For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో ఎదురయ్యే 14 సమస్యలు

|

గర్భంతో ఉన్నప్పుడు తల్లి మరియు ఇంకా పుట్టని శిశువుయొక్క ఆరోగ్యానికి శ్రద్ధ చూపించటం చాలా అవసరం. అనేక గర్భాలు క్లిష్టతరం కాకుండానే ఉంటాయి ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మరియు మన జీవనశైలి సాధారణంగ ఉంటాయి. ఇక్కడ మేము ఈరోజుల్లో స్త్రీల్లు గర్భధారణ సమయంలో ఎదుర్కునే సమస్యలు కొన్నింటిని పొందుపరుస్తున్నాము. ఒకవేళ, మీరు గర్భధారణ సమయంలో వీటిలో ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ గైనకాలజిస్ట్ సంప్రదించినట్లయితే, మీకు సరిఅయిన సలహా సూచిస్తారు.

గర్భధారణ స్త్రీలకు సమస్యలు ఉన్నట్లయితే మానసికంగా వాటిని అధిగమించటానికి ధైర్యంగా ఉండాలి. మీ వెనకాల మీ కుటుంబం మానసికంగా, వ్యక్తిగతంగా మీకు తోడుగా ఉన్నదని మర్చిపోవోద్దు. గర్భధారణ సమయంలో సమస్యలు ఎదుర్కోవటం అన్నది తల్లికి మరియు శిశువుకు కూడా ప్రమాదకరం. అందువలన ఈ సమయంలో సరైన జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండ డాక్టర్ చేత పరీక్షలు చేయించుకోవటం అనేది మీ మరియు ఇంకా పుట్టని శిశువు ఆరోగ్యానికి తప్పనిసరి.

గర్భధారణ సమయంలో సమస్యలను ఒకసారి చూడండి. మీరు వీటిలో ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఆ అనుభవాన్ని మాతో పంచుకోండి.

రక్తస్రావం:

రక్తస్రావం:

ఈ సమయంలో రక్తస్రావం జరగటానికి అనేక కారణాలు ఉండవొచ్చు. బహిష్ఠు సమయంలో లాగా రక్తస్రావం ఎక్కువగా అవుతున్నట్లయితే మరియు తీవ్రమైన కడుపు నొప్పి ఉన్నట్లయితే, అది ఎక్టోపిక్ గర్భం యొక్క గుర్తు అయిఉండవొచ్చు. నొప్పితోకూడిన అధికమైన రక్తస్రావం అవుతున్నట్లయితే, అది గర్భస్రావానికి గుర్తు అవొచ్చు.

కడుపులో తిప్పటం:

కడుపులో తిప్పటం:

ఇవి గర్భధారణ సమయంలో ఒక సామాన్య లక్షణం. కాని తిప్పటం మరియు వాంతులు ఎక్కువగా ఉన్నట్లయితే, తీవ్రమైన సమస్యగా పరిగణించవొచ్చు. మీరు ఏమి తినటం మరియు త్రాగటం చేయలేకపోతున్నట్లయితే, మీరు నిర్జలీకరణ అయ్యే ప్రమాదం ఉన్నది,కనుక గైనకాలజిస్ట్ వొద్ద సలహా తీసుకోవటం తప్పనిసరి.

శిశువు కదలికలు:

శిశువు కదలికలు:

తక్కువ బలంతో ఉన్నా శిశువు చురుగ్గా ఉండటం సాధారణ విషయం. కాని, శిశివు కదలిక లేకుండఉన్నట్లయితే అప్పుడు మీరు కంగారుపడాలి. రెండు గంటల్లో కడుపులో శిశువు 10-15 సార్లు తంతాడని అంటారు. దీనికన్నా తక్కువ కదలికలు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్ కు ఫోన్ చేయండి.

కాంట్రాక్షన్స్:

కాంట్రాక్షన్స్:

మీకు సమయం కాకముందే నొప్పులు ఉంటే, అవి సాధారణంగా నొప్పులు కావు. ఎదిఎమైనప్పటికి ఇవి ఎక్కువగా ఉంటే నిజమైనవాటికి మరియు కానివాటికి తేడా తెలియదు. మీకు మూడవ మాసంలోనే ఈ విధమైన స్థితి ఉంది,నొప్పులు వొస్తుంటే, మీరు డాక్టర్ ను సంప్రదించి సలహా పాటించటం మంచిది.

ఫ్లూ:

ఫ్లూ:

గర్భిణీ స్త్రీలు ఎదుర్కునే సమస్యలలో ఫ్లూ సాధారణమైన సమస్య. గర్భిణీ స్త్రీలు ఫ్లూ వాక్సిన్ వేయించుకోవటం తప్పనిసరి,లేదంటే తరచుగా దీని బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

రక్త పీడనం:

రక్త పీడనం:

ఇది కూడా గర్భిణీ స్త్రీలు ఎదుర్కునే సమస్యలలో ఒకటి. గర్భిణీ స్త్రీలలో రక్తపీడనం ఎక్కువగా ఉన్నట్లయితే, కడుపులో శిశువుకి ప్రమాదం. రక్తపీడనం ఎక్కువగా ఉన్న గర్భవతుల మావి ప్రసవానికి ప్రమాదంగా ఉంటుంది.(మాయ గర్భాశయం యొక్క గోడను నుండి వేరు ఉన్నప్పుడు)

పార్శ్వపు నొప్పి:

పార్శ్వపు నొప్పి:

గర్భవతులలో కానీ, మామూలు స్థితిలో ఉండనీ; ఏదిఏమైనా ఈ మైగ్రెయిన్ చాలా బాధాకరం. కాని ఈ సమస్య గర్భవతి ఎదుర్కున్నప్పుడు, అది ఆ స్త్రీకి కాని మరియు శిశువుకి కూడా మంచిది కాదు. ఈ భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్న గర్భవతి డాక్టర్ ను వెంటనే సంప్రదించి, చికిత్స తీసుకోవటం మంచిది.

ఫైబ్రాయిడ్లు:

ఫైబ్రాయిడ్లు:

ఇవి గర్భిణీ స్త్రీలలో సర్వసామాన్యం. అయితే, గర్భాశయంలోని కంతులు చాలా అరుదుగా గర్భస్రావం కారణం అవుతాయి. కానీ, అరుదైన సందర్భాల్లో ఫైబ్రాయిడ్లు శిశువు ఎదురుకాళ్ళతో పుట్టటానికి లేదా ముందుగా జన్మించాతానికి కారణం కావచ్చు.

మూర్ఛ

మూర్ఛ

గర్భవతి మూర్ఛలవలన, కడుపులో పిండానికి హాని జరగవొచ్చు మరియు నిర్జీవ శిశువు జననం కావొచ్చు. ఒక వైపు,ఆకస్మిక మూర్ఛ నియంత్రణకు వినియోగించే మందులు కూడా పుట్టుక లోపాలు కారణం కావచ్చు.

డిప్రెషన్:

డిప్రెషన్:

గర్భధారణ సమయంలో గనుక డిప్రెషన్ ఉంటే, ఆ మహిళకు తన గురించికాని మరియు తన పుట్టబోయే బిడ్డ కోసం కాని ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదు. గర్భధారణ సమయంలో డిప్రెషన్ కలిగిఉంటే, ఆ మహిళకు ప్రసవానంతరం కూడా ప్రమాదకరంగా ఉంటుంది.

మధుమేహ వ్యాధి:

మధుమేహ వ్యాధి:

గర్భవతిగా ఉన్నప్పుడు ఎదుర్కునే సమస్యలలో ఈ వ్యాధి కూడా ముఖ్యమైనదే. స్త్రీలు గర్భధారణ వహించాలి అనుకున్నప్పుడు, ఆ ప్రయత్నానికి కనీసం మూడు నుండి ఆరు నెలల ముందు నుండి ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి.

ఉబ్బసం:

ఉబ్బసం:

గర్భవతిగా ఉన్నప్పుడు ఎదుర్కునే సమస్యలలో ఇది కూడా ముఖ్యమైనదే. దీనిని సరిగ్గా నియంత్రించకపోతే ముందుగానే పురిటినొప్పులు రావటం మరియు పిండం సరిగా బరువు పెరగకపోవటం వంటివి జరుగుతాయి.

ఈటింగ్ డిజార్డర్స్:

ఈటింగ్ డిజార్డర్స్:

గర్భధారణ సమయంలో శరీర ఆకృతిలో మార్పులు రావటం ఈటింగ్ డిజార్డర్స్ కు కారణం కావొచ్చు. దీనివలన పుట్టుక లోపాలు మరియు సమయానికి ముందే శిశు జననం వంటి అనేక గర్భధారణ సమస్యలు రావొచ్చు.

అధికబరువు:

అధికబరువు:

అధిబరువు ఉన్న మహిళలలో ఎక్కువగా ఈ గర్భధారణ సమస్యలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెపుతున్నారు. గర్భధారణ సమయంలో ఊబకాయం ఉన్న మహిళలు ముందుగానే శిశువుకు జననం ఇవ్వటం మరియు ఎక్లంప్సియా వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవటానికి అవకాశం ఉన్నది.

English summary

14 Complications During Pregnancy

Pregnancy is a time when the mother and unborn child need to pay close attention to their health. Most pregnancies are uncomplicated because of the food we eat and the lifestyle we normally tend to lead.
Story first published: Tuesday, September 10, 2013, 10:47 [IST]
Desktop Bottom Promotion