Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
ప్రెగ్నెన్సీ సమయంలో కర్జూరాలతో పొందే గ్రేట్ బెన్ఫిట్స్
గర్భం దాల్చిన తర్వాత మొదట్లో వాంతులు, సిక్ నెస్, నాసీ ఫీలింగ్ ఇబ్బంది పెట్టినా.. తర్వాత ఎక్కువ ఆకలి ఉంటుంది. ఏవేవో తినాలనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్. అయితే ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలి.
గర్భధారణ సమయంలో డేట్స్ తీసుకోవడం చాలా అవసరం. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో డేట్స్ తీసుకోవాల్సిన అవసరం గురించి తెలుసుకోవాలి. గర్భధారణ సమయంలో కర్జూరాలు తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
డేట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో లో ఫ్యాట్, మంచి పోషకవిలువలు ఉంటాయి. అలాగే వీటిల్లో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి.. నెర్వస్ సిస్టమ్ పనితీరుకి సహాయపడుతుంది. కాబట్టి కర్జూరాలను డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీటిని కంపల్సరీ తీసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి.

పొటాషియం
శరీరంలో అత్యంత ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ లో పొటాషియం ఒకటి. ఇది బ్లడ్ ప్రెజర్ సజావుగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో నీటి శాతాన్ని సంమతులం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థ పనితీరుకి సహాయపడుతుంది.

ఫైబర్
హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ కి ఫైబర్ చాలా అవసరం. గర్భిణీల్లో ఎక్కువగా.. మలబద్ధకం సమస్య కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కర్జూరాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ పొందవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంటువ్యాధులు నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

ఫోలేట్:
డేట్స్ లలో ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఫోలేట్ కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. రక్తహీనతను నిరోధిస్తుంది. అలాగే పుట్టుకతో లోపాలు నిరోధిస్తుంది. మెదడు, బాహ్య కారకాల నుంచి గర్భస్థ శిశువు వెన్నుముక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

విటమిన్ కె
విటమిన్ K రక్తం గడ్డ కట్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. విటమిన్ కె గర్భధారణ సమయంలో చాలా అవసరం. గర్భంలోని శిశువు ఎముకల బలానికి, ఏర్పాటుకు సహకరిస్తుంది.

ప్రోటీన్స్:
డేట్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రోటీన్లలో ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అవి శరీర నిర్మాణానికి సహాయపడతాయి. కాబట్టి శరీరానికి ప్రోటీన్లు తగినంత మొత్తంలో అందించడం ద్వారా పిండం పెరుగుదలకు సహాయపడుతుంది.

ఎనర్జీ
ప్రెగ్నెన్సీ సమయంలో.. శరీరానికి చాలా ఎనర్జీ అవసరం. త్వరగా ఎనర్జీ అందించడానికి షుగర్ సహాయపడుతుంది. అయితే.. షుగర్ కార్వింగ్స్ అంత మంచిది కాదు. కాబట్టి కర్జూరాల ద్వారా హెల్తీ షుగర్స్ పొందవచ్చు.

ఐరన్
మెటబాలిక్ ప్రాసెస్ కి ఐరన్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఐరన్ ద్వారా ఆక్సిజన్ అన్ని కణాలకు అందుతుంది. గర్భధారణ సమయంలో ఐరన్ చాలా అవసరం. అలాగే బిడ్డలో అనీమియా నిరోధించి, ఇమ్యునిటీ పెంచడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
