Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
గర్భిణీలు నేరేడు పండ్లు తినడం సురక్షితమేనా...
సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం.
సాధారణంగా ఉండే మనుష్యుల వీటిని తీసుకోవడం సహజం. అయితే గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు వీటిని తినడం ఆరోగ్యకరమా ? అన్న అపోహ చాలా మందిలో ఉంది. ఈ స్వీట్ నేటివ్ ప్రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అయితే కొంత మంది ఈ ఫ్రూట్ గర్భిణీలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ చర్మం రంగులో మార్పులు వస్తాయని, చర్మం మీద బ్లూ కలర్ మార్క్స్ ఏర్పడుతాయని అంటుంటారు. అయితే దీనికి ఎటువంటి క్లీనికల్ నిర్ధారణ లేదు.
హెల్తీ ప్రెగ్నెన్సీ పొందడానికి బ్లాక్ జామున్ (నేరుడు పండ్లను )మితంగా తీసుకోవడం మంచిది . ప్రెగ్నెన్సీలో బ్లాక్ జామున్ ను మితంగా తినడం వల్ల హెల్తీ ప్రెగ్నెన్సీ పొందవచ్చు. నేరుడు పండ్లలో ఉండే హై యాంటీఆక్సిడెంట్ కంటెంట్ మరియు న్యూట్రీషియన్స్ ఫీటస్ కు రక్షణ కల్పిస్తుంది మరియు ఫీటల్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. ఇంకా బిడ్డ పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి, గర్భిణీలు నేరుడు పండ్లను మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు . ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది:
నేరేడు పండ్లలో క్యాల్షియం, విటమిన్ సి, ఐరన్, మరియు పొటాషయం అధికంగా ఉన్నాయి . ఇవి గర్భిణీ స్త్రీలో ఎముకల ఆరోగ్యాన్నికి చాలా అవసరం. ఇవి ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఫ్రూట్ లో ఉండే న్యూట్రీషియన్స్ పొట్టలోని బేబీ డెవలప్ మెంట్ మరియు గ్రోత్ కు గ్రేట్ గా సహాయపడుతాయి.

2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
బ్లాక్ జామూన్నే బ్లాక్ ప్లమ్ గా పిలుస్తారు. ఈ బ్లాక్ ప్లమ్ పాపులర్ ట్రెడిషినల్ ఫ్రూట్, గర్భిణీ స్త్రీలలో డయోరియా మరియు స్టొమక్ అల్సర్ నివారణకు ఎఫెక్టివ్ హోం రెమెడీ. గర్భిణీలు వీటిని మితంగా తీ సుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అల్సర్, మలబద్దకం వంటి సమస్యలను నివారించుకోవచ్చు.

3. డయాబెటిస్ ను రెగ్యులేట్ చేస్తుంది:
బ్లాక్ జామూన్ లో గ్లిజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. గర్భిణీ లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. నేరుడు పండ్లలో యాంటీడయాబెటిక్ లక్షణాలు బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను 30శాతం వరకూ తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్ ను నివారించుకోవడానికి ఈ నేరుడు పండ్లను తీసుకోవచ్చు.

4. క్యాన్సర్ నివారిణి:
నేరుడు పండ్లలో క్యాన్సర్ కు సంబంధించిన కీమో ప్రొటక్టివ్ మరియు రేడియో ప్రొటెక్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . గర్భిణీలు వీటిని తినడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. బ్లాక్ ప్లమ్ తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు.

5. ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:
నేరుడు పండ్లు మాత్రమే కాదు, ఆకులు, బెరడు, విత్తనాలు, హానికరమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది . బ్లాక్ ప్లమ్ ప్లాంట్ లో ఆక్సాలిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, టానిన్స్, గాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మలేరియల్ మరియు గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ ప్రయోజనాలను అందిస్తాయి. వీటి వల్ల గర్భిణీ స్త్రీలు వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసుకోవచ్చు.

6. ఓరల్ హెల్త్:
నేరుడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వివిధ రకాల ఓరల్ హెల్త్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

7. అనీమియా నివారిస్తుంది:
నేరుడు పండ్లలో ఉండే విటమిన్ సి హీమోగ్లోబిన్ కౌంట్ పెంచుతుంది. కాబట్టి గర్భిణీలు నేరుడు పండ్లను మితంగా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే అనీమియాను తగ్గించుకోవచ్చు.



Click it and Unblock the Notifications











