Latest Updates
-
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య!
దిశ మార్చుకున్నతుఫాన్, ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం.. ప్రచండ గాలులు, ప్రధాని భరోసా..!!
మోంథా తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. ఏపీని వణికిస్తున్న తుఫాను పై ప్రభుత్వం అప్రతమత్తం అయింది. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసారు. తుఫాను ముందస్తు చర్యల పైన ఆరా తీసారు. ఎలాంటి సాయం కోసమైనా కేంద్రం సిద్దంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే, దిశ మారటంతో రాష్ట్రంలో మూడు జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు.. అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసారు.
మోంథా తుఫాను దిశ మారింది. ముందుగా అంచనా వేసినట్లుగా కాకినాడ యానాం మధ్య కాకుండా...రేపు కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కూడా 60 కిలోమీటర్ల వేగం తోనే గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కొత్తగా 4 జిల్లాలు- నియోజకవర్గాల్లో మార్పులు..!!

అటు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు తో తుఫాను సన్నద్దత పైన చర్చించారు. కేంద్రం పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో ఉన్న మొంథా తుఫాన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 16 కి.మీ వేగంతో తుఫాను తీరాన్ని సమీపిస్తోంది. ఈరోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
కాగా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసారు. రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు .. ప్రతీ గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేసారు. తుఫాను తీరం దాటే సమయానికి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
"మొంథా" తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావం దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేశారు. ప్రభుత్వం సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు విడుదల చేసింది. ఎస్డీఆర్‌ఎఫ్, ఏపీఎస్‌డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుపాను షెల్టర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచిస్తోంది.
Credit: Oneindia



Click it and Unblock the Notifications
