For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరం ఎదుగుదలకు తగినంత ఐరన్!

By B N Sharma
|

Mother
పసిబిడ్డల ఎదుగుదలకు ఐరన్ చాలా అవసరం. ఇది మొత్తం శరీరానికి ఆక్సిజన్ ను అందిస్తుంది. ఐరన్ లోపం కారణంగా పిల్లల్లో రక్తహీనత ఏర్పడవచ్చు. ఎదిగే వయసుకు అనుగుణంగా పిల్లల శరీరానికి ఐరన్ కావలసి ఉంటుంది. కానీ ఈ అవసరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసును బట్టి మారుతూ వుంటుంది. ఉదాహరణకు పిల్లలకు 6 నెలల నుండి 7 సంవత్సరాల వయసు బాగా ఎదుగుదల చూపుతుంది.

ఈ వయసులో వారికి ఐరన్ అవసరం ఎక్కువగా వుంటుంది. ఆరోగ్యంగా ఉన్న ఒక తల్లికి అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన బిడ్డకు తల్లిపాల ద్వారా ఐరన్ లభిస్తుంది. తల్లి పాలల్లోనే 4 నుండి 6 నెలల వరకు బిడ్డకు కావల్సినంత ఐరన్ లభిస్తుంది. 7 నుండి 12 నెలల వయసున్న శిశువుకు ప్రతి రోజూ 7 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరం ఉంటుంది. అదేవిధంగా 1 నుండి 3 సంవత్సరాల వయసు ఉన్న శిశువుకు ప్రతిరోజూ 11 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరం ఉంటుంది.

ఈ రకంగా వయసు పెరుగుతున్న కొలది శరీరానికి ఐరన్ పరిమాణం అధికంగా వుండాలి. అపుడే శారీరక ఎదుగుదల సక్రమంగా వుంటుంది. ఘన ఆహారం ఇవ్వటం మొదలు పెడితే వీరు తినే ఆహార పదార్ధాలలోనే సహజంగా ఐరన్ వుండే పదార్ధాలు ఇవ్వాలి.

English summary

Iron Is Necessary for Baby's Growth! | శరీరం ఎదుగుదలకు తగినంత ఐరన్!

Every Child having 7 months to 12 months requires atleast 7 mg. of Iron for its growth. Children from 1 year age to 3 Years daily requirement of iron is 11 mg. Iron givens good growth to the baby's body. It helps in good circulation of the blood throughout the body.
Story first published:Thursday, November 17, 2011, 17:26 [IST]
Desktop Bottom Promotion