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన మృతదేహం నుంచి ఇద్దరు యువకులు బంగారు ఆభరణాలు దొంగిలించిన వీడియో వైరల్ అవుతోంది. మృతదేహం చెవులకు ఉన్న బంగారు కమ్మలను వారు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అమానవీయ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి అమానుష ఘటనకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వీడియో చిత్వాన్ జిల్లా పోలీసుల దృష్టికి చేరడంతో వెంటనే వారు రంగంలోకి దిగారు. ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మదన్ గురుంగ్(25), ఉమేష్ చౌదరి(38)గా పోలీసులు గుర్తించారు. నేపాల్- టిబెట్ సరిహద్దు భోటెకోశి వరదల తర్వాత నారాయణి, త్రిశూలి నదుల ఒడ్డున లభ్యమైన మృతదేహాలను గుర్తించి, వాటి మూలాలను కనుగొనే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు వివరించారు.
వరదలకి కారణం
హిమాలయాల్లోని లాంగ్టాంగ్ నేషనల్ పార్క్ సమీపంలో భారీ గ్లేసియర్ ఒక్కసారిగా విరిగిపడటంతో ఈ ప్రళయం సంభవించింది. దీని తీవ్రత వల్ల భూకంపం వచ్చినట్లుగా రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో ప్రకంపనలు నమోదై భయాందోళనకి దారితీశాయి. హిమానీనదం(గ్లేసియర్) విస్ఫోటనం చెందడం వల్ల నేపాల్‌లో ఘోర ఆకస్మిక వరదలు పెను విధ్వంసాన్ని సృష్టించడంతో పాటు దాదాపు 600కి పైగా మరణాలకి దారితీసింది. వరదల్లో సుమారు 2,400 మందికి పైగా గల్లంతయ్యారు. బాధితుల్లో వందలాది మంది విదేశీ పర్యాటకులు, యాత్రికులు ఉండటంతో సంబంధీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మంచు కొండ ఒక్కసారిగా కరిగి కిందపడటంతో భోటేకోశి, త్రిశూలి నదుల్లో నీటిమట్టం కేవలం 30 నిమిషాల్లోనే ఏకంగా 20 నుంచి 30 అడుగుల మేర పెరిగి దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. రసువా, నువాకోట్, ధాడింగ్, గోర్ఖా, మరియు చిత్వాన్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అనేక హైడ్రో పవర్ ప్రాజెక్టులు, వంతెనలు, రోడ్లు, ఇళ్లు బురదలో కూరుకుపోయినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications
