Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పరీక్షల కాలంలో తల్లి తండ్రులు పిల్లలలో ఒత్తిడిని ఎలా తగ్గించవచ్చు
మార్చ్, ఏప్రిల్ నెలల్లో పిల్లలతో కళకళ్లాడే వీధులనీ బోసిపోయి ఉంటాయి.పిల్లల నవ్వుల సవ్వడులు, వారి సైకిల్ చక్రాల చప్పుళ్ళు, వారి అరుపులు, కేకలూ ఇవేవీ వినిపించవు ప్లే గ్రౌండ్స్‌లో.అవును, ఈ రెండు నెలలూ పిల్లలూ వారి తల్లి తండ్రులూ ఇద్దరికీ పరీక్షల కాలమే.పరీక్షలు మొదలయ్యే ఈ నెలలో పరీక్షలని ఎదుర్కోబొయే, పిల్లలూ వారి తల్లి తండ్రులలో ఆందోళనా ,ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంటాయి నువ్వు బాగా చదవాలి, మార్కులు బాగా తెచ్చుకోవాలి అని పిల్లలని ఈ సమయంలో ఒత్తిడిలోకి నెట్టకూడదని నిపుణుల సూచన.
అవసరమైనంత చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవడం ద్వారా మీరు జీవితంలో అనుకున్న దానిలో స్థిరపడగలరు.పరీక్షల కాలంలో పిల్లలని మరిన్ని ఎక్కువ గంటలు చదవమని చెప్తే వారు శారీరకంగా మరియూ మానసికంగా కూడా అలసటకి గురయ్యే అవకాశం ఉంది.ఈ పరీక్షా సమయంలో తల్లి తండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి ఏమి చేస్తే వారు ఒత్తిడిని జయించి మంచి మార్కులు తెచ్చుకుంటారో మేము ఈ ఆర్టికిల్ ద్వారా తెలియచేస్తున్నాము.పిల్లలు ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి అని అనుకునే ముందు అసలు మీ పిల్లలని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.మీ పిల్లలు పరీక్షలకి సన్నద్ధమవుతోంటే కనుక మీరు వారి ఒత్తిడి ని తీసెయ్యడంలో ఎలా సహాయ పడగలరో క్రింద ఇచ్చాము చూడండి.

ప్రశాంత వాతావరణం:
పరీక్షలు కదా అని మీ ఇంట్లో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపింపచేసేటట్లు చెయ్యకండి.పరీక్షలప్పుడు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకుంటే వారు మరింత శ్రద్ధగా చదవగలరు.

మధ్య మధ్యలో విరామం:
మధ్యలో విరామం లేకుండా అలా చదువుతూనే ఉంటే పిల్లలు అలసిపోతారు. అందువల్ల వారికి మధ్య మధ్యలో కాస్త విరామం ఇచ్చి వారి గది నుండి బయటకొచ్చి కాసేపు సేద తీరేటట్లు చూడండి.చదువుకునేటప్పుడు ఏయే సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలో ముందరే నిర్ణయించి వారు ఆ సమయంలో పార్కులో కాసేపు నడక లేదా ఇతర వ్యాపకాల ద్వారా సేద తీరేటట్లు చూడండి.

బలవర్ధక ఆహారం:
జంక్ ఫుడ్ ని ఈ సమయంలో నిషేధించి వాటి స్థానంలో శక్తినిచ్చి పోషకాలు అధికంగా ఉండే ఆహారానికే ప్రాధాన్యతనివ్వండి.వారు చదువు మీదే దృష్టి నిలిపి, ఙాపకశక్తిని పెంచే ఆహారం ఇవ్వాలి.

ఆశావహ దృక్పధం:
పెరేంట్స్ కి ఈ దృక్పధం ఉంటే పిల్లలకి అది సునాయాసంగా వస్తుంది.మీరు కనుక మీ పిలల్లతో కూర్చుని వారిని పరీక్షలకి సన్నద్ధం చేస్తున్నట్లయితే కనుక ఆశావహ దృక్పధంతో పాజిటివ్ గా మాట్లాడి వారిలో శక్తిని నింపండి.

మంచి ర్యాంకుల కోసం ఒత్తిది పెట్టద్దు:
ఫలానా ర్యాంకు తెచ్చుకోవాలి అని పిల్లల నుండీ ఆశించే ముందు అసలు వారి శక్తి సామర్ధ్యాలని ముందు తెలుసుకోండి.వారి సామర్ధ్యానికి మించి మీకు కావాల్సినన్ని మార్కులు తెచ్చుకోవాలనడం భావ్యం కాదు.ఇలా ఒత్తిడి పెడితే వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిన వారవుతారు.

వారితో స్నేహితుల్లా మెలగండి:
పరీక్షల సమయంలో పిల్లలకి తల్లి తండ్రుల కంటే స్నేహితుల అవసరం బాగా ఉంటుంది.మీరు కనుక వారి వైపు నుండి ఆలోచిస్తే వారి శక్తి సామర్ధ్యాలు, వారు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో తెలుస్తుంది.

పిల్లలతో కలిసి వ్యాయామం చెయ్యడం:
పిల్లలు పరీక్షల ఒత్తిడిని జయించటానికి వారితో కలిసి రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్ లాంటివి చెయ్యచ్చు.



Click it and Unblock the Notifications
