For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండవ గర్భధారణకు రెడీ అవండి!

By B N Sharma
|

Preparing First Child For Second Pregnancy
రెండో సారి గర్భం ధరించటంలో మొదటి గర్భధారణ అంత సులువైన పరిస్ధితులు కుటుంబంలో వుండవు. అయితే, కొంతమంది విషయంలో రెండో గర్భధారణే మొదటిదానికంటే కూడా తేలికవుతుంది. ఎందుకంటే, మొదటి సారి అనుభవాలతో కొంత సంసిద్ధంగా వుంటారు. అయితే, ఒక్క అంశంలో మాత్రం రెండవసారి గర్భధారణ కష్టమని చెప్పాలి. ఆ ఒక్క అంశం ఏమంటే మొదటి బేబీని రెండవ గర్భధారణ పరిస్ధితులకు అలవాటు చేయడం. ఇది అటు తల్లి తండ్రులకు ఇటు మొదటి బేబీకి కూడా సమస్యగానే వుంటుంది.

రెండో సారి పుట్టబోయే బిడ్డకు మొదటి బేబీ నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవి ఏమిటి? వాటిని ఎలా పరిష్కరించాలి అనేది పరిశీలిస్తే.....

1. మొదటి బేబీకి ముందుగా వారికి అర్ధమయేట్లు కొంత వివరించండి. బేబీ వీలైనంతవరకు ఇంట్లో తనకు మరో తోడు రాబోతోందన్న విషయం వీలైనంతవరకు మీరే తెలియజెప్పాలి. అది కూడా బేబీ మంచి మూడ్ లో మీతో ఆడుకుంటున్నపుడు వివరించాలి. మొదటగా బేబీ మరొకరు ఇంట్లోకి వస్తున్నారంటే కొంత విస్మయానికి గురవచ్చు. కాని అలవాటు పడేలా చేయాలి. రెండో బేబీ గర్భధారణకు మీరు మానసికంగా ఎంత సంసిద్ధులయారో మీ మొదటి బేబీ సైతం అదే రకంగా సంసిద్ధం కావాలి. మీ గర్భధారణ సమయంలో మీ మొదటి బేబీ మీలో శారీరకంగాను, మానసికంగాను వచ్చే మార్పుల్ని గమనిస్తూంటుంది. కనుక ఈ విషయం ఆమెకు రహస్యంగా వుంచటానికి వీలు లేదు.

2. త్వరలో పుట్టబోయే రెండో బేబీ కి మొదటి బేబీకి గల అనుబంధాలను మొదటి బేబీకి వివరించి ఆమె ఇష్టపడుతూండేలా చేయాలి. దీనికిగాను పుట్టబోయే బిడ్డకు ఒక కల్పిత పేరు పెట్టి మొదటి బేబీ ఆ పేరుగల రెండో బేబీతో మాట్లాడుతున్నట్లు, ఆటపాటలు సాగిస్తున్నట్లు ఒక మంచి ఊహా చిత్రాన్ని అందించాలి. ఈ చర్య తప్పక ఒక చక్కటి అనుబందాన్ని ఏర్పరుస్తుంది. రెండో బేబీ పుట్టిన వెంటనే మొదటి బేబీ అప్పటికే రెండవ బేబీతో అనుబంధాన్ని ఏర్పరచుకుని వుంటుంది. ఇక కుటుంబ సభ్యులలో మొదటి బేబీ భాధ్యతగా రెండవ బేబీని ఎలా చూడాలనేది ఆమెకు వివరించాలి.

3. మొదటి బేబీ కుటుంబంలో తనకు రెండో స్ధానం వచ్చేస్తోందన్న భావన కలిగి కొంత అసూయకు కూడా గురయ్యే అవకాశం వుంది. అసూయ సహజమని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మొదటగా మీరు అవగాహన పొందాలి. ఇంతకాలం మీకుగల ప్రేమనంతా మొదటి బేబీ తీసుకుంది. ఇకపై ఆ ప్రేమ ఇద్ధరి పిల్లల మధ్య విభజించబడాలి. కనుక ఎంతో కొంత సమస్యగానే వుంటుంది. ప్రెగ్నన్సీ భారంతో మీరు మొదటి బేబీతో గతంలో వలే ఆటపాటలు సాగించలేరు కూడాను. ఇంకా నెలలు నిండితే, మొదటి బిడ్డను ఎత్తుకోలేరు. ఇక ఈ సమయంలో మొదటి బేబీ నిజంగానే కలవరం చెందే అవకాశం వుంది.

రెండో బేబీ మీ శరీర భాగంలో ఏ రకంగా ఒక భాగమో, ఆమె లేదా అతనికి కూడా అట్లే నని వివరించండి. రెండో బేబీ పుడితే ఆడుకోడానికి ఆమెకు ఒక మంచి తోడు దొరుకుతుందని బయటవారిని పిలువనవసరంలేదని ఆమెకు చెప్పండి. మొదటి బేబీ పూర్తిగా విశ్వసించి అనుకూలం అయేటప్పటికి మీరు రెండవ సారి డెలివరీకి సిద్ధం అవండి.

English summary

Preparing First Child For Second Pregnancy | రెండవ గర్భధారణకు రెడీ అవండి!

The second child pregnancy is inherently different from the first one. In some aspects second baby pregnancy is much easier than the first one. You already know what to expect and are mentally prepared for the discomforts. But in one regard the second child pregnancy is much more difficult than the first; preparing the first child for the second pregnancy.
Story first published:Wednesday, August 17, 2011, 10:33 [IST]
Desktop Bottom Promotion