For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Toddlers Acne: చిన్నారుల్లో మొటిమలా? ఎందుకు వస్తాయంటే..

పసిపిల్లల్లో మొటిమలు రావడానికి పలు కారణాలు ఉండవచ్చు. పిల్లల్లో వచ్చే మొటిమలు ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని చర్మపు దద్దుర్లు మొటిమల్లాగా కనిపిస్తాయి.

|

Toddlers Acne: సాధారణంగా యుక్త వయస్సు వచ్చినప్పుడు ముఖంపై మొటిమలు వస్తుంటాయి. పింపుల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ మొటిమలు చిన్న పిల్లల్లో అలాగే పెద్ద వారిలో కనిపించడం చాలా అరుదు అయితే శిశువుల్లో మొటిమల్లాంటి చిన్న చిన్న చర్మపు గడ్డలను ప్రతి ఒక్కరూ గమనించే ఉంటారు.

toddler acne

పసిపిల్లల్లో మొటిమలు రావడానికి పలు కారణాలు ఉండవచ్చు. పిల్లల్లో వచ్చే మొటిమలు ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని చర్మపు దద్దుర్లు మొటిమల్లాగా కనిపిస్తాయి.

పసిపిల్లల మొటిమలు లక్షణాలు:
* ఎగుడుదిగుడు చర్మం
* చర్మం ఎరుపెక్కడం
* నోడ్యూల్స్
* గడ్డలు
* వైట్ హెడ్స్
* బ్లాక్ హెడ్స్
* మచ్చలు

పసిపిల్లలకు మొటిమలు ముఖం, నెత్తిమీద, వీపుపై రావొచ్చు. చాలా తరచుగా నోటి చుట్టూ మొటిమలు వస్తుంటాయి. గడ్డం, బుగ్గలు, నుదిటిపై ఎక్కువగా కనిపిస్తాయి.

పసిపిల్లల్లో మొటిమలు రావడానికి కారణాలు:

పసిపిల్లల్లో మొటిమలు రావడానికి కారణాలు:

నవజాత శిశువుల్లో, యుక్త వయస్సులో మొటిమలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. మొటిమలు సాధారణంగా హార్మోన్ల మార్పుల వల్ల వస్తాయి.

శిశువుల్లో మొటిమలు దాదాపు 6 వారాల వయస్సు తర్వాత మొదలవుతాయి. నవజాత శిశువుల కంటే తక్కువ మందిలో మాత్రమే మొటిమలు కనిపిస్తాయి. శిశువులకు సంవత్సరం వయస్సు వచ్చే సమయానికి మొటిమలు వెళ్లిపోతాయి.

12 నుండి 36 నెలల మధ్య పసిపిల్లల్లో మొటిమలు రావడం చాలా చాలా అరుదు.

హార్మోన్లు:

యుక్త వయస్సులో మొటిమలు రావడానికి హార్మోన్లు ఎంత కారణమో పసిపిల్లల్లో మొటిమలు రావడానికి కూడా హార్మోన్లు అంతే కారణం. పిల్లల్లో హార్మోన్ల పెరుగుదల వల్ల మొటిమలు రావొచ్చు. నవజాత శిశువుల్లో హార్మోన్ల వల్ల వచ్చే మొటిమలు కొన్ని రోజులు లేదా కొన్ని వారాల పాటు మాత్రమే ఉంటాయి. కొందరు పిల్లల్లో మొటిమలు సంవత్సరాల తరబడి కూడా ఉండొచ్చు. కానీ ఇది చాలా అరుదు. ఇలా మొటిమలు వస్తే మాత్రం వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే.

చర్మరంధ్రాలు మూసుకుపోవడం:

పసిపిల్లల సున్నితమైన చర్మం కూడా చికాకుకు గురవుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోవచ్చు. ఇది కొన్నిసార్లు వారి చర్మంలో సూక్షక్రిములను బంధించవచ్చు. అలా పసిపిల్లలకు మొటిమలు రావొచ్చు.

దుమ్ము, ధూళి చర్మంపై ఉండిపోయినప్పుడు అది మొటిమలకు దారి తీస్తుంది.

చర్మ రంధ్రాలు వీటి వల్ల మూసుకుపోవచ్చు

* చెమట పట్టడం

* మాయిశ్చరైజర్లు

* సన్‌స్క్రీన్

* ఎక్జెమా క్రీమ్

* ఫుడ్

ఫుడ్ అలెర్జీ:

ఫుడ్ అలెర్జీ:

ఫుడ్ అలెర్జీ వల్ల కూడా మొటిమలు, దద్దుర్లు రావొచ్చు. దీనిని గుర్తించడం చాలా సులభం. ఆ ఆహారం పిల్లలకు పెట్టకపోతే ఆ మొటిమలు తొలగిపోతాయి.

ఫుడ్ అలెర్జీ వల్ల దద్దుర్లు ముఖంపైనే కాకుండా శరీరంలో ఎక్కడైనా రావొచ్చు.

పసిపిల్లల్లో ఫుడ్ అలెర్జీని ఇలా కూడా గుర్తించవచ్చు

* దద్దుర్లు

* చర్మం ఎర్రబడటం

* నోటి దురద

* తుమ్ములు

* ముక్కు కారడం

* దగ్గు

* గొంతు దురద

* వికారం

* వాంతులు

* కడుపు నొప్పి

* కళ్ల చుట్టూ ఎర్రగా అవడం

* ముఖం వాయడం

పసిపిల్లల మొటిమలకు చికిత్స:

పసిపిల్లల మొటిమలకు చికిత్స:

చికిత్స మొటిమలు రావడానికి గల కారణం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల మొటిమలు వాటంతట అవే పోతాయి. మొదట అసలు మొటిమలు ఎందుకు వచ్చాయో గుర్తించడం ముఖ్యం.

వైద్యులు రక్త పరీక్షల ద్వారా మొటిమలు రావడానికి గల కారణాలు విశ్లేషిస్తారు. ఆపై తగిన చికిత్స సిఫార్సు చేస్తారు.

English summary

Do children also get acne? What is toddlers acne in Telugu

read on to know Do children also get acne? What is toddlers acne in Telugu
Story first published:Wednesday, December 14, 2022, 20:00 [IST]
Desktop Bottom Promotion