Latest Updates
-
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
ప్రసవం తర్వాత మహిళలకు అత్యవసరం అయ్యే విటమిన్స్..
గర్భాధారణ సమయంలో మహిళలు చాలా ఒత్తిడికి గురి అవుతుంటారు. ఆ ప్రభావం ప్రసవం అయిన తర్వాత కూడా అలాగే కొనసాగుతుంది. అందుకే ప్రసవం తర్వాత కూడా కనీసం వారం, పదిహేను రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సలహాలిస్తుంటారు. దాంతో శారీరక శ్రమ లేకుండా, ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, సరైనా పోషకాహారం తీసుకోక పోవడం వల్ల ప్రసవం తర్వాత వారి శరీరంలో అనేక పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఇందా ప్రసవించిన తర్వాత సరైన డైయట్ ప్లాన్ పాటించకపోవడం కారణం చేతనే...
ఏదైతేనేం, మీరు మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల తిరిగి పూర్వ స్థితికి చేరుకోగలరు. ప్రసవం తర్వాత పోస్ట్ నేటల్ విటమిన్స్ మాత్రల రూపంలో కానీ లేదా ఇంజెక్షన్ రూపంలో ఇస్తుంటారు. ఎందుకంటే గర్భధారణ మరియు పిల్లలు పుట్టిన తర్వాత ప్రాథమికంగా మహిళల శరీరంలో విటమిన్ల నిల్వలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా ప్రసవం తర్వాత శిశువుకు పాలు పట్టడం వల్ల కూడా విటమిల్ల లోపం ఏర్పడుతుంది. కాబట్టి ప్రసవం తర్వాత పోస్ట్ నేటల్ విటమిన్స్ మహిళలకు చాలా అవసరం. కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత మహిళకు కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్స్ ఏంటో తెలుసుకుందాం...

1. విటమిన్ బి9: పోస్ట్ నేటల్ విటమిన్ ను ఫోలిక్ ఆసిడ్ అనికూడా పిలుస్తారు. ఈ పోల్లెట్ (టాబ్లెట్) నుగర్భం ధరించినప్పటి నుండి ప్రసవం పూర్తి అయ్యే వరకూ కూడా తీసుకుంటారు. ఎందుకంటే శిశువు నాడీవ్యవస్థ క్రమంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా అవసరం. కాబట్టి ఈ విటమిన్ సప్లిమెంట్ ను ప్రసవం అయిన తర్వాత కూడా కొద్దిరోజులు కొనసాగించడం తల్లి, బిడ్డకు ఇద్దరీ క్షేమం.
2. విటమిన్ ఎ: గర్భిణీ స్త్రీ ప్రసవం తర్వాత జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. అలాగే పోస్ట్ నేటల్ సమయంలో ఎక్కువ ఒత్తిడికి గురిఅవుతుండం వల్ల కూడా జుట్టు అధికంగా రాలిపోతుంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మ సంరక్షణకు విటమిన్ ఎ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకు ప్రసవం తర్వాత కూడా విటమిన్ ఎ తీసుకోవండ చాలా అవసరం.
3. విటమిన్ సి: ప్రసవించిన మహిళలకు సిట్రస్ పండ్లు చాలా ఉపయోగకరం. సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి మరియు ఎసెన్సియల్స్ పాలిచ్చే తల్లులకు చాలా అవసరం. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ప్రసవించిన తల్లులకు విటమిన్ సి అత్యవసరం. తల్లి ద్వారా పిల్లలకు కూడా ఆరోగ్యంకరం.
4. విటమిన్ డి: గర్భం దరించిన తర్వాత మరియు ప్రసవం తర్వాత మహిళలు తిరిగి శక్తిని పొందడానికి, నరాలు, ఎముకలు బలపడటానికి క్యాల్షియం చాలా అవసరం. ప్రసవం తర్వత మహిళల్లో చాలా వరకూ క్యాల్షియం తగ్గిపోతుంది కాబట్టి శరీరానికి కాల్షియం చాలా అవసరం. కాబట్టి శరీరానికి కావల్సిన క్యాల్షియం పొందడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ డి వల్ల క్యాల్షియం లభించదు. అయితే విటమిన్ డి క్యాప్యూల్స్ తీసుకోవడం వల్ల ఆ కొరతను తగ్గించుకోవచ్చు.
5. విటమిన్ ఇ: ఈ విటమిన్ మహిళలకు చాలా అవసరం. విటమిన్ ఇ లో ఉండే యాంటిఆక్సిడెంట్స్ చాలా బాగా సహాయపడుతాయి. సెల్ డ్యామేజ్ ను తిరిగి పునరుత్పత్తి చేస్తుంది. శరీరంలోని విషాలను బయటికు నెట్టివేయబడుతుంది. కాబట్టి ప్రసవం తర్వాత పోస్ట్ నేటల్ విటమిన్ తీసుకోవడంతో పాటు అదనంగా తీసుకోవడం కోసం మీ డాక్టర్ ను సంప్రదించాలి.



Click it and Unblock the Notifications
