Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
అశోక్ గజపతి రాజు కుటుంబం రూ వెయ్యి కోట్ల విలువైన భూమి దానం..!!
పూజపాటి రాజవంశీయులు మరో భారీ విరాళం ప్రకటించారు. విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబానికి వారి పూర్వీకుల నుంచి రాజ కుటుంబంగా గుర్తింపు ఉంది. ఇప్పటికే విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల కోసం రూ.వేల కోట్ల ఆస్తులను వదులుకున్నారు. ఇప్పుడు సుమారు రూ.1000 కోట్లు విలువైన భూమిని విరాళం ఇచ్చేందుకు అశోక్ గజపతి రాజు కుటుంబం ముందుకు వచ్చింది. విశాఖలో ఖరీదైన భీమిలి వద్ద ఉన్న భూమిని విరాళం గా ప్రకటించారు.
గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కుటుంబం రూ వెయ్యి కోట్ల విలువైన భూమిని దానం చేసేందు కు ముందుకు వచ్చింది. ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం విశాఖపట్నం జిల్లా భీమిలిమండలం అన్నవరం వద్ద మాన్సాస్ ట్రస్టుకు చెందిన 136.63 ఎకరాలను ఏవియేషన్ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. పౌరవిమానయాన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రపంచంలో పౌరవిమానయానానికి సంబంధించిన యూనివర్సిటీ బ్రాంచ్‌లను ఒకచోటకు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. భోగాపురం ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రభుత్వ భూముల్లో కానీ.. రైతుల నుంచి సేకరించిన భూముల్లో కానీ ఏవియేషన్ ప్రాజెక్టు నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన గా ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం చేపడుతున్న జీఎంఆర్ సంస్థ ఇందుకు ముందుకొచ్చింది.
జగన్ కేసుల విచారణ మళ్లీ మొదటికే, తాజా నిర్ణయంతో ఇక..!!

కాగా, ఈ ప్రాజెక్టు కోసం మాన్సాస్ ట్రస్ట్ తరఫున రూ.1000 కోట్ల విలువైన 136.63 ఎకరాల భూమిని ఇచ్చేందుకు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టుకు తమ రాజవంశీయుడైన అలక్ మహారాజా గజపతి పేరు పెట్టాలని కోరారు. అయితే... అప్పట్లోనే పూసపాటి రాజవంశీయులకు రెండు సొంత విమానాలు ఉండేవి. అశోక్ గజపతిరాజు సైతం పైలట్ కావాలనుకున్నారు కానీ అది సాకారం కాలేదు. పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆయన హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీలో వీరి కుటుంబానికి భాగస్వామ్యం దక్కింది. ఇటీవల విశాఖలో ఒప్పందం జరగగా.. ఏవియేషన్ ఎడ్యుసిటీకి 136.63 ఎకరాలు భూములు కేటాయించేలా దేవదాయశాఖ అనుమతులిచ్చేందుకు సమ్మతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో మాన్సాస్ తరఫున ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు భూములు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు వెల్లడించారు.
Credit: Oneindia



Click it and Unblock the Notifications











