గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!

సెప్టెంబర్‌ 14 భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేశ్‌ చతుర్థి సందర్భంగా ఏకదంతుడు, లంబోదరుడు, విఘ్నాలు బాపే విఘ్నేశ్వరుడు ప్రత్యేకంగా అలకరించిన మండపాల్లో, ఆలయాల్లో, ఇళ్లలో కొలువు దీరి తొమ్మిది రోజుల పాటు పూజలందుకోనున్నాడు. మరి ఈ సందర్భంగా గణనాథుడి కరుణ, కటాక్షాలు మీతో పాటు మీ శ్రేయోభిలాషులపైనా ఉండాలని కోరుకుంటూ మీ ప్రియమైన వారికి సోషల్‌ మీడియా లేదా ప్రత్యక్షంగా ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. అందుకు సంబంధించిన విషెస్‌, వాట్సప్‌ సందేశాలు ఇక్కడ అందిస్తున్నాం..

Ganesh chaturthi 2026 wishes for whatsapp quotes messages and status

గణేశ్‌ చతుర్థి శుభాకాంక్షలు

"వినాయక చవితి 2026 పండుగ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.! మీ జీవితంలో విఘ్నాలు తొలగి, విజయాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు చేకూరాలని కోరుకుంటున్నాం.!"

"మీ జీవితంలోని సకల విఘ్నాలను తొలగించి, సమస్త శుభాలు, సంతోషాలను ప్రసాదించే విఘ్నేశ్వర్వుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... గణేశ్‌ చతుర్థి శుభాకాంక్షలు!"

ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.!ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.!

"గణనాథుడి ఆశీస్సులతో మీ ఇంట ఆనందం, ఐశ్వర్యం, విజయాలు వెల్లివిరియాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు!"

"లంబోదరుడి కరుణతో మీ జీవితం, మీ ఇల్లు సంతోషం, ప్రశాంతతతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణపతి బప్పా మోరియా.!"

"హ్యాపీ గణేశ్‌ చతుర్థి.. ఈ ఏడాది ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులను, సరికొత్త విజయాలను తీసుకురావాలని ఆశిస్తున్నాం.!"

Ganesh chaturthi 2026 wishes for whatsapp quotes messages and status

వాట్సాప్ స్టేటస్, కోట్స్

"సిద్ధి, బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు మీ జీవితంలోని కష్టాలన్నింటినీ దూరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు."

మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్‌ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.!మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్‌ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.!

“మీ ప్రతి ప్రయత్నం లంబోదరుని ఆశీస్సులతో విజయవంతం కావాలని కోరుకుంటూ గణపతి బప్పా మోరియా.”

"లంబోదరుడి ఆశీస్సులతో మీ జీవితం మోదకం లాగా మధురంగా ఉండాలని, ఎలుక వాహనం లాగా సరళంగా సాగిపోవాలని కోరుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి.!"

“మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగి వేగంగా సాగేలా విఘ్నహర్త ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి తోడుండాలని ఆశిస్తూ.. వినాయక చవితి శుభాకాంక్షలు.!”

పూజా శ్లోకం

గణేశుడి పండుగ రోజున మెసేజ్‌లు, కోట్స్‌, స్టేటస్‌లతోనే కాదు మీ ఆత్మీయులకు ఈ ప్రసిద్ధ శ్లోకంతో కూడా శుభాకాంక్షలు తెలియజేసి వారిపై మీ అనురాగం, స్నేహభావాన్ని వ్యక్తపరచండి.

"వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ!

నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా!"

భావం: విఘ్నాలను తొలగించే ఓ గణనాథా, నా పనులన్నీ ఎల్లప్పుడూ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేలా అనుగ్రహించు. అని ప్రార్థిస్తూ ఈ శ్లోకం మెసేజ్‌ లేదా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్!

అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే!"

భావం: భక్తుల కోర్కెలు తీర్చే ఆ ఏకదంతుడిని, గజాననుడిని మనసారా స్మరించుకుందాం.. వినాయక చవితి శుభాకాంక్షలు!

Story first published: Sunday, September 13, 2026, 17:06 [IST]
Desktop Bottom Promotion