For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాయ్ బేబీ కావాలంటే వేటి మీద కోరికలు ఎక్కువగా ఉంటాయో తెలుసా..?

|

గర్భధారణ సమయంలో ఆహారం మీద కోరికలుండటం చాలా సహజం. అయితే ఆహారం మీద కోరికలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. కొంత మంది గర్భిణీ స్త్రీలు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడితే, మరికొందరు సాల్ట్ ఫుడ్స్ ఇష్టపుడుతారు. మరికొందరు పులుపును ఇష్టపుడుతారు, ఇంకొందరమో చేదును ఇష్టపడుతుంటారు. ఇలా ఒక్కోరికి ఒక్కో టేస్ట్ ను కోరుకుంటారు. మరియు కొంత మంది గర్భిణీ స్త్రీలకు ఆకలి ఎక్కువగా విచిత్రమైన ఆహారాల మీద కోరికలు కలిగి ఉంటారు. మీకో విషయం తెలుసా? గర్భిణీ స్త్రీలలో కలిగే ఆహారపు కోరికల బట్టి, పుట్టే బిడ్డే ఆడ లేదా మగ అనికూడా నిర్ధారిస్తారట...

సాధారణంగా గర్భం పొందిన ప్రతి ఒక్క స్త్రీ మదిలో మెదిలేది, పొట్టలో బాయ్ లేదా గర్ల్ బేబీనా అని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. అయితే, మన ఇండియాలో అటువంటి సౌకర్యం కల్పించలేదు. బేబీ పుట్టే వరకూ బాయ్ లేదా గర్ల్ అని తెలుసుకోవడానికి చట్టపరంగా అంగీకారం లేదు.

కానీ, గర్భిణీ స్త్రీలో కలిగే కోరికలను బట్టి, పుట్టబోయేది బాయ్ లేదా గర్ల్ బేబీనా అని అంచనా వేయవచ్చు అంటున్నారు. అయితే, అందుకు సైంటిఫిక్ ఆధారాలేవీ లేవని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది పూర్తిగా గర్భిణీల యొక్క కోరికల మీద ఆధరాపడి నిర్ణయించినది మాత్రమే అని గ్రహించాలి.

అయితే, కొందరు మహిళలు గర్భధారణ ఇది ఒక అపోహ మాత్రమే అని పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఎక్కువ మంది ఉత్సుకతతో పొట్టలో గర్ల్ లేదా బాయ్ అని రహస్యంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నించేటప్పుడు చాలా ప్రాక్టికల్ గా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఎటువంటి భావోద్రేకాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి . మరి అలా క్యూరియాసిటి ఉన్న గర్భిణీ స్త్రీలలో మీరు కూడా ఒకరైతే, మీ పొట్టలో బాయ్ బేబీ అని తెలుసుకోవానుకుంటే కోరికలు ఎలా ఉంటాయని ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది...

పుల్లని ఆహారాలు:

పుల్లని ఆహారాలు:

గర్భిణీ స్త్రీలో ఎక్కువగా పుల్లని ఆహారా పదార్థాల మీద కోరికలు ఎక్కువగా ఉన్నట్లైతే , బాయ్ బేబీ పుట్టే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. మీకు ఎటువంటి కోరికలు లేవని మీరు భావిస్తున్నట్లైతే మీరు తీసుకొనే ఆహారాలను గ్రహించాలి. దాంతో మీకు వాటి మీద నిజంగా కోరికలున్నాయా లేదా అని తెలుసుకోవచ్చు.

ఉప్పు:

ఉప్పు:

స్వీట్స్ మీద ఎక్కువ కోరికలున్నప్పుడు గర్ల్ బేబీ అని అంచనా వేస్తారు, అదే సాల్ట్ ఫుడ్స్ మీద ఎక్కువ కోరికలను కలిగి ఉన్నట్లైతే బాయ్ బేబీ పుట్టే అవకాశం ఉందని అంచనా వేస్తుంటారు. మరి మీ గర్భధారణ కాలంలో ఎక్కువ సాల్ట్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటే బేబీ పుట్టే వరకూ వేచి చూడాల్సిందే...

స్పైసీ ఫుడ్స్ :

స్పైసీ ఫుడ్స్ :

సహజంగా గర్భధారణ కాలంలో కారం తినే మహిళలు మరింత స్పైసీగా ఉండే ఆహారాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే, మరి మీరు బాయ్ బేబీని క్యారీ చేస్తున్నారని గ్రహించాలి. చాలా మంది మహిళలు వారు గర్భంతో ఉన్నప్పుడు స్పైసీ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడే వారని అందుకే బాయ్ బేబీ పుట్టారని చెబుతుంటారు.

నిమ్మ:

నిమ్మ:

నిమ్మరసం నేరుగా తీసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా బాయ్ బేబీని ఎక్స్ పెక్ట్ చేయవచ్చని మరికొందరు అంటున్నారు. ముఖ్యంగా గతంలో నిమ్మరసం మీద మీకు అంత కోరిక లేకుండా, గర్భం ధరించిన తర్వాత నిమ్మరసంతో తయారుచేసి వంటల మీద ఎక్కువ కోరికలున్నట్లైతే ఇది ఒక సూచనగా భావిస్తున్నారు. ఇది కేవలం గర్భంతో ఉండి అబ్బాయిలను కన్న తల్లు ద్వారా గ్రహించిన సమాచారం మాత్రమే.

మాంసాహారం:

మాంసాహారం:

మీ ప్రెగ్నెన్సీ డైట్ లో ఎక్కువగా మాంసాహారాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లైతే ఖచ్చితంగా బేబీబాయ్ అని అంచనా వేయవచ్చు. గర్భం ధరించడానికి ముందు అంతగా తినని వారు కూడా, గర్భం పొందిన తర్వాత ఎక్కువగా మాంసాహారాల మీద ఎక్కువ ఇష్టం చూపిస్తే వారిలో బాయ్ బేబీ ఉన్నట్లు బావిస్తున్నారు.

ఊరగాయలు:

ఊరగాయలు:

ఊరగాయలను ఎక్కువగా ఇష్టపడే గర్భిణీ స్త్రీలు వారికి పుట్టబోయే బిడ్డ అబ్బాయిగా ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. అందుకు కారణం ఊరగాయల్లో వేసి ఉప్పు, కారం వల్ల ఈ కోరికలు వారిలో ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు

ఆరెంజ్:

ఆరెంజ్:

మీరు చాలా వరకూ సిట్రస్ పండ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లైతే బేబీ బాయ్ ను క్యారీ చేస్తున్నట్లు గ్రహించాలి. దీనికి కూడా ఎటువంటి సైంటిఫిక్ కారణాలు లేవు . చాలా మంది మహిళలు వారి అనుభవాల ద్వార పంచుకొన్న విషయాలనే ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరి బాయ్ బేబీ ఎక్స్ పెక్ట్ చేసేవారికి ఇవి ఒక సూచన ప్రాయం మాత్రమే . వీటికి ఎటువంటి సైంటిఫిక్ కారణాలు లేవు.

English summary

Pregnancy food cravings Boys VS Girls

Food cravings are pretty normal during pregnancy. The choices differ from person to person. Some prefer sweet, while others love salt. Some crave sour, while others need bitter. And, it is true that some women even have weird pregnancy cravings as well. But, do you know that your pregnancy cravings have something to tell about your baby’s gender?
Story first published: Thursday, November 27, 2014, 18:49 [IST]
Desktop Bottom Promotion