Latest Updates
-
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా..
రూ.4 వేల పెన్షన్ పెంపు ముహూర్తం ఖరారు, ముందుగా వీరికే..!?
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్దమైంది. ఇందు కోసం పూర్తి వివారాలను సేక రిస్తోంది. ఆర్దిక వనరుల సమీకరణ పై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ హామీ అమలుకు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తాం.. తానే సీఎం అని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా హామీల అమలు వేగవంతం చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మరో ఎన్నికల హామీ అమలు పైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చి రేవంత్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో, పెండింగ్ హామీల అమలు పైన ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం తరువాత సీఎం రేవంత్ మరింత దూకుడుగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా మరింత బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. 2018 డిసెంబరు 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్నిఅమల్లోకి తెచ్చారు. ఈ పథకం విజయవంతంగా నడుస్తుంది. రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు కూడా అమలు చేసింది. రైతులకు రెండు లక్షల వరకూ రైతు రుణ మాఫీ అమలు చేసింది.

కాగా, మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ పథకం కొనసాగుతోంది. ఇక.. వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు నెలకు రెండు వేల పథకం ఇంకా అమలు కాలేదు. వరి రైతులకు ఐదు వందల బోనస్ ను అందచేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. యువ వికాసం పథకం కింద ఐదు లక్షల విద్యాభరోసా కార్డు ను కూడా అమలు చేస్తున్నారు. వృద్ధులు, వితంతవుల పింఛను ను పెంపుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందు కోసం లెక్కలు సిద్దం చేసారు. ఈ హామీ అమలు చేయటం ద్వారా ఖజానాపై ఎంత భారం పడుతుంది? నెలకు ఎంత ఖర్చవుతుందన్న వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సేకరించినట్లు సమాచారం.
పొన్నం, సురేఖ మంత్రి పదవులపై తేల్చేసిన పార్టీ- కేబినెట్ లోకి కొత్తగా..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధులు, వితంతవులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తుండటంతో ఇక్కడ కూడా పింఛను మొత్తాన్ని పెంచాలని ఆలోచన ప్రభుత్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా లెక్కల మేరకు తెలంగాణలో వృద్ధులు 12,30,000, దివ్యాంగులు ఐదు లక్షలు, వితంతువులు దాదాపు ఇరవై లక్షలు, నేత కార్మికులు 36,872, కల్లు గీత కార్మికులు 62,164, బీడి కార్మికులు 4,07,374, ఒంటరి మహిళలు 1,33,936, హెచ్ఐవీ రోగులు 32,718, కళాకారులు ముప్ఫయి వేల మందికి పైగానే ఉన్నారు. వీరిందరికీ పింఛను మొత్తాన్ని పెంచాల్సి ఉంది. అంటే దాదాపు నలభై లక్షల మందికి పైగా పింఛను మొత్తాన్ని పెంచాల్సి ఉంది. ప్రస్తుతం వీరికి 2,116 పింఛను ఇస్తున్నారు. దీంతో.. ఆర్దికంగా సమస్యలు.. ఈ పథకం కోసం నిధుల సమీకరణ పైన కసరత్తు జరుగుతోంది. త్వరలోనే పథకం అమలు పైన అధికారికంగా ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది.
Credit: Oneindia



Click it and Unblock the Notifications
