For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిజేరియన్ ఆపరేషన్ల వల్ల తల్లుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?

సి-సెక్షన్ డెలివరీ దీనినే సిజేరియన్ అని కూడా పిలుస్తారు. ఇది శస్త్రచికిత్సా ప్రక్రియ, దీనిలో తల్లి కడుపు మరియు గర్భాశయాన్ని కోసి శిశువు బయటకు తీస్తారు. కొన్ని గర్భాలకు సి-సెక్షన్ డెలివరీ సురక్షితం మరియు అవసరం. అయితే సి-స

|

సి-సెక్షన్ డెలివరీ దీనినే సిజేరియన్ అని కూడా పిలుస్తారు. ఇది శస్త్రచికిత్సా ప్రక్రియ, దీనిలో తల్లి కడుపు మరియు గర్భాశయాన్ని కోసి శిశువు బయటకు తీస్తారు. కొన్ని గర్భాలకు సి-సెక్షన్ డెలివరీ సురక్షితం మరియు అవసరం. అయితే సి-సెక్షన్ డెలివరీల వల్ల వల్ల తల్లుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

How does C-section delivery affect the mothers health in Telugu

సి-సెక్షన్ ఎందుకు చేస్తారు?

  • సిజేరియన్ చేయడం కొందరికి అవసరం. గర్భాశయానికి తలెత్తే సమస్యల వల్ల సిజేరియన్ అవసరం అవుతుంది. యోనిలో సమస్యల వల్ల కూడా సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
  • అలాగే కొందరు తల్లులు డెలివరీ సమయాన్ని తమకిష్టం వచ్చినట్లు ఉండాలనుకుంటారు, మరికొందరు జాతకాల ప్రకారం బిడ్డకు జన్మ ఇవ్వాలని కోరుకుంటారు అలా సిజేరియన్ డెలివరీ చేస్తారు.
  • డెలివరీ ప్రక్రియ సజావుగా సాగనప్పుడు సిజేరియన్ చేయాల్సి వస్తుంది.
  • గర్భంలో శిశువు పరిస్థితి బాలేకపోతే సిజేరియన్ చేయాల్సి వస్తుంది.
  • ప్లాసెంటాతో సమస్య ఉన్నా సి-సెక్షన్ చేస్తారు.
  • అనారోగ్య సమస్య ఉంటే సి-సెక్షన్ చేస్తారు.
  • శిశువు బ్రీచ్ పొజిషన్‌ లో ఉంటే, మాయ గర్భశయాన్ని అడ్డుకుంటున్నిట్లయితే లేదా తల్లికి యోని ప్రసవాన్ని ప్రమాదకరంగా మార్చే ఆరోగ్య పరిస్థితి ఉంటే సి-సెక్షన్ ఉత్తమ ఎంపిక అవుతుంది.
How does C-section delivery affect the mothers health in Telugu

సి-సెక్షన్ ప్రయోజనాలు ఏంటి?

  • సి-సెక్షన్ లో పురిటి నొప్పులు ఉండవు
  • యోనికి ఎలాంటి గాయాలు కావు
  • మూత్రాశయం మీద నియంత్రణ లేకపోవడం
How does C-section delivery affect the mothers health in Telugu

సి-సెక్షన్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

  • సి-సెక్షన్ డెలివరీకి సంబంధించిన ప్రధాన ప్రమాదాలలో ఒకటి శస్త్ర చికిత్స సమయంలోనే సమస్యలు వచ్చే అవకాశం ఉండటం. రక్త స్రావం, ఇన్ఫెక్షన్, రక్తం గడ్డకట్టడం, మూత్రాశయం, ప్రేగులకు గాయం కావొచ్చు.
  • సి-సెక్షన్ డెలివరీ పెద్ద శస్త్రచికిత్స అయినందు వల్ల యోని డెలివరీ కంటే రికవరీ కాలం ఎక్కువగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది.
  • సి-సెక్షన్ డెలివరీ అయిన తల్లులు కోత ప్రదేశంలో నొప్పి, అసౌకర్యం, అలసట, బలహీనత అనుభవిస్తారు.
  • సి-సెక్షన్ ఉన్న తల్లులు తదుపరి గర్భాలలో ప్లాసెంటా ప్రెవియా(ప్లాసెంటా గర్భాశయాన్ని కప్పి ఉంచే పరిస్థితి) లేదా ప్లాసెంటా అక్రెటా (మావి గర్భాశయంలోకి చాలా లోతుగా అతుక్కుపోయే పరిస్థితి) ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితి తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రాణహాని కలిగిస్తుంది.
  • సి-సెక్షన్ డెలివరీ తల్లిపాలు ఇవ్వడంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆపరేషన్ కారణంగా పాలు ఇచ్చే సమయంలో అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుంది.
  • సి-సెక్షన్ వల్ల తల్లులు ప్రారంభ రోజుల్లో తమ బిడ్డతో తక్కువ సమయం గడపవచ్చు.

కొన్ని గర్భాలకు సి-సెక్షన్ డెలివరీ సురక్షితమైన, అవసరమైన ఎంపిక. ఇది తల్లి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. సి-సెక్షన్ డెలివరీతో సంబంధం ఉన్న సంభావ్య ప్రమాదాలు, సమస్యల గురించి తల్లులు తెలుసుకోవడం వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో ప్రయోజనాలు, నష్టాలు చర్చించడం చాలా ముఖ్యం. అన్ని తెలుసుకున్న తర్వాతే సి-సెక్షన్ డెలివరీ వైపు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

English summary

How does C-section delivery affect the mother's health in Telugu

read this to know How does C-section delivery affect the mother's health in Telugu
Story first published:Saturday, January 21, 2023, 19:20 [IST]
Desktop Bottom Promotion