Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే న్యూట్రీషియస్ రెసిపీ
హిడెన్ హంగర్ అంటే.. సాధారణంగా ఆకలిగా భావిస్తాం. కానీ.. ఇది పోషకాహార లోపాన్ని సూచిస్తుంది. పిల్లల్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించడం లేదు. చాలా సందర్భాల్లో మీ పిల్లలు భోజనం పూర్తీగా చేసినా.. దాని ద్వారా కావాల్సినన్ని పోషకాలు పొందకపోయి ఉండవచ్చు.
ఈ మధ్య కాలంలో.. చాలా మంది పిల్లల్లో ఇది కనిపిస్తోంది. వాళ్లు తీసుకునే డైట్ ద్వారా సూక్ష్మ పోషకాలను పొందలేకపోతున్నారు. హిడెన్ హంగర్ అలా ఈ పోషకాలు మిస్సయినప్పుడే కనిపిస్తుంది. పిల్లలకు ఐరన్, జింక్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, మినరల్స్ లోపం ఎక్కువగా కనిపిస్తోంది.

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాలు చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. వాళ్లకు సరైన స్థాయిలో పోషకాహారం లభించడం లేదు.
పోషకాహార లోపం కారణంగా.. మానసిక ఏకాగ్రత, మెమరీ, బలహీన శరీరం, బలహీన రోగనిరోధక శక్తి, త్వరగా అనారోగ్యం పాలవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవి కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తాయి.
తల్లిదండ్రులుగా మనకు కొన్ని సందర్భాల్లో వాళ్ల ఆకలిని గుర్తించలేకపోతాం. దీనివల్ల ఎక్కువగా తింటారు. కానీ.. పోషకాహారం తినకుండా మిస్సవుతారు.
ఈ సమస్యను ఎలా అధిగమించాలి ?
పోషకాహార లోపం నుంచి పిల్లలను బయటపడేయాలంటే.. న్యూట్రీషన్ రిచ్ ఫుడ్ అందించాలి. ప్రస్తుతం క్యాలరీలు ఎక్కువ ఉండి.. పోషకాలు తక్కువగా ఉన్న ఆహారాలే ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
హై క్యాలరీ ఫుడ్స్, న్యూట్రీషియస్ ఫుడ్ కి తేడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. హై క్యాలరీ ఫుడ్ కేవలం పొట్టను నింపుతుంది కానీ.. శరీరాన్ని కాదు. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకు హై క్యాలరీ, హై న్యూట్రీషియస్ ఫుడ్ ని ఇవ్వాలి. అప్పుడే పొట్టతో పాటు, శరీరానికి కూడా బలవర్థక ఆహారం అందుతుంది.
పాల ద్వారా ఎక్కువ పోషకాలు అందించవచ్చు. అయితే వీటిని చాలా టేస్టీగా ఇచ్చినప్పుడే ఎక్కువ పోషకాలు అందుతాయి. కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తీసుకునే తయారు చేయాలి.

కావాల్సిన పదార్థాలు
ప్లెయిన్ హార్లిక్స్ 27 గ్రాములు
కొబ్బరి తురుము 4 ముక్కలు
వేడి పాలు 200 మిలీ
షుగర్ సిరప్ రుచికి సరిపడా
తయారు చేసే విధానం
40 మిలీ చల్లటి పాలల్లో హార్లిక్స్ మిక్స్ చేయాలి. మిగిలిన పాలను మరిగించాలి. మరుగుతున్నప్పుడు కొబ్బరి తురుము కలపాలి. చల్లటి హార్లిక్స్ పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి.. గులాబీ రెక్కలతో గార్నిష్ చేసి బ్రేక్ ఫాస్ట్ గానో, సాయంత్రం స్నాక్స్ గానో ఇవ్వండి.
న్యూట్రీషన్ వ్యాల్యూ
| ఎనర్జీ | 601.82 క్యాలరీ |
| క్యాల్షియం | 387.5ఎమ్ జీ |
| ప్రొటీన్ | 14.35గ్రా |
| ఫ్యాట్ | 29.65గ్రా |
| కార్బోహైడ్రేట్స్ | 71.09గ్రా |
| షుగర్ | 8.8 గ్రా |
బ్రేక్ ఫాస్ట్ రెసిపీ
కోల్డ్ హార్లిక్స్ లో పోషకాలు పుష్కలంగా అందుతాయి. వేసవికాలంలో ఐస్ క్రీం కి బదులుగా ఈ స్మూతీ ఇస్తే.. పిల్లలకు మంచి పోషకవిలువలు అందుతాయి. దీనిద్వారా విటమిన్స్, మినరల్స్ పొందవచ్చు.

కావాల్సిన పదార్థాలు
ప్లెయిన్ హార్లిక్స్ 27గ్రా
మ్యాంగో జ్యూస్ 60ఎమ్ఎల్
అరటిపండు హాఫ్
ఆరంజ్ జ్యూస్ 60 ఎమ్ఎల్
వీట్ బ్రాన్ 10 గ్రా
నువ్వులు 5గ్రాములు
తేనె రుచికి సరిపడా
క్రష్డ్ ఐస్
తయారు చేసే విధానం
తేనె, బ్రాన్ ఒక ప్లేట్ లో తేసుకోవాలి. చివర్లు కట్ చేయాలి. తర్వాత అన్ని పదార్థాలను బాగా మిక్సీ పట్టాలి. ఐస్ కూడా యాడ్ చేయాలి. స్మూత్ గా అయ్యేంత వరకూ మిక్సీ వేయాలి. ఇప్పుడు పిల్లలకు ఇస్తే ఇష్టంగా లాగించేస్తారు.
న్యూట్రీషన్ వ్యాల్యూ
| ఎనర్జీ | 268.4 |
| ప్రొటీన్ | 6.715 |
| ఫ్యాట్ | 3.88 |
| కార్బోహైడ్రేట్స్ | 80.51 |
| షుగర్ | 7.88 |
| క్యాల్షియం | 278 |



Click it and Unblock the Notifications