For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాన్ని అడ్డగించే అధిక బరువు!

By B N Sharma
|

 How To Conceive If You Are Fat?
అధిక బరువు మీ ఫలదీకరణను అడ్డగిస్తుంది గర్భవతి అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. లేదా కష్టమవుతాయి. అందుకనే గర్భం ధరించాలనుకునే ముందు మీ శరీర బరువు ఒకసారి పరీక్షించుకోండి. అధిక బరువున్నట్లయితే ముందుగా దానిని తగ్గించుకొని ఆరోగ్యకరమైన గర్భవతిగా ఆనందించండి. బురువున్న మహిళలు నిజానికి గర్భం ధరించటమంటే చాలా కష్టపడతారు. కనుక మీరు బాగా లావుగా వుండి గర్భం ధరించాలననుకుంటే దిగువ సూచనలు గమనించండి.

రక్త పరీక్షలు - ముందుగా రక్తపరీక్షలు చేయించి మీకు ధైరాయిడ్ వుందేమో తెలుసుకోండి. ధైరాయిడ్ సమస్య లేకుంటే గర్భం ధరించేముందు బరువు తేలికగా తగ్గించుకోవచ్చు. కొద్దిగా బరువు తగ్గినా సరే గర్భం రావటం తేలికే. బరువు తగ్గాలంటూ ఆహారాన్ని మానకండి. దానికి బదులుగా వ్యాయామం చేస్తూ ఆరోగ్యకర ఆహారాలు తినండి. ఇది ఫలదీకరణ అవకాశాలు పెంచుతుంది.

పిరియడ్ సక్రమంగా వుందా? అనేది పరిశీలించండి. పిరీయడ్ క్రమంగా వుండి బరువు తక్కువగా వుంటే, ఫలదీకరణ అవకాశాలు అధికంగా వుంటాయి. గర్భం వచ్చిన తర్వాత దాని నిర్వహణ కూడా తేలిక అవుతుంది.

భంగిమలు ఆచరించండి. - మహిళలు బరువుగా వుంటే గర్భం రావటం కష్టం. కారణం...అధికబరువు వలన వీర్యం యోనిలోనికి లోతుగా ప్రయాణించలేదు. కనుక మీరు స్కలన సమయంలో వీర్యం లోపలికంటా పడేలా వుండే భంగిమలు ఆచరించండి.

ఫలదీకరణ ఆహారాలు - ఫలదీకరణ బాగా జరిగేఆహారాలు తినండి. మీరు లావు వున్నప్పటికి ఆహారాలు సహకరిస్తాయి. ఫోలిక్ యాసిడ్ అధికంగా వుండే ఆహారాలు త్వరగా గర్భాన్ని కలిగిస్తాయి. సోయా ఉత్పత్తులు, తాజా కాయగూరలు, పాల ఉత్పత్తులు, దుంపలు, అరటి, బ్రక్కోలి మొదలైన సహజ ఆహారాలు అధికంగా తినండి.

హార్మోన్ల అసమతుల్యత - అధిక బరువు వుండే మహిళలకు హార్మోన్ల అసమతుల్యత వుంటుంది. దీని కారణంగా కూడా వారు త్వరగా గర్భం ధరించలేరు. దీనికి కారణం వీరికి అండోత్సర్గం సరిగా జరుగదు. కనుక వీరికి అండోత్సర్గం సరిగా జరగాలంటే హార్మోన్ల ఆరోగ్యం ప్రధానంగా వుండేలా చూడాలి.

English summary

How To Conceive If You Are Fat? | లావు ఎక్కితే గర్భం ఎలా?


 Eat fertility foods: Include foods which improves fertility and increases the chances to conceive even if you are fat. Food rich in folic acid helps get pregnant fast. Soy products, split beans, egg yolk, potatoes, wheat flour, cabbage, asparagus, beetroot, bananas, broccoli and Brussels sprout are rich in folic acid
Story first published:Saturday, April 7, 2012, 12:55 [IST]
Desktop Bottom Promotion