For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లలు బాగా నిద్రపోవటానికి సహాయపడే 10 ఆహార పదార్థాలు

|

మన శరీరానికి నిద్ర కంటే మించిన వేరొక మంచి చర్య ఇంకేది లేదు. నిద్ర సమయంలోనే చర్మం మరింత కాంతివంతంగా మార్పు చెందుతుంది, శరీర పెరుగుదల, మరియు మెదడులోని కణాలు కమ్యూనికేషన్ కోసం నిర్మాణాత్మకమైన మార్పులతో పాటు ఇంకా చాలానే లాభాలు ఉన్నాయి. నిద్ర అనేది అన్ని జీవరాసులకు ముఖ్యమైనది మరియు చిన్న పిల్లలకు చాలా ముఖ్యమైనది.

తగినంత నిద్ర వున్న పిల్లలకు డయాబెటిస్ వృద్ధి చెందటం మరియు అధిక బరువును కలిగి ఉండడమనేది చాలా తక్కువగా ఉంటుంది. అదనంగా మంచి నిద్రను కలిగి ఉండటం వల్ల కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడానికి మరియు కొత్త విషయాల పట్ల ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండటానికి సహాయం చేస్తుంది.

10 Foods That Help Your Kids Fall Asleep

దురదృష్టవశాత్తు, నేటి జీవన శైలి నేపథ్యంలో పిల్లలకు మంచి నిద్రావస్థ అనేది ప్రస్తుత కాలంలో నిరోధించబడుతున్నది. తల్లిదండ్రులు పిల్లలను రాత్రిళ్లు పడుకోబెట్టడానికి కథలు చెప్పడం, స్నానం (లేదా) మసాజ్ చేయించడం, పడుకునే గదిలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం వంటి ఇతర పద్ధతులను ఉపయోగించేవారు.

నిజానికి, పిల్లలు అన్ని సమయాల్లోనూ పూర్తిగా పని చెయ్యరు. నిద్ర అనేది శరీరం ద్వారా స్వయంచాలకంగా ప్రేరేపించబడాలి మరియు పిల్లల్లో నిద్ర-పోకుండా ఉన్న స్థితికి కొన్ని రకాల ఆహార పద్ధతుల మార్పులతో సాధారణ స్థితికి తీసుకువచ్చేదిగా ఉన్నాయి.

నిద్రలో ప్రేరేపించే కొన్ని ఎజెంట్లలో ట్రిప్టోఫాన్, మెలటోనిన్ మరియు సెరోటోనిన్ వంటివి, మీ పిల్లలను బాగా నిద్రపోయేలా చెయ్యడంలో మంచి సహాయకారిగా ఉంటూ, ఉదయం వరకు నిద్రపోతూ ఉండేలా చేస్తుంది. కాబట్టి, దిగువ జాబితాలో పేర్కొన్న ఆహార పదార్థాలను పరిశీలించి, వాటిని మీ పిల్లల ఆహారంలో చేర్చండి.

పాలు :

పాలు :

నిద్రపోయే ముందు పిల్లలకు సాధారణంగా ఒక గ్లాసు పాలు ఇస్తారు. ఈ ప్రాక్టీసు అనేది ప్రయోజనకారిగా లేకుండా మాత్రం లేదు. అవును, పాలు అనేవి పిల్లలలో నిద్రను ప్రేరేపిస్తుంది.

అరటి పండు :

అరటి పండు :

భోజనం తర్వాత ఉండే సాధారణంగా వాడే పండు అరటి. అందులో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది, అయితే మరి అది మీకు ఎలా సహాయ పడగలదని అనుకుంటున్నారు ? మెగ్నీషియం అనేది కండరాలను సడలించేదిగా పనిచేస్తుంది, తద్వారా మొత్తం శరీరాన్ని విశ్రాంతి చెందేలా చేస్తుంది. వాటిలో నిద్రను ప్రేరేపించే హార్మోన్లు మెలటోనిన్ మరియు సెరోటోనిన్లను కలిగి ఉంటాయి, ఇవి చక్కని నిద్రావస్తను నియంత్రిస్తాయి.

సాల్మన్ :

సాల్మన్ :

సాల్మన్ అనే సముద్రపు చేప నిద్రను ప్రేరేపించడం లో చాలా ఉత్తమమైనదిగా పనిచేస్తుంది. విందు సమయంలో సాల్మన్ యొక్క భాగం మానవ శరీరంలో ఉన్న మెలటోనిన్ మరియు సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ విధమైన ఉత్పత్తి జరగటం వల్ల క్రమక్రమంగా నిద్రను సులభతరం చేస్తుంది. అంతేకాక, సాల్మన్ చేపను తినటం వల్ల పిల్లలలో బరువు పెరుగుటకు కూడా ఉపయోగపడతుంది.

ఓట్స్ :

ఓట్స్ :

ఓట్స్ అనేది మన గుండెను ఆరోగ్యంగా సంరక్షించేదని పిలుస్తారు. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేసే విటమిన్లను మరియు ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది.

కానీ, ఓట్స్ యొక్క ప్రయోజనాలు అంతకు మించి ఉన్నాయి. ఇది ఒక వ్యక్తిని బాగా నిద్రపోయేలా చేసే మెలటోనిన్ హార్మోన్ యొక్క అధిక సాంద్రతను కలిగి ఉంటుంది.

ఇది కార్బోహైడ్రేట్లను కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది, ఇది పూర్తిగా కడుపును నింపేటట్లుగా సహాయపడుతుంది, అందువలన నిద్ర బాగా పట్టడంలో మనకు చాలా సహాయపడుతుంది.

బచ్చలికూర :

బచ్చలికూర :

బచ్చలికూర అనేది ప్రతి శిశువు యొక్క ఆహారంలో చాలా ముఖ్యమైనది. వాచ్యంగా మొత్తం శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లను మరియు ఖనిజాలను గొప్ప మోతాదులో కలిగి ఉండడమే కాకుండా, బచ్చలికూర ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లమును కూడా ఎక్కువ మోతాదులో కలిగి ఉంటుంది.

సలాడ్లలో పాలకూరను చేర్చవచ్చు (లేదా) మీ పిల్లలు నిద్రపోయే ముందు త్రాగేటందుకు అమితంగా ఇష్టపడే జ్యూస్లలో కూడా వీటిని కలిపి ఇవ్వవచ్చు.

అన్నం :

అన్నం :

అన్నం సాధారణంగా విందు కోసం ప్రతిపాదించబడి కడుపును మొత్తం పూర్తిగా నిండినట్లుగా చేసే ఒక ఆహార పదార్ధము. కానీ మీరు మీ పిల్లలతో నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, వారి డిన్నర్ ప్లేట్లలో అన్నమును చేర్చడానికి వెనుకాడకండి.

బియ్యం అనేవి గ్లైసెమిక్ సూచికను వెంటనే పెంచే శక్తిని కలిగచేసే ఒక ఊపును ఇస్తుంది, తరువాత బాగా అలసట గా వున్న శరీరానికి నిద్రను ప్రేరేపించడానికి ఇది మంచి ఫలితాలను అందిస్తుంది.

 వాల్నట్ :

వాల్నట్ :

బ్రెయిన్-ఆకారంలో ఉండే అక్రోట్లు మెదడుకు చాలా మంచిదని చెబుతారు. ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది కానీ అక్కడితో దీని ప్రయోజనాలు ముగియలేదు. వాల్నట్లలో ట్రిప్టోఫాన్ మంచి భారీ మొత్తంలో కలిగి ఉన్నది. వారు ఉత్తమ ఫలితాలు కోసం లేదా నిద్రవేళ ముందు తీపి పదార్ధాలలో వీటిని జోడించి తినవచ్చు. నట్స్ తో కలిపి తినడానికి ప్రయత్నించవచ్చు.

అనాస పండు :

అనాస పండు :

పైనాపిల్ మెలటోనిన్ను గొప్ప స్థాయిలో పెంచుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు అయినప్పటికీ, ఓట్స్ మరియు అరటి కన్నా మెలటోనిన్ను పెంచడం ఇవి చాలా వరకూ సామర్ధ్యమును కలిగి ఉన్నది. అదనంగా, పైనాపిల్ ముక్కలను కొన్నిసార్లు భోజనం తర్వాత తినడం వల్ల కూడా జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.

ద్రాక్ష :

ద్రాక్ష :

నిద్రను రెగ్యులేటింగ్ చేసే మెలటోనిన్ హార్మోన్, ద్రాక్షలో కూడా ఉంటుంది. చేతి నిండా తీసుకొనే కొన్ని ద్రాక్షలు మేజిక్ చేయటానికి సరిగ్గా సరిపోతాయి. దీని యొక్క రసమును ఆస్వాదించడం మన ఆరోగ్యానికి చాల మంచి ఎంపిక. ఇది ఒక ఫ్రూట్ సలాడ్లో ద్రాక్షలను జోడించడానికి అనేది చాలా మంచి ఆలోచన.

ఎక్కువ కార్బోహైడ్రేట్లు మరియు తక్కువ ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహారం :

ఎక్కువ కార్బోహైడ్రేట్లు మరియు తక్కువ ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహారం :

ఎక్కువ కార్బోహైడ్రేట్లు మరియు తక్కువ ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహారం సంతృప్తికరంగా ఉంటూ, ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

ట్రిప్టోఫాన్ను కలిగి ఉన్న అధిక-కార్బోహైడ్రేట్ల ఆహారమును నిద్రవేళకు ముందు అల్పాహారంగా తీసుకోవడం వల్ల మీకు మంచి ప్రభావమును చేసేదిగా ఉంటుంది. అలాంటి గొప్ప కలయికలుగా ఉన్నవి కొన్ని ఏమిటంటే, ఆపిల్ తో పీనట్ బట్టర్, గోధుమలు మరియు చీజ్ తో చెయ్యబడిన బిస్కెట్లు, సీరిల్ మరియు పాల కలయికలో వచ్చిన కార్న్-ఫ్లాకేస్ గా ఉన్నాయి.

English summary

10 Foods That Help Your Kids Fall Asleep

మన శరీరానికి నిద్ర కంటే మించిన వేరొక మంచి చర్య ఇంకేది లేదు. నిద్ర సమయంలోనే చర్మం మరింత కాంతివంతంగా మార్పు చెందుతుంది, శరీర పెరుగుదల, మరియు మెదడులోని కణాలు కమ్యూనికేషన్ కోసం నిర్మాణాత్మకమైన మార్పులతో పాటు ఇంకా చాలానే లాభాలు ఉన్నాయి. నిద్ర అనేది అన్ని జీవరాసులకు ముఖ్యమైనది మరియు చిన్న పిల్లలకు చాలా ముఖ్యమైనది.
Desktop Bottom Promotion