For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉబ్బసం అరికట్టే చేప ఆహారం!

By B N Sharma
|

Eating Fish Can Halve Wheezing In Kids!
లండన్: తొమ్మిది నెలలలోపు పిల్లకు చేప ఆహారం తినిపిస్తే, భవిష్యత్తులో వారికి ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 50 శాతం వుండదని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం తెలియజేస్తోంది. ఈ రీసెర్చిని స్వీడన్ లోని గోధెన్ బర్గ్ యూనివర్శిటీ రీసెర్చర్లు నిర్వహించారు. తొమ్మిది నెలలలోపుగా చేప ఆహారం తిన్న పిల్లలు తినని వారితో పోలిస్తే తక్కువ శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారట.

చిన్న పిల్లలలో వీజింగ్ అనేది సాధారణ సమస్య వారు చేస్తున్న ఈ పరిశోధన వ్యాధికి కారణమైన రిస్కు ఫ్యాక్టర్లను కనుగొంటుందని అధ్యయనకారుడు డా. ఎమ్మా గోక్సర్ తెలిపినట్లు డైలీ మెయిల్ పత్రిక తెలిపింది. ఈ స్టడీ కొరకు వారు సుమారు 4,171 కుటుంబాలను ఎంచుకొన్నారు. ఆరు నెలల వయసునుండి నాలుగున్నర సంవత్సరాలవరకు పిల్లల ఆహారాలను పరిశీలించారు.

తొమ్మిది నెలలలోపు చేప ఆహారం ఇచ్చిన పిల్లలలో 50 శాతం మందికి ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు లేవని తేల్చారు. చేపలో ప్రొటీన్లు, విటమిన్లు మాత్రమేకాక గుండెకు ప్రయోజనం చేకూర్చే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా వుంటాయని, పెద్దలు వారానికి కనీసం రెండు సార్లు చేప ఆహారం తినాలని కూడా రీసెర్చర్లు సిఫార్సు చేశారు.

English summary

Eating Fish Can Halve Wheezing In Kids! | ఉబ్బసం అరికట్టే చేప ఆహారం!

Fish is a good source of protein, vitamins and rich in omega 3 fatty acids that can benefit the heart, Currently, adults are recommended to include at least two portions of fish in their diet a weak.
Story first published:Friday, November 25, 2011, 17:03 [IST]
Desktop Bottom Promotion