వివరించడానికి ఎలాంటి కారణం లేని వంధ్యత్వం(సంతాన-లేమి)!?

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మన వంతు ప్రయత్నాలను పునరావృతం చేసిన తర్వాత కూడా సంతాన ప్రాప్తిని పొందడం లేదా ! మరియు ఈ రోజుల్లో "సంతాన-లేమి" కేసులో అనేక కారణాల వలన పెరుగుతున్నాయి.

ముందుగా, పురుషుల వీర్య కణాల సంఖ్య ముందు తరం పురుషుల కంటే నేటి పురుషులకు తక్కువగా ఉన్నాయి. దానికి తోడుగా, నేడు ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా అనేక జంటల సంతాన-లేమికి దోహదపడింది.

సంతానలేమికి గురిచేసే గర్భాశయ వ్యాధులు

మధ్య వయస్సు వరకు గర్భస్రావాన్ని వాయిదా వేసిన కొన్ని జంటలు సంతాన-లేమికి వయస్సు క్షీణించడానికి సంబంధం ఉన్నట్లుగా నిందిస్తారు.

"వివరణలేని సంతాన-లేమి" అంటే ఏమిటి?

ఒక జంట సంతానాన్ని పొందలేనప్పుడు, దానికి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించండి. అలాంటి చాలా సందర్భాలలో, కారణాలు కనుగొనబడ్డాయి కనుక.

స్త్రీ-పురుషుల్లో సంతానలేమి సమస్యను నిరోధిండం ఎలా

కారణం గుర్తించినప్పుడు, పరిష్కారం కనుగొనవచ్చు మరియు అది గర్భం పొందే అవకాశాలను పెంచుతుంది. కానీ సంతాన-లేమికి వెనుక ఉన్న కారణాలను వైద్యులు కూడా గుర్తించలేకపోతే ఏమి చేయాలి?

అవును, వైద్యులు కూడా కనిపెట్టలేకపోయిన కొన్ని సంతాన-లేమికి సంబంధించిన కేసులో ఉన్నాయి. అటువంటి పరిస్థితిని "వివరించబడలేని సంతాన-లేమి" అని అంటారు. ఈ పరిస్థితి గురించి ఇక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి....

వివరణలేని సంతాన-లేమి అంటే ఏమిటి?

వివరణలేని సంతాన-లేమి అంటే ఏమిటి?

సంతాన-లేమికి వెనుక ఉన్న కారణాన్ని వైద్యుడు గుర్తించడంలో విఫలం అయ్యే సందర్భం తప్ప, వేరే ఇంకేమీ కాదు.

మీ డాక్టర్ అనేక పరీక్షలు మరియు టెస్ట్లు నిర్వహించిన తర్వాత కూడా, సరైన కారణాన్ని గుర్తించలేకపోతే అది బహుశా 'చెప్పలేని సంతాన-లేమి' కి కారణంగా కావచ్చు. మీరు ఈ పరిస్థితిని అధిగమించడానికి చికిత్స అవసరం కావచ్చు.

ఇది ఒక సాధారణ సమస్యగా ఉందా?

ఇది ఒక సాధారణ సమస్యగా ఉందా?

సంతాన-లేమి యొక్క ప్రతి 100 కేసుల్లో, దాదాపు 30 మందివి వివరించలేని కేసులుగా వర్తిస్తున్నాయి. ఈ సమస్య మహిళల్లో చాలా సాధారణంగా ఉంది. మెజారిటీ పరంగా చూస్తే మగవారిలో, సంతాన-లేమికి గల కారణాలను గుర్తించవచ్చు. కానీ, పురుషులలో కూడా తక్కువ శాతం మంది చెప్పలేని సంతాన-లేమితో బాధపడుతున్నారు.

అందుకు గల కారణాలు ఎందుకు నిర్ధారణ కాలేదు?

అందుకు గల కారణాలు ఎందుకు నిర్ధారణ కాలేదు?

ప్రస్తుతం పరీక్షా (టెస్టుల) విధానాల ద్వారా మాత్రమే ప్రధాన సంతాన-లేమి పరిస్థితులను కనుగొనటానికి సామర్థ్యం కలిగినవిగా ఉంటాయి.

సంతానోత్పత్తి రేటుని తగ్గించే ఇతర చిన్న కారణాలు ప్రస్తుత విధానాలతో సులభంగా గుర్తించబడలేవు. నిజానికి, గుడ్డులో కూడా చాలా మెరుగైన నాణ్యత గలది మరియు నాణ్యతలేనిది అనే మాదిరిగానే, సంతాన-లేమికి కూడా వెనుక ఏదో ఒక కారణం ఉండవచ్చు.

వివరణలేని సంతాన-లేమికి గల కారణాలేమిటి?

వివరణలేని సంతాన-లేమికి గల కారణాలేమిటి?

ఈ సమస్య గల కారణాలు ఏమిటో తెలుసా మీకు? వివరించలేని సంతాన-లేమికి వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం సులభం కాదు, కానీ చెప్పలేని విధంగా సంతాన-లేమికి కారణమయ్యే వైద్య పరిస్థితులతో ఆరోగ్య నిపుణులు మన ముందుకు వచ్చారు.

వివరణలేని సంతాన-లేమికి కారణమయ్యే మూడు ప్రధాన పరిస్థితులు ఉన్నాయి. అవి:

1) ఇమ్యునోలాజికల్ వంధ్యత్వం,

2) ఎండోమెట్రియోసిస్ వంధ్యత్వం,

3) అండోత్సర్గ వృద్ధాప్యము.

ఇమ్యునాలజికల్ వంధ్యత్వం అంటే ఏమిటి?

ఇమ్యునాలజికల్ వంధ్యత్వం అంటే ఏమిటి?

వివరించలేని సంతాన-లేమి ఉన్న 20% కేసుల వెనుక ఇమ్యునాలజికల్ వంధ్యత్వం అనేది కారణంగా ఉంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, పునరుత్పాదక కణాలను విదేశీ కణాలుగా (వైరస్) భావించి దాడి చెయ్యడాన్ని - ఇమ్యునోలాజికల్ వంధ్యత్వం అని అంటారు. విచారం ఏమంటే, మన శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ సంతానలేమికి కారణంగా మారుతుంది.

ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి?

ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి?

"వివరించలేని సంతాన-లేమి" ఉన్న కేసులలో 30% కంటే ఎక్కువ మందికి ఎండోమెట్రియోసిస్ కారణం వలన సంతాన-లేమి వస్తుంది. ఇది గర్భాశయం బయటవైపుగా, ఒక అసాధారణమైన కణము పెరుగుదల ఫలితంగా వచ్చే నొప్పి మాత్రమే. ఈ పరిస్థితిని "పెల్విక్ నొప్పిగా" సూచిస్తుంది.

మీరు పెల్విక్ నొప్పిని అనుభవించిన కారణంగా గర్భవతి కాలేకపోతే మిమ్మల్ని సమస్యను పరీక్షించటానికి గైనకాలజిస్ట్ను సంప్రదించండి.

మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి

అండోత్సర్గ వృద్ధాప్యము అంటే ఏమిటి?

అండోత్సర్గ వృద్ధాప్యము అంటే ఏమిటి?

వివరించలేని సంతాన-లేమి ఉన్న 50% కన్నా ఎక్కువ కేసుల్లో, అండాశయం యొక్క వయస్సు ముందుగానే వృద్ధాప్యంకు రావడం అనేది కారణంగా చెప్పబడుతోంది. ఈ రకమైన సమస్య ప్రధానంగా నలభై ఏళ్ళ వయస్సు ఉన్న మహిళల్లో సంభవిస్తుంది.

వాస్తవానికి, గర్భం దాల్చడాన్ని వాయిదా వేయాలని కోరుకునే స్త్రీలు సాధారణంగా వారి అండాశయ గుడ్లను స్తంభింపజేస్తారు. కాని, అలాంటి విధానాలు ఇప్పటికీ 100 శాతంగా విజయవంతం కాలేదు.

ఎవరిని పరీక్షించాలి ?

ఎవరిని పరీక్షించాలి ?

గర్భస్రావాలు (లేదా) IVF వైఫల్యాలకు గురైన మహిళలు పరీక్షించబడాలి. నిజానికి, పునరావృత ప్రయత్నాల తర్వాత గర్భవతి పొందలేకపోయిన ఎవరైనా పరీక్షల కోసం వెళ్లాలి. మీలోని లోపలకు సంబంధించిన పరీక్షలు (లేదా) టెస్ట్లు పొందడానికి ఒక అత్యాధునిక సాంకేతిక వైద్య పరీక్ష సౌకర్యం (లేదా) ఒక సంతానోత్పత్తి క్లినిక్ను సందర్శించడానికి ఉత్తమం.

గర్భం పొందడానికి గల అవకాశాలు ఏమిటి?

గర్భం పొందడానికి గల అవకాశాలు ఏమిటి?

ఒక వ్యక్తి చెప్పలేని సంతాన-లేమి కారణంగా బాధ పడుతున్నప్పుడు, తిరిగి గర్భవతిగా అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి అవకాశాలు 1 శాతం మాత్రమే, అంటే చాలా తక్కువగా ఉన్నాయన్న మాట. ఈ పరిస్థితులలో మీరు గర్భస్రావాన్ని విస్మరిస్తే , గర్భం పొందడానికి ఉన్న అవకాశాలు ప్రతి గడచిన సంవత్సరం పూర్తిగా తగ్గిపోవచ్చు కనుక ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదు.

వివరించలేని సంతాన-లేమికి ఏది సహాయం చేస్తుంది?

వివరించలేని సంతాన-లేమికి ఏది సహాయం చేస్తుంది?

చాలా సందర్భాలలో, కొన్ని రకాల చికిత్స పద్ధతులు పనిచేయవచ్చు. క్రమంగా మాత్రలు తీసుకోవడం మరియు సంభోగంతో జాగ్రత్తగా ఉండడం వంటివి చెయ్యడం వల్ల ఆ చికిత్సా విధానాలు కొంతమేర ఫలితాలను ఇవ్వగలదు. చాలా సందర్భాలలో, ప్రస్తుత చికిత్స విధానాలతో సమస్యను పరిష్కరించబడుతున్నాయి. కాబట్టి, ఒక వైద్యుడితో మాట్లాడటానికి జంటలు ఏ మాత్రం ఆలోచించకూడదు. మరింత తెలుసుకోవడానికి హెల్త్ ప్రాక్టిషనర్ ను (ఆరోగ్య అభ్యాసకుడిని) సంప్రదించండి.

English summary

What Is Unexplained Infertility?

Yes, there are some infertility cases which even the doctors cannot crack. Such a condition is known as unexplained infertility. Here are some facts about the condition.
Story first published: Monday, October 16, 2017, 13:00 [IST]
Subscribe Newsletter