For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో పిల్లల కోసం 8 ఆరోగ్యకరమైన ఆహారాలు

|

ఇది మీరు అనుకునే నీళ్లు నమలడం కాదు... నీళ్లు నిండుగా ఉండే పుచ్చకాయ, టొమాటో లాంటివి నమలడం, లస్సీ, మజ్జిగలను చప్పరించడం. పండ్లు తినడం అన్నమాట. ఈ సీజన్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతాం. అది అవసరం కూడా. కానీ... పిల్లలు ఎండలో ఆడుకుంటూ ఆ విషయమే మర్చిపోతారు. కొందరు పనులపై బయటికి వెళ్లినప్పుడు కుదరక నీళ్లు తాగలేరు. అప్పుడు డీహైడ్రేషన్ సమస్య బాధిస్తుంది. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ నీళ్లు నమలడం పొరబాటు కానే కాదు. దీన్ని నిక్షేపంగా చేయవచ్చు. అదే... ఈ వారం ముందుజాగ్రత్త.

ఒక సీజను నుండి మరొక సీజనులోనికి అడుగుపెట్టేటప్పుడు వాతావరణ మార్పులవలన చలికాలం నుండి వేసవికాలంలో క్యాజువల్ ఎలర్జీ కండిషన్స్ ఎక్కువగా వస్తాయి. అంటే ధూళి, దుమ్ము, జలుబు, జ్వరం, ఫ్లూవ్యాధులు చిన్నపిల్లలు గాలి పీల్చేటప్పుడు వస్తాయి. ఇవికాక పిల్లల్ని నీరసపెట్టే విరోచనాలు వస్తాయి. మరీ ఎక్కువైతే డీలాపడిపోయిన సందర్భాలలో సెలైన్ బాటిల్స్ ఎక్కించాలి. డీహైడ్రేషన్ రాకుండా జాగ్రత్తలు పడాలి. వేసవి అంటే పిల్లలు ఇంటిదగ్గర గడిపే రోజులు, ప్రయాణాలు చేసేరోజులు, లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉండే రోజులు. విపరీతంగా ఆడుతూండటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంటుంది. అందువల్ల పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి.

వేసవిలో... కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అది నీరు కావ‌చ్చు, పండ్ల ర‌సాలు కావచ్చు, దీనివ‌ల‌న శరీరంలో నీటి శాతం కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి, వేసవిలో పిల్లలకు అందివ్వాల్సిన హెల్తీ ఫుడ్స్ మీకోసం...

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు

లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రొటీన్లను, క్యాల్షియమ్‌ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి.

ఫ్రెష్ ఫ్రూట్స్

ఫ్రెష్ ఫ్రూట్స్

తాజా పండ్లు, చల్లగా ఉండే పండ్ల రసాలు వంటివి కూడా పిల్లల శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడతాయి.

పిజ్జా-శాండ్విచ్

పిజ్జా-శాండ్విచ్

పిజ్జాలు, శాండ్‌విచ్ వంటివి పనీర్, తాజాకూరగాయలతో తీసుకుంటే పరవాలేదు కాని, ఎక్కువగా చీజ్ ఉపయోగించినవి మాత్రం మంచిది కాదు.

వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు

వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు

. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు.

ఐస్ క్రీమ్స్ అండ్ స్మూతీస్

ఐస్ క్రీమ్స్ అండ్ స్మూతీస్

ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు.

పుచ్చకాయ

పుచ్చకాయ

ఇందులో 80 శాతం కంటె ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.

సలాడ్స్

సలాడ్స్

వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ తయారుచేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు.

English summary

8 Healthy Summer Foods for Kids

For many parents, buying and preparing healthy foods is pretty easy. It’s getting your child to actually eat those nutritious foods that’s the hard part! This makes mealtimes frustrating and leaves parents often wondering if their child is getting enough nutrients. If this is the case in your home, then read on because we’ve got eight super healthy foods that we guarantee even your pickiest child will eat.
Story first published: Saturday, May 3, 2014, 16:17 [IST]
Desktop Bottom Promotion