For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో స్మోకింగ్ వల్ల బేబీ కిడ్నీస్ కు డ్యామేజ్ కలుగుతుందా..?

మీరు గర్భవతి అయిన మహిళ అయితే ఆ సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. గర్భధారణ సమయంలో ధూమపానం కారణంగా కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి.

By Lekhaka
|

మీరు గర్భవతి అయిన మహిళ అయితే ఆ సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. గర్భధారణ సమయంలో ధూమపానం కారణంగా కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి.

గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించాలి. వారి ఆరోగ్య ప్రభావం నేరుగా గర్భంలోని శిశువు మీద పడుతుంది.

ధూమపానం కారణంగా శిశువు కిడ్నీ కి కలిగే నష్టం

గర్భధారణ సమయంలో పుట్టే శిశువు మీద ఆహారం,పానీయాలు,మందులు వాటి కారణంగా మంచి,చెడు రెండు ప్రభావాలు ఉంటాయి.

Can Smoking During Pregnancy Damage The Babys Kidneys?

ఉదాహరణకి, గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అప్పుడు ఆమె బిడ్డ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి.

అయితే,గర్భిణీ స్త్రీకి ధూమపానం లేదా మద్యపానం వంటి అనారోగ్య జీవన విధానాలు ఉంటే కనుక, అవి బిడ్డ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి. దీనికి సైన్స్ కూడా మద్దతు ఇస్తుంది.

కాబట్టి గర్భధారణ సమయంలో మీరు,మీ శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.

గర్భధారణ సమయంలో ధూమపానం శిశువు యొక్క మూత్రపిండాల మీద ప్రభావం చూపటం నిజమేనా? దీని గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

గర్భిణీ స్త్రీలు లేదా ఎవరి పైన అయినా ధూమపానం అనేది అధికమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

గర్భిణీలు స్మోక్ చేస్

సిగరెట్ పొగలో విషం ఉంటుంది. దీనిలో నికోటిన్ వంటి చాలా హానికరమైన పదార్ధాలు ఉంటాయి. ఈ పదార్ధాలు వ్యవస్థలో ఉండి శరీరానికి చాలా హానిని చేస్తాయి.

ధూమపానం కారణంగా పెదాలు నల్లబడటం,పసుపు రంగు పళ్ళు,చెడు శ్వాస,అజీర్ణం, వికారం, ఆకలి మందగించటం,అనారోగ్య రీతిలో బరువు తగ్గటం, విశ్రాంతి లేకపోవటం, శ్వాసకోశ వ్యాధి,సైనసిటిస్,నోరు,పెదవులు మరియు ఊపిరితిత్తులు,గొంతు క్యాన్సర్ వంటి దుష్ప్రభావాలు ఉంటాయి.

కాబట్టి ఈ ప్రతికూల చిక్కుల నుండి బయట పడాలంటే ధూమపానం వెంటనే మానేయాలి. ప్రత్యేకించి గర్భవతి అయిన మహిళ ధూమపానం మానేయాలి.

గర్భిణీలు స్మోక్ చేస్

ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో గర్భవతి అయిన మహిళలు దీర్ఘకాలిక ధూమపానం అలవాటు ఉంటే వారికీ పుట్టే పిల్లలకు చిన్న వయస్సులోనే మూత్రపిండ వ్యాధి అభివృద్ధి ఉన్నట్టు తెలిసింది.

గర్భధారణ సమయంలో ధూమపానం చేసిన మహిళలు ధూమపానం చేయని మహిళలతో పోల్చినప్పుడు మూత్రపిండ వ్యాధి అభివృద్ధి ధూమపానం చేసిన మహిళల్లో 16.7% ఎక్కువ తెలిసింది.

చివరగా, ఒక గర్భవతికి దీర్ఘకాలికంగా ధూమపానం అలవాటు ఉంటే ఆమె పిల్లలకు కిడ్నీ లోపాల అభివృద్ధి ప్రమాదం ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చు.

English summary

Can Smoking During Pregnancy Damage The Baby's Kidneys?

If you are a woman who is pregnant, then you would surely know that there are many precautions you must take during this phase. If you are wondering what are some of the negative effects of smoking during pregnancy, then you have come to the right place!Pregnant women have to take utmost care of their health, as their health directly impacts the baby in their womb.
Desktop Bottom Promotion