బంగారం ధర పెరుగుదల ఆర్థిక వ్యవస్థకు రెడ్ అలర్ట్.. కొనుగోలుదారులకు కీలక సూచన చేస్తున్న సుజిత్ బంగర్

By Borra Hazarathaiah

గత సంవత్సరం సెంట్రల్ బ్యాంకులు 316,000 కిలోలకు పైగా బంగారం కొనుగోలు చేయడం చారిత్రాత్మకంగా రికార్డు సెట్ చేసింది. దీన్ని కొంతమంది పెట్టుబడిదారులు లాభంగా చూడవచ్చు. అయితే Taxbuddy.com వ్యవస్థాపకుడు సుజిత్ బంగర్ దీనిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెడ్ అలర్ట్ గా గుర్తించారు. ఆయన లింక్డ్ఇన్‌లో వ్రాసిన పోస్టులో.. Gold ధరల 63 శాతం పెరుగుదల ర్యాలీగా కాదు, హెచ్చరికగా భావించాల్సిందని సూచించారు.

2008 ఆర్థిక పతనం, COVID-19 వంటి సంక్షోభాల సందర్భాల్లో కనిపించిన బంగారం నిల్వ వేగానికి ఇది సమానం అని ఆయన వివరించారు. సాంప్రదాయకంగా ఆర్థిక అస్థిరత సమయంలో పెట్టుబడిదారులు US డాలర్, ట్రెజరీ బాండ్ల వైపు మొగ్గు చూపుతారు. అయితే బంగర్ వాదన ప్రకారం బంగారం పెరుగుదల భయం కారణంగా జరిగిందని తెలిపారు. ఇకపై డాలర్ భద్రత కాదు. ఇప్పుడు Gold భద్రతా బలంగా మారింది.50 సంవత్సరాల్లో US డాలర్ ఆరు నెలలలో అత్యంత తీవ్రమైన పతనం, ఫియట్ కరెన్సీలపై పెరుగుతున్న భయాలు ఈ మార్పుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ట్రెండ్‌ను The Debasement Trade అని బంగర్ పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న ఆస్తుల నుంచి కౌంటర్పార్టీ రిస్క్ లేని వస్తువులకు మార్పుగా చెప్పవచ్చు.


Gold price rally retail investor risk gold investment warning gold market red flags gold advisory India precious metals investment gold price volatility gold buying caution market expert gold warning investment risk in gold gold price surge alert safe gold investment tips gold market analysis gold trends India gold buying tips

కేంద్ర బ్యాంకులు గత 20 ఏళ్లలో నికర అమ్మకందారులుగా ఉన్నప్పటికీ, ఇప్పుడు అత్యంత పెద్ద కొనుగోలుదారులుగా మారాయి. చైనా, భారతదేశం, రష్యా వంటి దేశాలు తమ బంగారం నిల్వలను పెంచుతున్నాయి. BRICS దేశాల కూటమిలో ఇది కేవలం హెడ్జ్ కాదు, వ్యూహం అని బంగర్ వాదిస్తున్నారు.2022లో పాశ్చాత్య శక్తులు రష్యా కేంద్ర బ్యాంకు ఆస్తులను స్తంభింపజేశాయి. ఇది దేశాలకు డాలర్ నిల్వలను ఆర్థిక ఆయుధంగా ఉపయోగించడానికి అని ఆయన గుర్తు చేశారు.

బంగారం ధర కుప్పకూలింది.. రేట్లు ఇంకా పతనమవుతాయంటున్న నిపుణులు.. అక్టోబర్ 23, గురువారం ధరలు ఇవే..

డేటా ప్రకారం చూసుకున్నట్లయితే.. గత సంవత్సరం బంగారం వాటా భారతదేశంలో 9.6 శాతం నుండి 13.1 శాతానికి పెరిగింది. రష్యాలో 29.5 శాతం నుండి 35.8 శాతానికి పెరిగింది. వెండి, ప్లాటినం కూడా పారిశ్రామిక, గ్రీన్-టెక్ డిమాండ్ కారణంగా ఆసక్తిని చూపుతున్నప్పటికీ, వీటిని బంగారం కంటే తక్కువ అనిశ్చితి వలన ఓటు అని బంగర్ పేర్కొన్నారు.రాజకీయ ఒత్తిడి ముఖ్యంగా రేటు కోతలు, ట్రంప్ దాడుల కారణంగా పునరుద్ధరించిన సుంకాల కారణంగా బంగారం మరింత మద్దతు పొందుతుందని అన్నారు. కరెన్సీలకు నమ్మకం తిరిగి వచ్చే వరకు బంగారం ప్రకాశవంతంగానే మెరుస్తూ ఉంటుందన్నారు.

క్లుప్తంగా ఆయన ఏం చెప్పారంటే.. బంగారం ర్యాలీ కేవలం లాభం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భయ, అస్థిరత, మరియు భవిష్యత్తుపై హెచ్చరిక. పెట్టుబడిదారులు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, బంగారం కొనుగోలు ఒక రక్షణ వ్యూహంగా మాత్రమేనని భావించాలంటున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

Credit: Goodreturns

Desktop Bottom Promotion