Latest Updates
-
వృశ్చికం, మేషం, మకర రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - మంగళవారం, 26 మే 2026 -
ఖరీదైన రత్న ఉంగరాల మాటే వద్దు.. రోజూ ఇలా చేశారంటే మీ జాతకానికి తిరుగే ఉండదు.! -
మీ తప్పు లేకుండానే కొందరు మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తారో తెలుసా? చాణక్యుడి ఈ మాటలు వింటే షాక్ అవుతారు! -
ఇంట్లోనే కొరియన్ క్రీమ్ చీజ్ బన్స్..ఈజీగా చేసుకోండిలా.. -
రెస్టారెంట్ స్టైల్ చోలే భటూరే.. ఈ ఇన్స్టంట్ రెసిపీ హ్యాక్‌తో ఇంట్లోనే మెత్తగా, రుచిగా చేసుకోండిలా! -
'సాఫ్ట్ లాంచ్' అంటే ఇదేనా? సోషల్ మీడియాలో పార్ట్నర్ను దాచిపెడుతూ ఫోటోలు పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! -
పర్ఫెక్ట్ పార్టనర్ కోసం వెతుకుతున్నారా? అయితే మీరు ఈ నిజం తెలుసుకోవాల్సిందే! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే మ్యాంగో బర్ఫీ..కోవా అక్కర్లేకుండానే ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
కొబ్బరి పాలతో నోరూరించే కేరళ ‘కిన్నత్తప్పం’.. గుడ్లు లేకుండా కేక్ స్టైల్లో -
సోషల్ మీడియాలో 'సాఫ్ట్ లాంచ్' ట్రెండ్… క్రిస్టల్ డిసౌజా వీడియోతో మొదలైన కొత్త చర్చ! అసలు ఏంటా మిస్టరీ?
పిల్లలు ఏడుపు ఆపాలని ఫోన్, ట్యాబ్ ఇస్తున్నారా.. అయితే వారి విపరీత ప్రవర్తనకు మీరే కారణం
పిల్లలను శాంతింపజేయడానికి స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు వంటి డిజిటల్ డివైస్‌లను ఇవ్వడం వల్ల పిల్లల్లో మానసిక ప్రవర్తనలో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం పాటించే ఈ చిట్కా వల్ల పిల్లల దీర్ఘకాలిక
పిల్లల పెంపకం అంటే మాటలు కాదు. తల ప్రాణం తోకకొస్తుంది. పట్ట పగలే చుక్కలు చూపిస్తారు. ఏదైనా పనిలో ఉన్నప్పుడే కెవ్వుమంటారు. అడిగిందే కావాలని మారాం చేస్తుంటారు. చూసింది కొనివ్వాలని ఏడుస్తుంటారు. ఇలా ఒకటి, రెండు కాదు వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నప్పుడు వారు ఏదైనా పనిలో ఉంటే పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ ఇస్తుంటారు. ఇక వారు ఎక్కడికి వెళ్లకుండా, ఇంట్లో నుండి కాలు కదపకుండా ఎప్పుడూ అదే ఫోన్, ట్యాబ్ పట్టుకుని ఆడుతూనే ఉంటారు. పిల్లల ఏడుపును తాత్కాలికంగా ఆపేందుకు తల్లిదండ్రులు పాటించే ఈ చిట్కా ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

3-5 సంవత్సరాల పిల్లలను శాంతింపజేయడానికి స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు వంటి డిజిటల్ డివైస్‌లను ఇవ్వడం వల్ల పిల్లల్లో మానసిక ప్రవర్తనలో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం పాటించే ఈ చిట్కా వల్ల పిల్లల దీర్ఘకాలిక శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి:
ఒక అధ్యయనంలో 422 మంది తల్లిదండ్రులు, 3-5 ఏళ్ల వయస్సు గల 422 మంది పిల్లలు పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఏడుపు ఆపేందుకు, బుజ్జగించేందుకు ఎప్పుడెప్పుడు స్మార్ట్ డివైజెస్ ఇచ్చారో నోట్ చేయాలని చెప్పారు. 6 నెలల వ్యవధిలో భావోద్వేగ రియాక్టివిటీ లేదా డైస్రెగ్యులేషన్ లక్షణలకు అనుబంధాలను విశ్లేషించారు. పిల్లల్లో కోపం, నిరాష విచారం వంటి భావాలకు విపరీతంగా స్పందిస్తున్నట్లు గుర్తించారు.
పిల్లలను శాంతింపజేయడానికి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వడం వల్ల అప్పటికే ఎమోషనల్ కోపింగ్ స్కిల్స్‌తో పోరాడుతున్న పిల్లల్లో అది మరింత సమస్యాత్మకంగా మారుతున్నట్లు గుర్తించారు. అలాగే పిల్లలకు తరచూ స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల వారు వాటికి బానిసలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొదట్లో కొంత సమయం పాటు మాత్రమే చూసే వాళ్లు కాస్త రోజులు గడిచేకొద్దీ విపరీతంగా చూస్తుంటారని తెలిపారు.

స్మార్ట్ ఫోన్లు ఎక్కువ చూస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి:
క్రమరహిత నిద్ర:
స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడిపినప్పుడు, పిల్లలు సమయానికి నిద్రపోవడం మరింత సమస్యాత్మకంగా ఉంటుంది. పెరిగిన స్క్రీన్ సమయం నిద్ర షెడ్యూల్‌ను మార్చివేస్తుంది. అలా పిల్లల నిద్రకు అంతరాయం కలుగుతుంది. నిద్ర నాణ్యతను కూడా క్షీణిస్తుంది. నిద్రలేమి మరింత అలసటకు దారి తీస్తుంది. ఊబకాయం దాని సంబంధిత రుగ్మతలు వస్తాయి.

ఊబకాయం:
పెరిగిన స్క్రీన్ సమయం మీ పిల్లల శరీర బరువుపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని గమనించబడింది. ఎక్కువ స్క్రీన్ సమయం ఉన్న పిల్లలలో ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనికి కారణం పగటిపూట చురుకుదనం లేకపోవడం మరియు అల్పాహారం అలవాటు చేసుకోవడం.

చదువులో వెనకబడిపోతారు:
స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు ఎక్కువగా చూసే పిల్లలు చదువులోనూ వెనకబడిపోతారు. చదువుపై శ్రద్ధ చూపించరు. నేర్చుకోవడంపై ఆసక్తి ఉండదు. పిల్లలు చదివే వయస్సులో వారిని ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు బానిసలను చేయడం వల్ల చదువు అటకెక్కుతుంది.
ఎదుగుతున్న దశలో ఉన్న పిల్లలు వీడియో గేమ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు మరియు టెలివిజన్‌లపై ఎక్కువ సమయం గడిపినట్లయితే, వారు శ్రద్ధ, సామాజిక మరియు భావోద్వేగ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వీడియో గేమ్‌లకు బానిసలైన పిల్లలు చికాకు, మానసిక కల్లోలం మరియు శ్రద్ధకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు.

హింసా ప్రవృత్తి:
సోషల్ మీడియాలో పిల్లలు చూడని కంటెంట్ చాలా చాలా ఉంటుంది. మీడియా, గేమ్‌లు, వీడియోలు మొదలైన వాటి ద్వారా హింసకు గురికావడం వల్ల హింస నుండి పిల్లలను నిరుత్సాహపరుస్తుంది. అందువల్ల, అటువంటి పిల్లలు హింసను సాధారణమైనదిగా పరిగణించడం ప్రారంభిస్తారు. తద్వారా ప్రవర్తనను అంగీకరించడమే కాకుండా వారి ప్రవర్తనకు అనుగుణంగా కూడా దానిని స్వీకరించడం ప్రారంభిస్తారు.



Click it and Unblock the Notifications