For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నురగలు కక్కే కూల్ డ్రింక్స్ తో....

By B N Sharma
|

Fizzy soft drinks make teens violent
టీనేజ్ పిల్లలు వారానికి అయిదు లేదా ఆరు నురగలు కక్కే కూల్ డ్రింక్ లు రెగ్యులర్ గా తాగేస్తూవుంటే వారిలో హింసాత్మక ధోరణి, దూకుడు ప్రవర్తన అధికమవుతుందని ఒక తాజా స్టడీ వెల్లడించింది.

వారు ఎంత హింసకు దిగుతారంటే, అది కర్ర కావచ్చు లేదా దొరికితే పిస్టల్ కావచ్చు...ఒక ఆయుధాన్ని చేతబట్టి తమ సహచరులు, లేదా ఇతర చిన్నవయసు వారిపై హింసకు దిగుతారట. వీరు వారానికి ఎన్ని కార్బోనేటెడ్ కూల్ డ్రింక్ లు తాగుతున్నారో రీసెర్చర్లు పరిశీలించారు. వారి దైనందిన ప్రవర్తన, హావభావాలు పరిశీలించారు. మెల్లగా వారిలో హింసాత్మక ధోరణి, భావాలు అధికమవుతుండడాన్ని కనిపెట్టారు. ప్రతివారం అయిదు లేదా అంతకంటే అధికంగా కూల్ డ్రింక్ కేన్లు తాగేసిన వారు ఆల్కహాల్, స్మాకింగ్ లకు కూడా తరచుగా అలవాటుపడినట్లుగా కూడా తెలిపారు.

ఏ డ్రింక్ తాగని పిల్లలలో కంటే, కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తాగే యువకులలో 9 నుండి 15 శాతం అధికంగా దూకుడు ప్రవర్తన వున్నట్లు....ఇదే మాదిరి ప్రవర్తన ఆల్కహాల్ తాగడం, స్మాకింగ్ చేయడం చేసిన పిల్లలలో కూడా వుంటుందని పరిశోధన తేల్చింది. సాఫ్ట్ డ్రింక్స్ లో వుండే షుగర్, కేఫైన్ వంటి పదార్ధాలవలన, ఇతర కారణాలవలనవీరికి ఈ రకమైన దూకుడు ప్రవర్తన అలవడి వుండవచ్చని రీసెర్చర్లు భావిస్తున్నారు. ఈ ఫలితాలను ఇంజరీ ప్రివెన్షన్ అనే ఆన్ లైన్ జర్నల్ లో ప్రచురించారు.

English summary

Fizzy soft drinks make teens violent | పిల్లాడికి కూల్ డ్రింకా? జాగ్రత్తసుమా... !

"There may be a direct cause-and-effect-relationship, perhaps due to the sugar or caffeine content of soft drinks, or there may be other factors, unaccounted for in our analyses, that cause both high soft drink consumption and aggression," concluded the authors. The findings were published online in Injury Prevention.
Story first published:Tuesday, January 10, 2012, 9:58 [IST]
Desktop Bottom Promotion