For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భదారణ సమయంలో గర్భిణీ కొరకు టాప్ 10 హెల్తీ స్నాక్స్

|

సాధారణంగా మహిళలు గర్బం పొందిన తర్వాత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కు తీసుకొనే ఆహారంతో పాటు మద్యమద్యలో తీసుకొనే స్నాక్స్ కూడా చాలా ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. మహిళ మొత్తం గర్భధారణ కాలంలో తీసుకొనే ఆహారం పొట్టలో పెరిగే శిశువు యొక్క ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉన్నది. మహిళ గర్భం పొందిన తర్వాత, శిశువుకు హాని కలిగించే ఆల్కహాల్, బెవరేజస్ మరియు ఇతర ఆహారాలకు దూరంగా ఉండాలని డాక్టర్స్ సలహాలిస్తుంటారు. ఇక చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, మరియు సాఫ్ట్ డ్రింక్స్ మరియు ఇతర స్నాక్స్ మాటేంటి అంటారా? ఇవి గర్భిణీలకు మరియు పొట్టలో పెరిగే శిశువుకు సురక్షితమా కాదా? అనేదేగా మీ సందేహం?ఇలాంటి ఆహారాలను పరిమితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు.

గర్భధారణ సమయంలో బ్రేక్ ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ కే పరిమితం కాకుడదు. అప్పుడప్పుడు హెల్తీ ప్రెగ్నెన్సీ స్నాక్స్ ను కూడా తీసుకోవడం వల్ల బేబీ హెల్తీ సహాయపడే న్యూట్రీషియన్స్ ను అందివ్వడంలో సహాయపడుతుంది. గర్భిణీ డైట్ ప్లాన్ లో హెల్తీ స్నాక్స్ ను తీసుకోవడం వల్ల బేబీ ఆరోగ్యానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు ఎనర్జీ అందివ్వవచ్చు. ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ డైట్ ను అనుసరించడానికి, తరచూ తక్కువ మోతాదులో ఆహారంను తీసుకుంటుండాలి. ఒకే సారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి బదులుగా, రోజులో నాలుగైదు సార్లు, మితాహారాన్ని తీసుకోవడం ఇటు తల్లి, అటు శిశువు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది చాలా ఎఫెక్టిగా పనిచేస్తుందని నిర్ధారించబడినది. మరి గర్భాధారణ కాలంలో గర్భిణీ స్త్రీలకు అవసరం అయ్యే ప్రెగ్నెన్సీ స్నాక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

అధిక ఫైబర్ ఉన్న సెరల్స్

అధిక ఫైబర్ ఉన్న సెరల్స్

సెరల్స్ లో మనకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ తో నిండి ఉంటాయి. కాబట్టి, వీటిని సింపుల్ స్నాక్స్ గా తీసుకోవచ్చు . ఎప్పుడైతే మీరు సెరల్స్ ను కొనుగోలు చేయాలనుకుంటారో, అప్పుడు అధిక ఫైబర్ ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి . చికెన్ కు ప్రత్యామ్నాయంగా సెరెల్స్ తీసుకోవడం వల్ల తల్లికి మరియు బిడ్డకు అవసరం అయ్యే క్యాల్షియంను అందివ్వవచ్చు. విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే సెరెల్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

స్మూతీస్

స్మూతీస్

మరో హెల్తీ ప్రెగ్నెన్సీ డైట్ స్మూతీస్. దీన్ని పండ్లు మరియు పెరుగుతో తయారుచేసుకోవచ్చు . దీన్ని మీరు మీ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు . నాన్ ఫ్యాట్ పెరుగు మరియు మీకు నచ్చిన పండ్లతోటి స్మూతీస్ ను తయారుచేసుకోవాలి. ఇది ఖచ్చితంగా హెల్తీ ప్రెగ్నెన్సీ స్నాక్. ఎందుకంటే గర్భిణీ స్త్రీకి అవసరం అయ్యే ప్రోటీన్, క్యాల్షియం, మరియు ఇతర న్యూట్రీషియన్స్ ను కలిగి ఉన్నది.

స్వీట్ పొటాటో చిప్స్

స్వీట్ పొటాటో చిప్స్

మీకు ఎప్పుడైనా క్రంచీ స్టఫ్ ను తీనాలని కోరిక కలిగినప్పుడు, బంగాలదుంపను స్లైస్ గా కట్ చేసి, వాటి మీద కొద్దిగా దాల్చిన చెక్క మరియు పంచదార చిలకరించి 250డిగ్రీల్లో ఒక గంట పాటు వాటిని బేక్ చేయాలి. రెగ్యులర్ చిప్స్ తో పోల్చితే హోం మేడ్ పొటాటో చిప్స్ లో సోడియం మరియు ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది.

మామిడి ముక్కలు

మామిడి ముక్కలు

మామిడిపండులో 100క్యాలరీలు కలిగి ఉంటాయి కాబట్టి, స్వీట్స్ కు బదులుగా మామిడిపండ్లను తీసుకోవాలి. దీన్ని హెల్తీ ప్రెగ్నెన్సీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది 3గ్రాముల ఫైబర్ మరియు విటమిన్ సి ని అంధిస్తుంది.

శాండ్విచ్

శాండ్విచ్

మీరు మీ ఇంట్లో సాండ్విచ్ తయారుచేయాలని కోరుకున్నప్పుడు. వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రైన్ లేదా మల్టీ గ్రైయిన్ బ్రెడ్ ను ఉపయోగించాలి . కీరదోస, ముల్లంగి, బంగాళదుంప లేదా టమోటో మరియు ఉల్లిపాయను శాండ్విచ్ తయారుచేయడానికి ఉపయోగించాలి. ఇంకా మీరు చీజ్ మరియు చికెన్ ప్యాటీ రెడీ చేసి బ్రైడ్ స్లై మద్య ఉంచి సర్వ్ చేయాలి.

వాటర్ మెలోన్

వాటర్ మెలోన్

వేసవికాలంలో ఇది ఒక ఫర్ఫెక్ట్ ట్రీట్. లోఫ్యాట్ వెనీలా పెరుగు, బెర్రీస్, అరటిపండ్లు మరియు ద్రాక్ష వంటి ఫ్రూట్స్ ను కూడా జోడించుకోవచ్చు. ఇంకా వీటి మీద నట్స్ బాదం లేదా వాల్ నట్స్ చల్లి తీసుకోవడం వల్ల ఇది ఒక ఫర్ఫెక్ట్ హెల్తీ ప్రెగ్నెన్సీ డైట్ అవుతుంది. వీటిలో ఎలాంటి క్యాలరీలు, ఫ్యాట్ మరియు షుగర్స్ కలిగి ఉండవు.

హార్డ్ బాయిల్డ్ ఎగ్స్

హార్డ్ బాయిల్డ్ ఎగ్స్

ఇది పూర్తిగా హైప్రోటీన్ ఫుడ్. హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ ఫర్ఫెక్ట్ స్నాక్. ఈ స్నాక్ శిశువు యొక్క మెదడు డెవలప్ మెంట్ కు మరియు నరాలా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనది.

బాదం

బాదం

బాదంను పచ్చిగా అలాగే తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే మీరు వాటి యొక్క రియల్ ఫ్లేవర్ ను మరియు టేస్ట్ ను ఆశ్వాదించాలంటే, మీరు బాదంను ఓవెన్ లో టోస్ట్ చేయాలి . ఈ స్నాక్ లో ఫైబర్, ప్రోటీన్స్, మరియు మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి.

అరటిపండ్లు

అరటిపండ్లు

ఇతర పండ్లుతో పోల్చినప్పుడు ఎక్కువ షుగర్స్ ఉన్న పండు ఇది. అరటిపండ్లు తినడం వల్ల గర్భిణీ శరీరానికి అవసరం అయ్యే ఫైబర్, విటమిన్ సి, మరియు పొటాషియం సరిపడా అందిస్తుంది.

క్రాకర్స్

క్రాకర్స్

మల్టీ గ్రెయిన్ క్రాకర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు కొనాలనుకొన్నప్పుడు, చీజ్ తో తయారుచేసి క్రాకర్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్, క్యాల్షియం మరియు ప్రోటీన్స్ తో నిండి ఉంటాయి కాబట్టి, గర్భిణీకి, అదే విధంగా బేబీకి ఆరోగ్యకరం.

English summary

10 Healthy Pregnancy Snacks

During pregnancy having your healthy pregnancy snacks on time is a good choice. Throughout your pregnancy, you would hear a lot about the importance of a balanced diet and wholesome meal, which are essential for your baby’s best possible health.
Story first published: Friday, February 6, 2015, 15:55 [IST]
Desktop Bottom Promotion