Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
గర్భిణీల్లో న్యూట్రీషియన్స్ లోపం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ..!!
గర్భవతులుగా ఉన్నప్పుడు సరైన ఆహారాన్ని తీసుకోని తల్లులకి పుట్టిన పిల్లలలో గుండెకి త్వరగా వృద్ధాప్యం వాస్తుందని పరిశోధనలో నిరూపించబడింది.
గర్భవతులు తాము తీసుకునే ఆహారాన్ని కాస్త తాగించినా కానీ పుట్టే పిల్లల అవయవాలు వ్యాధులకి గురయ్యే ఆస్కారం ఉందని, వారిలో వృద్ధాప్యం కూడా త్వరగా వస్తుందనీ ఈ పరిశోధన తెలుపుతోంది.

దీనివల్ల హృదయ సంబంధ అనారోగ్యం దరి చేరుతుంది, వ్యాయామం చెయ్యలేరు మరియూ హై బీపీ, మధుమేహం లాంటి ఇతర అనారోగ్యాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది.ఈ రెండు వ్యాధులూ హార్ట్ స్ట్రోక్‌కి కారణం అవుతాయి.తల్లులలో పోషకాహర లోపం వల్ల పిల్లలలో వచ్చే ఈ సమస్యలు అర్ధమయితే ముందరే జాగ్రత్త పడే అవకాశం ఉందని అమెరికాలోని తెక్సాస్ రాష్ట్రంలో ఉన్న జెఫ్రీ క్లార్క్ యూనివర్సిటీ తెలియచేస్తోంది.

ఈ పరిశొధనకోసం ఆడా మరియూ మగ బబూన్ల గుండెలని పరిశీలించారు.దీనికోసం ఎంచుకున్న బబూన్ల తల్లులు మామూలు బబూన్ల కంటే 30 శాతం తక్కువ ఆహారం తీసుకున్నాయి.

తక్కువ ఆహారం తీసుకున్న తల్లులలకి పుట్టిన బబూన్లలో వయసు పెరిగే కొద్దీ గుండె పనితీరు తగ్గుతోందని గమనించారు.
బబూన్లకి ఐదేళ్ళు(మనుష్యుల 20 సంవత్సరాలకి సమానం)వచ్చేసరికి గుండె పనితీరు పూర్తిగా క్షీణించిపోయింది.

ఆరోగ్యకరమైన పిల్లలు కావాలనుకుంటే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం ముఖ్య భూమిక పోషిస్తుంది.గర్భం ధరించడానికి ముందూ గర్భవతులుగా ఉన్నప్పుడూ తల్లుల పోషకాహారం మీద సమాజం శ్రద్ధ పెడితే అవయవలోపం ఉన్న పిల్లలు పుట్టరని వ్యోమింగ్ యూనివర్సిటీ(అమెరికా)ప్రొఫెసర్ పీటర్ నాథనిఎల్జ్ చెప్పారు.
జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ జర్నల్లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురించారు.



Click it and Unblock the Notifications
