Latest Updates
-
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్!
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య!
గుట్టుగా ఇంట్లో జరగాల్సిన కాపురాలు ప్రస్తుతం వీధికెక్కి సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. నీక మరొకరిలో ఎఫైర్ ఉంది అంటే..నువ్వు నన్ను సుఖపెట్టడం లేదు అందుకే ఇంకొకరిని చూసుకున్నా అంటూ బరితెగింపు వ్యవహారాలు వంటి ఘటనల వీడియోలు నిత్యం అనేకం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ ఊహించని హైడ్రామా ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. భార్యాభర్తల బంధానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఓ మహిళ బాగోతం నడివీధిలో బట్టబయలు కావడంతో..ఈ ఉదంతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

రెండు నెలల క్రితం దారుణమైన అవమానం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఘజియాబాద్ లో నివసించే ఓ జంటకి మధ్య రెండు నెలల క్రితం పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో భార్య తన భర్తను అత్యంత దారుణమైన మాటలతో అవమానించింది. నీకు టీబీ వ్యాధి ఉంది.. అసలు మంచం మీద నువ్వు పనికిరావు.. అడిగితే నీకు లేవదు.. నువ్వు నన్ను ఏమాత్రం సుఖపెట్టలేవు చేయలేవు అంటూ ఓ మగాడికి అత్యంత అవమానకరమైన రీతిలో నిందలు వేసింది. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్న భర్తకు తోడుగా ఉండాల్సింది పోయి, ఇలాంటి నీచమైన మాటలు అని కట్టుకున్నోడిని వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయింది.

స్పా సెంటర్ దగ్గర గుట్టు రట్టు..
భార్య ప్రవర్తన, ఆమె ఇల్లు వదిలి వెళ్లిన తీరుపై భర్తకు మొదటి నుంచి తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. భర్తకు రోగం ఉందన్న సాకుతో ఆమె వేరే దారిన వెళ్తోందని గ్రహించిన అతడు, ఆమె కదలికలపై కన్నేశాడు. ఈ క్రమంలోనే ఘజియాబాద్ లోని ఓ స్పా సెంటర్ నుంచి తన భార్య బయటకు రావడం భర్త కంటపడింది.
ఎప్పటి నుంచో ఆమె బాగోతాన్ని ఆధారాలతో సహా పట్టుకోవాలనుకున్న భర్తకు ఆమె రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇంకేముంది, నేరుగా వెళ్లి ఆమెను నడిరోడ్డుపై పట్టుకుని నిలదీశాడు. స్పా ముసుగులో తన భార్య లోపల పరాయి మగాళ్లతో కలుకుతుందంటూ నడిరోడ్డుపై ఆమెను నిలదీశాడు. నా బిడ్డను నీలాంటి దాని దగ్గర పెరగనివ్వను నా కూతరుని నాతో పంపు అంటూ భార్యను నిలదీశాడు.
నడిరోడ్డుపై రచ్చ రచ్చ.. ఏమాత్రం తగ్గని భార్య..
కానీ ఆ భార్య మాత్రం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే భర్తపై రివర్స్ ఎటాక్ కు దిగింది. నా చెయ్యి వదులు.. నేను నీతో ఉండను.. నన్ను వదిలెయ్ అంటూ భర్తపైనే అరుస్తూ నానా రచ్చ చేసింది. అక్కడున్న స్థానికులు సైతం ఈ హైడ్రామా చూసి అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడున్న వారు రికార్డ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
నెట్టింట భగ్గుమంటున్న నెటిజన్లు..
ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు ఆ మహిళపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న భర్తను వదిలేయడమే కాకుండా, పౌరుషాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన ఆమె.. ఇప్పుడు స్పా సెంటర్ల చుట్టూ ఎందుకు తిరుగుతోందని ప్రశ్నిస్తున్నారు. భర్త సుఖపెట్టలేడని వదిలేసి, స్పా సెంటర్లలో ఈమె ఆశించే సుఖం ఏంటి? అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆధునిక సమాజంలో కొన్ని సంబంధాలు ఎంత దారుణంగా తయారవుతున్నాయో చెప్పడానికి ఈ ఘజియాబాద్ ఉదంతం ఓ ఉదాహరణ అని పలువురు కామెంట్లు పెడుతున్నారు.



Click it and Unblock the Notifications
